ఫస్ట్ లిస్ట్ రెడీ…. ఛాన్స్ ఎవరికో..?

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం దగ్గరకు వచ్చింది. తెలంగాణలో మంత్రివర్గం ఏర్పాటుకు ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలో మంత్రివర్గం ఏర్పాటు చేయాలని [more]

Update: 2019-01-31 02:30 GMT

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం దగ్గరకు వచ్చింది. తెలంగాణలో మంత్రివర్గం ఏర్పాటుకు ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలో మంత్రివర్గం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు ఎవరిని క్యాబినెట్ లోకి తీసుకోవాలనే దానిపై ఆయన ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే లిస్టు ఫైనల్ చేసి వచ్చే నోల మొదటి వారం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. అయితే, తెలంగాణలోని అసెంబ్లీ స్థానాలను బట్టి 18 మందిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. 18 మందిలో కేసీఆర్, మహమూద్ అలీని మినహాయిస్తే 16 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కాగా, మొదట 10 మందిని మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకోవాలని కేసీఆర్ యోచిస్తున్నారని తెలుస్తోంది. మరో ఆరు స్థానాలను కొన్ని రోజుల పాటు ఖాళీగా ఉంచనున్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిపి మిగతా ఆరు ఖాళీలను భర్తీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. 2014లోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే ఫార్ములా అమలు చేశారు.

రెండు విడతల్లోనేనా..?

రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చి నెలన్నర దాటిపోయింది. మంత్రివర్గంలో స్థానం కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోటి ఆశలు పెట్టుకున్నారు. అయితే, అధినేత మాత్రం ఏ విషయం తేల్చకుండా వాయిదా వేస్తూ వచ్చారు. యాగం తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వార్తలు వచ్చినట్లు ఆయన ఇప్పుడు మంత్రివర్గ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. అయితే, పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నందున, ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు పార్టీలో చేరే అవకాశం ఉన్నందున వారిని కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో ముందుగా 10 మందిని మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ 10 మందిలో ఎవరికి చోటు దక్కుతుంది అనేది ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఉత్కంఠకు గురిచేస్తోంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపాదికన మొదటి విడతలో 10 జిల్లాల నుంచి 10 మందికి అవకాశం దక్కుతుందని అంటున్నారు.

సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకొని..

హోంమంత్రి మహమూద్ అలీ హైదరాబాద్ కు చెందిన వారు అయినా హైదరాబాద్ నుంచి మరొకరికి అవకాశం ఇస్తారని తలుస్తోంది. ఇక, సామాజకవర్గ సమీకరణలను కూడా ముఖ్యమంత్రి బేరీజు వేస్తున్నారట. గత క్యాబినెట్ లో మహిళలను క్యాబినెట్ లోకి తీసుకోలేదనే విమర్శలు ఉన్నందున ఈసారి మొదటి విడతలోనే మహిళా మంత్రికి అవకాశం ఇవ్వనున్నారు. ఈ రేసులో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ముందున్నారు. ఇక, దళితుల్లో ఇద్దరికి అవకాశం ఉంటుందని, అందులో మాదిగ సామాజకవర్గానికి చెందిన వారికి ఒకరికి, మాల సామాజకవర్గానికి చెందిన వారికి ఒకరికి అవకాశం ఉంటుందంటున్నారు. ఇక, ఎస్టీల నుంచి కూడా మొదటి విడతలోనే ఒకరికి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ఈ కోటాలో

మెదక్ లో ముగ్గురిలో ఎవరెవరికి..?

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ కు బెర్త్ ఖరారైందని ప్రచారం జరుగుతోంది. అదే జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు కూడా మంత్రి పదవి ఖాయమే అంటున్నారు. ఇక, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారనేది ఆసక్తికరంగా ఉంది. హరీష్ రావుతో పాటు కేటీఆర్, మహిళా కోటాలో పద్మా దేవేందర్ రెడ్డి మొదక్ జిల్లా నుంచి తీసుకోవాల్సి వస్తుంది అయితే, ఒకే జిల్లా నుంచి మొదటి విడతలోనే ముగ్గురుని తీసుకునే అవకాశం లేదని, ప్రస్తుతం పార్టీ వ్యవహారాల్లో బిజీగా ఉన్న కేటీఆర్ ను రెండో విడతలో మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఇన్నిరోజులకు సస్పెన్స్ ను కొంచెం తెరదించుతున్నా… పూర్తిస్థాయి మంత్రివర్గం కాకపోవడంతో ఫస్ట్ ఫేజ్ లో అవకాశం దక్కని ఆశావహులకు ఎదురుచూపులు తప్పేలా లేవు.

Tags:    

Similar News