టీం ఇండియా కు అవమానం …?

టీం ఇండియా ఆస్ట్రేలియా గడ్డపై చరిత్ర సృష్ట్టించింది. టి ట్వంటీ సిరీస్ డ్రా చేయగా టెస్ట్, వన్డే సిరీస్ లను గెలుచుకుని దాదాపు వైట్ వాష్ చేసింది. [more]

Update: 2019-01-19 02:30 GMT

టీం ఇండియా ఆస్ట్రేలియా గడ్డపై చరిత్ర సృష్ట్టించింది. టి ట్వంటీ సిరీస్ డ్రా చేయగా టెస్ట్, వన్డే సిరీస్ లను గెలుచుకుని దాదాపు వైట్ వాష్ చేసింది. 70 ఏళ్ల క్రికెట్ చరిత్రలో అసాధారణ విజయాలను నమోదు చేసి రికార్డ్ లను తిరగరాసింది. ఇంతటి ఘనకీర్తి సాధించిన ఇండియన్ క్రికెట్ టీం కు ప్రైజ్ మని విషయంలో కానీ వన్డే సిరీస్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కించుకున్న మాజీ కెప్టెన్ ధోనికి తీరని అవమానం అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెగేలా చేస్తుంది.

ధోనికి ఇచ్చే బహుమానం ఇదా ..?

క్రికెట్ ఆస్ట్రేలియా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ను అందుకున్న ధోనికి 500 ల డాలర్లు బహుకరించింది. ఇది దాదాపు 35 వేలరూపాయలు కావడం ఇప్పుడు వివాదాన్ని సృష్ట్టించింది. క్రికెటర్ల ఆటపై ప్రసార మాధ్యమాల ద్వారా కోట్లాది రూపాయలు సముపార్జిస్తున్న క్రికెట్ ఆస్ట్రేలియా ఇలా ముష్టి వేసిన తీరులో అతి తక్కువ మొత్తాన్ని ప్రపంచ అత్యున్నత క్రికెటర్ కి ఇవ్వడం ఏమిటని నెటిజెన్ల ఫైర్ అవుతున్నారు. వీరి ఆవేశానికి ఆగ్రహానికి మాజీ భారత క్రికెటర్ గవాస్కర్ తోడైయ్యారు. అభిమానుల వాదన నిజమేనని ఇలా ఇచ్చి అవమానిస్తారా అంటూ చెలరేగారు గవాస్కర్. ఇప్పుడు ఈ వార్ ఎక్కడ దాకా దారితీస్తుందో తెలియడం లేదు. క్రికెట్ ఆస్ట్రేలియా తీరుపై ఒక్క భారత అభిమానులే కాదు ప్రపంచం క్రికెట్ అభిమానులు నివ్వెరపోతున్నారు.

Tags:    

Similar News