సీమలో అంత సీన్ ఉందా… ?
తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఆపసోపాలు పడుతోంది. కంచుకోటలు అన్నీ ముంచేసి పోయిన వేళ మునిగిన చోటనే కొత్తగా వెతుక్కునే ప్రయత్నం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ [more]
తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఆపసోపాలు పడుతోంది. కంచుకోటలు అన్నీ ముంచేసి పోయిన వేళ మునిగిన చోటనే కొత్తగా వెతుక్కునే ప్రయత్నం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ [more]
తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఆపసోపాలు పడుతోంది. కంచుకోటలు అన్నీ ముంచేసి పోయిన వేళ మునిగిన చోటనే కొత్తగా వెతుక్కునే ప్రయత్నం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో గెలవడానికి ఉత్తర కోస్తా జిల్లాలే ప్రధాన కారణం. అక్కడ వందకు పైగా ఎమ్మెల్యే సీట్లు ఉంటే వాటిలో ఎనభై శాతానికి పీగా టీడీపీకి దక్కాయి. ఇక నాడు మోడీ, పవన్, బాబు కాంబోకు సీమ జిల్లాలు కూడా కొంత మొగ్గు చూపాయి. ఆ విధంగా చిత్తూరు, అనంతపురం, కర్నూలులలో కొన్ని సీట్లు టీడీపీ గెలుచుకుంది. 2019 నాటికి మొత్తం సీన్ మారింది. సీమలో వైసీపీ బలం తగ్గకపోగా ఉత్తరాంధ్రాలో కూడా పాగా వేసింది. గోదావరి జిల్లాలూ ఆ పార్టీకి సలాం కొట్టాయి.
అటు నుంచి ఇటు….
సీమ జిల్లాలకు చెందిన జగన్ ఉత్తరాంధ్రా ముఖ ద్వారం అయిన విశాఖను పాలనారాజధానిగా ఎంచుకున్నారు. ఆయన అక్కడ నుంచి పాలన చేయడం ద్వారా మరో మారు ఉత్తరాంధ్ర మీద పట్టు సాధించాలని చూస్తున్నారు. సీమలో కసికందకుండా ఉన్న బలానికి ఉత్తరాంధ్ర తోడు అయితే మళ్ళీ బంపర్ విక్టరీ ఖాయమన్నది వైసీపీ ఆలోచన. సరిగ్గా ఇక్కడే తెలుగుదేశం చిత్తు అవుతోంది. దాంతో జగన్ ఉత్తరాంధ్ర మీదకు వస్తే తాము రాయలసీమలో బలం పెంచుకోవాలని ఇపుడు టీడీపీ కొత్త ఆలోచనలు చేస్తోంది.
అదే మైనస్ ….
తెలుగుదేశం పార్టీకి కోస్తా ముద్ర గట్టిగా ఉంది. చంద్రబాబు రాయలసీమ వాసి అయినా కృష్ణా జిల్లా అల్లుడుగానే పేరు తెచ్చుకున్నారు. పైగా ఆయన సీఎం గా ఉండగా రాయలసీమకు చేసింది ఏదీ లేదు అన్నది నాలుగు జిల్లాల సీమ ప్రజల భావన. చేతిలో అవకాశం ఉన్నపుడు కనీసం హై కోర్టు అయినా కర్నూలుకి బాబు మంజూరు చేయలేదన్నది కూడా ప్రధాన అభియోగం. ఇక అమరావతి రాజధాని మీద సీమ ప్రాంతానికి ఎటూ ఆగ్రహం ఉంది. చంద్రబాబు విషయం ఇలా ఉంటే లోకేష్ పూర్తిగా హైదరాబాదీగా ముద్ర పడిపోయారు. ఆయనకు సీమతో పెద్దగా కనెక్షన్లు లేవు. దీంతో ఇపుడు పెదబాబు, చినబాబు సీమలో పార్టీని ఎలా పటిష్టం చేస్తారు అన్నదే చర్చగా ఉంది.
నమ్ముతారా….?
తాముండగా చేయలేని పనులు ఇపుడు జగన్ సర్కార్ చేయాలని డిమాండ్ చేయడం లోకేష్ అమాయకత్వమే అంటున్నారు. ఆయన కర్నూలు టూర్ లో సీమలో పరిశ్రమలు పెట్టాలని, నీటి ప్రాజెక్టులు తీసుకురావాలని కోరారు. ఇలా చేయడం వల్ల జనం తమ వైపు టర్న్ అవుతారు అని లోకేష్ భావిస్తే అది భ్రమేనని టీడీపీ తమ్ముళ్ళే అంటారు. ఇక దూకుడు తో కూడిన రాజకీయాన్ని సీమ జనం ఇష్టపడతారు. అలాగే మాట మీద నిలబడేవారిని కూడా వారు లైక్ చేస్తారు. మరి మాటలతో దూకుడు చేస్తున్న లోకేష్ కానీ చంద్రబాబు కానీ తాము చెప్పిన మాట మీద నిలబడగలరా అన్నదే ప్రశ్న. అలాగే జగన్ ని, వైఎస్సార్ ని సీమ బిడ్డలుగా ఇప్పటికే గుర్తించిన జనాలు వైసీపీని కాక తెలుగుదేశం వైపు టర్న్ కావాలంటే రెచ్చగొట్టుడు మాటలు కాదు, ఆచరణలో చాలా చేయాలి. అలా కనుక చూస్తే సీమ జనం విశ్వాసం పొందడానికి రానున్న మూడేళ్ళ కాలం టీడీపీకి ఏ మాత్రం సరిపోదేమో అన్న విశ్లేషణలు ఉన్నాయి.