తిరుపతిలో అభ్యర్థుల గుండె గుభేల్.. రీజనేంటంటే..!
తిరుపతి ఉప ఎన్నికల బరిలో నిలిచిన పార్టీల అభ్యర్థుల గుండెలు సూపర్ ఫాస్ట్ రైళ్ల కన్నా వేగంగా కొట్టు కుంటున్నాయి. అధికార వైసీపీ దీనికి మినహాయింపుగా ఉంది. [more]
తిరుపతి ఉప ఎన్నికల బరిలో నిలిచిన పార్టీల అభ్యర్థుల గుండెలు సూపర్ ఫాస్ట్ రైళ్ల కన్నా వేగంగా కొట్టు కుంటున్నాయి. అధికార వైసీపీ దీనికి మినహాయింపుగా ఉంది. [more]
తిరుపతి ఉప ఎన్నికల బరిలో నిలిచిన పార్టీల అభ్యర్థుల గుండెలు సూపర్ ఫాస్ట్ రైళ్ల కన్నా వేగంగా కొట్టు కుంటున్నాయి. అధికార వైసీపీ దీనికి మినహాయింపుగా ఉంది. మిగిలిన టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు మాత్రం గుండెలు అరచేతిలో పెట్టుకున్నారు. దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి .. డబ్బు. రెండు ప్రజానాడి. ఇప్పటి వరకు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ పార్టీలకు విజయం కనిపించినా.. ఫలితం విషయానికి వస్తే.. మాత్రం ఫుల్లుగా రివర్స్ అయిపోయింది. ఎన్నికల ప్రచారంలో తమకే ఓటు వేస్తామని చెప్పిన ప్రజలు గుండుగుత్తుగా వైసీపీకి గుద్దేశారు.
ప్రజలు ఎటు వైపు…?
దీంతో ఇప్పుడు తిరుపతిలోనూ ఇదే జరుగుతుందా ? అనేది టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లను వేధిస్తున్న ప్రశ్న. ఇక, వీటిలోనూ కాంగ్రెస్‌ను పక్కన పెడితే.. టీడీపీ, బీజేపీలు మరింతగా తర్జన భర్జన పడుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కుతుందని.. మెజారిటీ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలనను తమ ఖాతాలో వేసుకుంటామని అనుకుంది. కానీ, తీరా ఫలితం వచ్చే సరికి పూర్తిగా వెనుకబడింది. దీంతో ఇప్పుడు తిరుపతిలోనూ జననాడిని పట్టుకోలేక పోతోంది. బీజేపీ పరిస్థితి కూడా ఇలానే ఉంది. పైకి మాత్రం ప్రజలు తమ వెంటే ఉన్నారని చెప్పుకొంటున్నా.. లోలోన మాత్రం నాయకులు తర్జన భర్జన పడుతున్నారు.
ఖర్చు ఎలా?
ఇక, మరో కీలక అంశం.. ఎన్నికల్లో ఖర్చు. ఈ విషయంలో టీడీపీ, బీజేపీలది ఒక్కటే పరిస్థితిగా ఉంది. నిన్న మొన్నటి వరకు టీడీపీ నాయకులు స్థానిక ఎన్నికల్లో భారీగా ఖర్చు చేశారు.. పైకి అధికార పార్టీ వైసీపీనే ఖర్చు చేసిందని చెప్పుకొచ్చినా… తాము కూడా ఈ తంతులో భాగమేనని వారు ఒప్పుకొంటున్నారు. 'మేం కూడా ఖర్చు పెట్టాం. అయితే వైసీపీఅంతకాదు' అని నిజాయితీగా చెప్పుకొన్న నాయకులు ఉన్నారు.. ఇక, ఇప్పుడు తిరుపతిలో ఎంత ఖర్చు చేసినా సరిపోయే పరిస్థితి కనిపించడం లేదు. ఏడు నియోజకవర్గాల్లో ఓటర్లను సంతృప్తి పరచాలి.
వచ్చే వారికి… పోయేవారికి….
పైగా అభ్యర్థి తరఫున తిరుపతి ప్రచారానికి వచ్చేవారు ఇక్కడ ఉండేందుకు ప్రచారంలో వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించేందుకే కోట్లలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. పైగా మండువేసవి కావడంతో నాయకులు, ప్రజలను ప్రచారానికి రప్పించాలంటే మరింతగా కష్టపడడంతో పాటు భారీగా చేతిచమురు వదిలించుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు , బీజేపీ నాయకులు లెక్కలు వేసుకోలేక తల పట్టుకుంటున్నారు.. పోనీ.. ఇంత ఖర్చు చేసినా.. ఫలితం ఎలా ఉంటుందో అనే బెంగ వీరిని వెంటాడుతుండడం గమనార్హం.