Kuppam : పెద్దిరెడ్డి దెబ్బకు….బాబు ఫ్రస్టేషన్ పీక్ కు…?

కుప్పం మున్సిపల్ ఎన్నికలు రెండు ప్రధాన పార్టీలకు ఛాలెంజ్ గా మారింది. కుప్పం మున్సిపాలిటీని ఎలాగైనా కైవసం చేసుకునేందుకు వైసీపీ తొలి నుంచి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో [more]

Update: 2021-11-05 05:00 GMT

కుప్పం మున్సిపల్ ఎన్నికలు రెండు ప్రధాన పార్టీలకు ఛాలెంజ్ గా మారింది. కుప్పం మున్సిపాలిటీని ఎలాగైనా కైవసం చేసుకునేందుకు వైసీపీ తొలి నుంచి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో పరువు నిలబెట్టుకునేందుకు టీడీపీ కూడా సిద్ధమయింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో కుప్పం మున్సిపాలిటీని గెలుచుకుని తీరాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించి వెళ్లారు. ఇక నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడే మకాం వేయనున్నారు.

మరింత దెబ్బతీసేందుకు….

చంద్రబాబును మానసికంగా మరింతగా దెబ్బతీసేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి దృష్టి పెట్టారు ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని గట్టి దెబ్బే తీశారు. కుప్పం లో ఓటమిని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. తన నియోజకవర్గంలో కూడా టీడీపీిని ఓడిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రస్టేషన్ కు లోనవుతున్నారు. కుప్పంలో రెండు రోజుల పాటు పర్యటించి వచ్చిన చంద్రబాబు అమరావతిలోనే మకాం వేశారు.

అమరావతిలోనే….

కనీసం దీపావళికి హైదరాబాద్ కు కూడా వెళ్లలేదు. అక్కడ టీడీపీ అగ్రనేతలను దింపారు. స్థానిక నాయకత్వానికి ఇక్కడి నుంచే దశానిర్దేశం చేస్తున్నారు. ప్రతిరోజూ టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా నేతలతో మాట్లాడుతూ వారిలో చంద్రబాబు ధైర్యం నింపుతున్నారు. అదే సమయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సయితం కుప్పం మున్సిపాల్ ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని వ్యక్తిగతంగా తీసుకున్నారు.

కుప్పంలోనే మకాం….

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం మున్సిపాలిటీని సీరియస్ గా తీసుకుని అక్కడి నేతలతో రోజూ టచ్ లోకి వెళుతున్నారు. నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత అక్కడే మకాం వేయనున్నారు. దీంతో చంద్రబాబు ఫ్రస్టేషన్ పీక్ కు వెళ్లిపోయింది. చంద్రబాబు వ్యక్తిగతంగా పెద్దిరెడ్డిపై విమర్శలకు దిగుతుండటంతో ఖచ్చితంగా విజయం సాధించి చంద్రబాబుకు షాక్ ఇవ్వాలని పెద్దిరెడ్డి భావిస్తున్నారు. పెద్దిరెడ్డి అక్కడే మకాం వేయనుండటంతో చంద్రబాబు సీనియర్ నేతలను సయితం కుప్పంకు పంపేందుకు సిద్ధమయ్యారు. మొత్తం మీద కుప్పం మున్సిపాలిటీ మంత్రి పెద్దిరెడ్డి వర్సెస్ చంద్రబాబుగా మారిపోయింది.

Tags:    

Similar News