బీజేపీ అజెండా … టీడీపీ జెండా …?
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ని ఎలా కట్టడి చేయాలో చంద్రబాబు కు తెలిసినంతగా ఎవరికి తెలియదనే చెబుతారు. ఆ పార్టీ ఎప్పుడు ఎదిగే అవకాశం ఉన్నా చంద్రబాబు [more]
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ని ఎలా కట్టడి చేయాలో చంద్రబాబు కు తెలిసినంతగా ఎవరికి తెలియదనే చెబుతారు. ఆ పార్టీ ఎప్పుడు ఎదిగే అవకాశం ఉన్నా చంద్రబాబు [more]
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ని ఎలా కట్టడి చేయాలో చంద్రబాబు కు తెలిసినంతగా ఎవరికి తెలియదనే చెబుతారు. ఆ పార్టీ ఎప్పుడు ఎదిగే అవకాశం ఉన్నా చంద్రబాబు ఏ మాత్రం లైట్ తీసుకోరు. తక్షణమే రంగంలోకి దిగిపోతారు. వారు ఏ ఎజెండా చేపడితే చంద్రబాబు అదే స్లోగన్ ను వారికన్నా ముందే జనంలోకి తీసుకువెళ్ళడం కమలానికి ఏ మాత్రం మైలేజ్ రాకుండా చేయడం పరిపాటే. తాజాగా వినాయకచవితి ఉత్సవాల వివాదంపై చంద్రబాబు తన మార్క్ వ్యూహంతో కాషాయానికి మించి హడావిడి సృస్ట్టించేశారు. దాంతో బీజేపీ ఇప్పుడు ఖంగుతిన్నట్లే అయ్యింది.
అల్లరి మాములుగా లేదుగా …?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సర్కార్ ను ఇరుకునపెట్టేందుకు ఏ చిన్న మతపరమైన, కులపరమైన అవకాశం చిక్కినా బీజేపీ సీన్ లోకి దిగి రచ్చ మొదలు పెట్టేస్తుంది. గత సంఘటనల్లో అంతర్వేది రథం దగ్ధం కానీ, రామతీర్ధం ఇలా విగ్రహ విధ్వంసాల్లో కమలం వైసిపి సర్కార్ పై కన్నెర్ర ఇలా చేసిందో లేదో అంతే చంద్రబాబు అండ్ పార్టీ అంతకుమించి అల్లరి మొదలు పెట్టేస్తూ వస్తుంది. ఆ క్రెడిట్ వారి ఖాతాలోకి ఏ మాత్రం పోకుండా చూసుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. హిందూ ఓటు బ్యాంక్ కూడా పోతే టిడిపి పూర్తి డమ్మీ అయ్యే ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళనే తెలుగుదేశం హడావిడికి కారణంగా కనిపిస్తుంది.
ఉన్న ఓటు బ్యాంక్ అయినా …
ఒక పక్క జగన్ సర్కార్ ఎస్సి ఎస్టీ, మైనారిటీ, బిసి వర్గాలను సంక్షేమం పేరుతో తనవైపు ఆకర్షించేసుకున్నారు. మిగిలి వున్న ఓటు బ్యాంక్ కూడా బీజేపీ క్యాష్ చేసుకుంటే జరగబోయే నష్టం చంద్రబాబు కు అర్ధం అయ్యే కాషాయ దళం స్లోగన్ ఇచ్చిన వెంటనే యాక్షన్ లోకి దిగి పోతున్నారు. ఆయన తీరు తాజాగా వినాయకచవితి ఉత్సవాల కోసం కమలం చేపట్టిన ఆందోళన రాష్ట్ర వ్యాప్తం కాకుండా తన శ్రేణులతోను, అనుకూల మీడియా తో చంద్రబాబు క్యాష్ చేసేసుకున్నారు. ఇక ముందు కూడా బాబు ఇదే వ్యూహంతో బీజేపీ కి బ్రేక్ లు వేయడం ఖాయంగానే కనిపిస్తుంది. మరి దీన్ని ఆ పార్టీ ఎలా తిప్పికొడుతుందో చూడాలి.