ఎడ్జ్ స్టాలిన్ కే నట… ఎటు వైపు నుంచి చూసినా?

తమిళనాడు ఎన్నికలు ముగిశాయి. ఇక ఫలితాల కోసం ఎదురు చూపులు తప్పవు. మే 2వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దాదాపు ఇరవై రోజులు రిజల్ట్ కోసం [more]

Update: 2021-04-30 16:30 GMT

తమిళనాడు ఎన్నికలు ముగిశాయి. ఇక ఫలితాల కోసం ఎదురు చూపులు తప్పవు. మే 2వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దాదాపు ఇరవై రోజులు రిజల్ట్ కోసం వెయిటింగ్ తప్పదు. అయితే పోలింగ్ తర్వాత డీఎంకే కు ఎక్కువ అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈసారి ఖచ్చితంగా డీఎంకే అధికారంలోకి వస్తుందని పెద్దయెత్తున బెట్టింగ్ లు కూడా తమిళనాడులో జరుగుతుండటం విశేషం.

ఈ ఎన్నికల్లో గెలుపు…..

డీఎంకే అధినేత స్టాలిన్ కు ఈసారి జీవన్మరణ సమస్య. ఆయన పదేళ్లు పాటు అధికారానికి దూరంగా ఉన్నారు. దీంతో డీఎంకే ఆర్థికంగా, నైతికంగా ఇబ్బందులను ఎదుర్కొంది. తండ్రి మరణంతో అంతా తానే అయి పార్టీని నడిపించిన స్టాలిన్ గత ఏడాదిన్నరగా ఎన్నికలపైనే దృష్టి పెట్టారు. తమిళనాడులో పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేకపోయినా ఎందుకయినా మంచిదన్న ధోరణిలో ఎన్నికల వ్యూహకర్తగా స్టాలిన్ ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్నారు.

పీకే వ్యూహకర్తగా….

ప్రశాంత్ కిషోర్ టీం ఇచ్చిన మేరకే సీట్ల కేటాయింపులు జరిగాయి. తన మిత్రపక్షాలకు సయితం స్టాలిన్ నిర్మొహమాటంగా సీట్లను తగ్గించేశారు. డీఎంకే గుర్తు బలమేంటో చూపాలన్నది స్టాలిన్ అభిప్రాయం. అందుకే మిత్ర పక్షాల సహకారం లేకుండా ఈసారి అధికారంలోకి రావాలన్నది స్టాలిన్ ఆలోచన. ఈ మేరకు ఆయన ఏడాదిన్నరగా గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. తన పార్టీ అభ్యర్థుల ఎంపికను ఎప్పుడో పూర్తి చేశారు.

ప్రచారంలోనూ…..

ఇక ప్రచారంలోనూ స్టాలిన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. రజనీకాంత్ పార్టీ పెట్టకపోవడం స్టాలిన్ విజయావకాశాలు మరింత మెరుగుపర్చాయంటారు. కమల్ హాసన్ పార్టీ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేకపోవడంతో స్టాలిన్ లైట్ గా తీసుకున్నారు. ఇక ప్రచారంలోనూ ఉదయనిధి, స్టాలిన్, కనిమొళి వంటి నేతలు చేసిన ప్రసంగాలు కూడా ప్రజలను ఆకట్టుకున్నాయి. మొత్తం మీద ఎడ్జ్ స్టాలిన్ కే ఉందన్న కామెంట్స్ తమిళనాడు వ్యాప్తంగా వినపడుతున్నాయి. మరి స్టాలిన్ కు ఈసారైనా ముఖ్యమంత్రి పదవి దక్కుతుందా? లేదా? అన్నద చూడాల్సి ఉంది.

Tags:    

Similar News