తేజస్విని దెబ్బతీసింది అదేనా?

తేజస్వి యాదవ్ నాయకత్వం పట్ల బీహార్ ప్రజలు నమ్మకం ఉంచారనే చెప్పాలి. అధికార పార్టీకి ధీటుగా తేజస్వి యాదవ్ నేతృత్వం వహించిన మహాకూటమి స్థానాలను కైవసం చేసుకుంది. [more]

Update: 2020-11-10 17:30 GMT

తేజస్వి యాదవ్ నాయకత్వం పట్ల బీహార్ ప్రజలు నమ్మకం ఉంచారనే చెప్పాలి. అధికార పార్టీకి ధీటుగా తేజస్వి యాదవ్ నేతృత్వం వహించిన మహాకూటమి స్థానాలను కైవసం చేసుకుంది. అయితే తేజస్వి యాదవ్ కు కాంగ్రెస్ దెబ్బతీసిందనే చెప్పాలి. కూటమిలోని కాంగ్రెస్ పార్టీయే తేజస్వి యాదవ్ కొంప ముంచిందనుకోవాలి. 243 స్థానాలున్న బీహార్ రాష్ట్రంలో మహాకూటమి ఏర్పడింది. అయితే ఎక్కువ స్థానాలను కాంగ్రెస్ కు ఇవ్వడం ఫలితంపై ప్రభావం చూపిందనుకోవాలి.

నాయకత్వంపై…..

తేజస్వియాదవ్ నాయకత్వాన్ని తొలినాళ్లలో ఎవరూ నమ్మలేదు. చిన్న వయసు కావడం మహాకూటమికి నేతృత్వం వహించడం ఇష్టం లేని మాంఝీ నేతృత్వంలోని పార్టీ బయటకు వెళ్లిపోయింది. అయినా తేజస్వి యాదవ్ వెరవలేదు. తన నాయకత్వంలోనే మహాకూటమి ఎన్నికలకు వెళుతుందని ఆయన ప్రకటించారు. అలాగే సీట్ల పంపకంలోనూ జాగ్రత్తలు తీసుకున్నారు. ఆర్జేడీకి అత్యధిక స్థానాలు తీసుకున్నారు.

కాంగ్రెస్ కు ఎక్కువ స్థానాలను…..

కానీ కాంగ్రెస్ కు 70 స్థానాలను కేటాయించారు. దేశవ్యాప్తంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ బీహార్ ఎన్నికల్లోనూ తేజస్వియాదవ్ ను దెబ్బతీసింది. కాంగ్రెస్ 20 స్థానాల్లోనూ విజయం సాధించలేకపోయింది. శరద్ యాదవ్ కుమార్తె సుభాషిణి, శతృఘ్నసిన్హా కుమారుడు లవ్ సిన్హా వంటి వారికి టిక్కెట్లు కేటాయించినా ఫలితం లేకపోయింది. అదే స్థానాలను ఆర్జేడీ తీసుకుని ఉంటే మరికొన్ని స్థానాలను తేజస్వియాదవ్ కైవసం చేసుకునే అవకాశం ఉండేదన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి.

ఎల్జేపీ కూడా పరోక్షంగా…..

దీంతో పాటు లోక్ జన్ శక్తి పార్టీ కూడా తేజస్వియాదవ్ ను కోలుకోలేని దెబ్బతీసిందనే చెప్పాలి. చిరాగ్ పాశ్వాన్ కు చెందిన ఎల్జేపీ 52 స్థానాల్లో పోటీ చేసింది. ఈ స్థానాల్లో ఆర్జేడీ విజయానికి ఎల్జీపీ బ్రేకులు వేసిందనే చెప్పాలంటున్నారు. పోలింగ్ సరళిని పరిశీలిస్తే తేజస్వియాదవ్ నాయకత్వానికి బీహారీలు జైకొట్టారనే చెప్పాల్సి ఉంటుంది. తన తండ్రి లాలూ యాదవ్ ఎన్నికల సమయంలో జైలులో ఉన్నప్పటికీ అంతా తానే అయి నడిపించిన తేజస్వి యాదవ్ లీడర్ అన్నది ప్రూవ్ చేసుకున్నారు. ఆర్జేడీకి భవిష్యత్ తేజస్వి యాదవ్ అన్నది ఈ ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టమయింది.

Tags:    

Similar News