భవిష్యత్ అంతా తేజస్విదే….?

తేజస్వి యాదవ్ … బీహార్ ఎన్నికల్లో దూసుకు వచ్చిన యువనేత. కేవలం 31 ఏళ్లకే రాజకీయాల్లో అన్ని విషయాలను ఆకళింపు చేసుకున్నారు. నిజానికి తేజస్వియాదవ్ ఓడిపోలేదు. ఆయన [more]

Update: 2020-11-11 18:29 GMT

తేజస్వి యాదవ్ … బీహార్ ఎన్నికల్లో దూసుకు వచ్చిన యువనేత. కేవలం 31 ఏళ్లకే రాజకీయాల్లో అన్ని విషయాలను ఆకళింపు చేసుకున్నారు. నిజానికి తేజస్వియాదవ్ ఓడిపోలేదు. ఆయన నైతికంగా గెలిచినట్లే లెక్క. ఇన్నాళ్లూ తేజస్వియాదవ్ పై నమ్మకం లేదనే విమర్శలకు ఆయన ఈ ఎన్నికల ద్వారా చెక్ పెట్టారనే చెప్పాలి. ఎక్కడ మోదీ.. ఎక్కడ నితీష్ కుమార్.. వయసులోనూ, రాజకీయ అనుభవంలోనూ ఏమాత్రం సరితూగని తేజస్వియాదవ్ ఒంటిచేత్తో కూటమిని విజయం అంచులదాకా తీసుకువచ్చారు.

చిన్న వయసులో……

నిజానికి ఆర్జేడీ ఇంకా కొన్ని చోట్ల పోటీ చేసి ఉంటే తేజస్వి యాదవ్ బీహార్ సీఎంగా చిన్న వయసులో బాధ్యతలను చేపట్టేవారు. కానీ కాంగ్రెస్ పార్టీ పూర్ పెర్ ఫార్మెన్స్ తో ఇబ్బంది పడాల్సి వచ్చింది. నిజంగా ఇది తేజస్వి యాదవ్ కు ఒక పెద్ద అనుభవమేనని చెప్పాలి. ఈ ఎన్నికల్లో కూటమి ఏర్పాటు నుంచి సీట్ల సర్దుబాటు వరకూ అంతా తేజస్వి యాదవ్ చూసుకున్నారు. చివరకు ప్రచారం కూడా మొత్తం తన భుజస్కంధాలపై వేసుకున్నారు.

మాటలు కాదు మరి….

ఈ ఎన్నికల్లో మహాకూటమి 110 స్థానాలను సాధించడమంటే మాటలు కాదు. మోదీ ఇమేజ్ ఒకవైపు. నితీష‌ కుమార్ అనుభవం మరొక వైపు తనను సవాల్ చేస్తున్నా తేజస్వి యాదవ్ ఈ ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కొన్నారనే చెప్పాలి. ఒక్కరోజులో పదహారు ర్యాలీల్లో పాల్గొని రికార్డు సృష్టించడం కూడా తేజస్వి యాదవ్ సొంతమయింది. ఇలా తేజస్వి యాదవ్ బీహార్ ఎన్నికలలో పరిణితి చెందిన రాజకీయ నేతగా అవతరించారనే చెప్పాలి.

ఫ్యూచర్ ఉన్న నేత……

నిజానికి తేజస్వి యాదవ్ కు ఎంతో ఫ్యూచర్ ఉంది. వయసు చిన్నది కావడంతో రానున్న కాలంలో బీహార్ కు ఆయనే ముఖ్యమంత్రి అవ్వడం ఖాయంగా కన్పిస్తుంది. నితీష్ కుమార్ ఇవే తనకు చివరి ఎన్నికలని ప్రకటించడంతో వచ్చే ఎన్నికల నాటికి తేజస్వి యాదవ్ మరింత పుంజుకుంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఐదేళ్ల పాటు పార్టీని కాపాడుకోవడంతో పాటు, క్యాడర్ ను పట్టించుకుంటే భవిష్యత్ అంతా తేజస్విదేనన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News