ఏ క్యా హోగయా…??

నిన్న మొన్నటి వరకూ ఆయనకు పార్టీలో తిరుగులేదు. ఉప ఎన్నికల్లో గెలుపు ఆయన ఖాతాలోనే పడింది. దీంతో జాతీయ స్థాయిలో ఇమేజ్ అమాంతంగా పెరిగింది. కానీ లోక్ [more]

Update: 2019-06-01 18:29 GMT

నిన్న మొన్నటి వరకూ ఆయనకు పార్టీలో తిరుగులేదు. ఉప ఎన్నికల్లో గెలుపు ఆయన ఖాతాలోనే పడింది. దీంతో జాతీయ స్థాయిలో ఇమేజ్ అమాంతంగా పెరిగింది. కానీ లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం ఆయన ప్రభ మసకబారింది. పార్టీలోనే అసంతృప్తులతు బయలుదేరే పరిస్థితి. ఒకవైపు తండ్రి జైలులో ఉండటం, సోదరుడు సహాయ నిరాకరణ చేయడం వంటి వాటితో సతమతమవుతున్నారు. ఆయనే ఆర్జేడీకి అధినేతగా చలామణి అవుతున్న తేజస్వి యాదవ్.

బలమైన ఓటు బ్యాంకు ఉన్నా….

బీహార్ రాష్ట్రంలో లాలూప్రసాద్ యాదవ్ స్థాపించిన రాష్ట్రీయ జనతాదళ్ కు బలమైన ఓటు బ్యాంకు ఉంది. ముఖ్యంగా ఆయన సామాజికవర్గంతో పాటు ముస్లింలు, దళితులు కూడా పార్టీపట్ల ఆకర్షితులను చేసుకోగలిగారు లాలూయాదవ్. అందుకే లాలూయాదవ్ అంటే బీహార్ లో అంత క్రేజ్. అయితే అది నిన్నటి మాట. లాలూ యాదవ్ పశుగ్రాసం కేసులో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. దీంతో తేజస్వీ యాదవ్ అన్నీ తానే అయి చూసుకున్నారు.

లాలూ సూచనలతోనే….

అయితే జైలులో ఉన్న తండ్రి లాలూయాదవ్ సలహాలు స్వీకరించిన తర్వాతనే తేజస్వి నిర్ణయాలు తీసుకుంటారని చెబుతున్నారు. అభ్యర్థుల ఎంపికలోనూ, కూటమి ఏర్పాటులోనూ లాలూ సూచనలతోనే తేజస్వి ముందడగు వేశారంటారు. అయితే బీహార్ లోక్ సభ ఫలతాలు ఆర్జేడీని తేరుకోనివ్వకుండా చేశాయి. మొత్తం 40 స్థానాలున్న బీహార్ లో 39 స్థానాలను ఎన్డీఏ కూటమి గెలుచుకుంది. ఒక్క స్థానం కాంగ్రెస్ దక్కించుకుంది. లాలూ పార్టీకి ఒక్క స్థానమూ దక్కలేదు. దీంతో పార్టీలో అసంతృప్తి బయలుదేరిందంటున్నారు.

తేజస్వి వైపు…

దారుణ ఓటమికి ప్రధాన కారణం తేజస్వీవైపే వేలు చూపిస్తున్నారు ఆర్జేడీ నేతలు. లోక్ సభ ఎన్నికల ఫలితాలతో నితీష్ కుమార్ మరింత బలపడ్డారని భావించడంతో ఆర్జేడీ నేతలు జేడీయూ వైపు చూస్తున్నారు. దీంతో తేజస్వీ యాదవ్ నాయకత్వంపై చర్చ జరుగుతోంది. అయితే ఎవరు పార్టీ నుంచి వెళ్లిపోయినా అభ్యంతరం లేదని తేజస్వి అంటున్నారు. పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని ముందుకు వెళతామంటున్నారు. మొత్తం మీద బీహార్ లో లాలూ తనయుడు తేజస్వి ఇమేజ్ భారీగా డ్యామేజీ అయినట్లే కన్పిస్తుంది.

Tags:    

Similar News