అమరావతిలో దొంగలు పడ్డారా?

“అమరావతి లో భూములు కొన్నది ఒక సామాజిక వర్గమే. వారి ప్రయోజనాల కోసమే రాజధాని. ఇందులో వారు ఇన్ సైడ్ ట్రేడింగ్ కి పెద్ద ఎత్తున పాల్పడ్డారు.” [more]

Update: 2020-01-07 03:30 GMT

“అమరావతి లో భూములు కొన్నది ఒక సామాజిక వర్గమే. వారి ప్రయోజనాల కోసమే రాజధాని. ఇందులో వారు ఇన్ సైడ్ ట్రేడింగ్ కి పెద్ద ఎత్తున పాల్పడ్డారు.” ఇది వైసీపీ అధికారంలోకి వచ్చే ముందు వచ్చిన తరువాత బాగా చేసిన విమర్శలు, ఆరోపణలు. వీటిని ఏపీ ప్రజలు బాగా విశ్వసించారు కూడా. అందుకే రాజధాని ప్రాంతంతో సహా రాష్ట్రమంతా వైసీపీ గాలి ప్రభంజనమై వీచింది. తమ సర్కార్ వచ్చాక భూముల బాగోతం పై దర్యాప్తు జరిపి దోషుల సంగతి తేల్చేస్తామని కూడా చెప్పింది. తరువాత క్రమంలో వారి పేర్లు వివరాలు మీడియా ముందు వైసీపీ పెట్టేసింది. ఇంతవరకు బాగానే వుంది.

ఆరోపణలకు గురైనవారు ఒక్కరొక్కరుగా…

వైసీపీ ఆరోపణలకు గురైన టిడిపి నేతలంతా ఒక్కరొక్కరుగా బయటకువచ్చి చిత్రంగా తమ వాదన వినిపిస్తున్నారు. అయితే వీరు భూములు కొనలేదని మాత్రం ఎవరూ చెప్పడం లేదు. కొన్నామని అయితే ప్రకటించాక కొంటే తప్పేంటి అని వాదిస్తున్నారు ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటివారు. ఇక కంభంపాటి రామ్మోహన రావు వంటివారు పరువు పొయింది అంటూ కేసులు వేస్తామని ప్రకటించారు. తాను కొన్నది ఒక్క ఎకరమేనంటూ చెబుతున్నారు. మరికొందరు తాము కొన్నామని కాని, కొనలేదని గాని చెప్పడం లేదు. ఇటువంటి వారిలో పయ్యావుల కేశవ్, పరిటాల సునీత వంటి వారు ఉన్నారు.

అయిన వారికే…

ప్రత్తిపాటి పుల్లారావు, వేమూరి రవి వంటివారు ఎవరి వాదన వాళ్ళు మీడియా ముందు చెప్పుకుని ప్రజల్లోకి తీసుకువెళ్లారు. అయితే ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే అంటూ వైసీపీ చేసిన చేస్తున్న ఆరోపణలను వీరంతా పరోక్షంగా అంగీకరించినట్లు అయ్యిందనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఎస్సీ, బీసీ, మైనారిటీ లెవ్వరూ తమ కొంప మునిగింది అనడం కనిపించకపోవడం తో అయినవారికే ఆకుల్లో వడ్డించారని తెలిపోయిందంటున్నారు వైసీపీ వర్గాలు. ఈ అంశం ప్రజల్లోకి బాగా వెళ్లిందండి అందుకే నిరసనలకు దిగేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదనే ప్రచారం వైసీపీ మరింత ముమ్మరం చేస్తుంది.

Tags:    

Similar News