Huzurabad : రెండేళ్ల కోసం ఇంత ఖర్చా?

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుుడు జరుగుతుందో తెలియదు. అధికార పార్టీ నేతల్లో మాత్రం టెన్షన్ తప్పడం లేదు. ఎప్పుడు జరిగినా ఫలితం తమవైపు ఉండాలన్న కేసీఆర్ ఆదేశాలతో [more]

Update: 2021-09-30 09:30 GMT

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుుడు జరుగుతుందో తెలియదు. అధికార పార్టీ నేతల్లో మాత్రం టెన్షన్ తప్పడం లేదు. ఎప్పుడు జరిగినా ఫలితం తమవైపు ఉండాలన్న కేసీఆర్ ఆదేశాలతో నేతలు టెన్షన్ పడుతున్నారు. ప్రధానంగా ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా కేవలం రెండేళ్లు మాత్రమే ఎమ్మెల్యే పదవి ఉంటుంది. ఆ తర్వాత మరోసారి ఎన్నికల బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ ఖర్చు చేస్తే వచ్చే ఎన్నికల్లో మరింత ఖర్చు చేస్తేనే విజయం వరిస్తుంది. ఇదే అధికార పార్టీనేతలను కలవరపెడుతుంది.

ఇప్పుడు గెలిచినా….

హుజూరాబాద్ లో టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నుంచి వచ్చిన ఆయన ఈ ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు లేకపోయినా నియోజకవర్గంలో పర్యటిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఇప్పుడు తమ పార్టీ చేస్తున్న ఖర్చు చూస్తుంటే ఆయనకు కళ్లు తిరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అంత ఖర్చు చేయగలమా? అన్న కలవరం మొదలయింది.

గెల్లులో టెన్షన్…

తెలంగాణలో 2023లో ఎన్నికలు జరగనున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికల మరో రెండు నెలలు వరకూ జరిగే అవకాశం కన్పించడం లేదు. అంటే గట్టిగా ఇప్పుడు హుజూరాబాద్ లో గెలిచినా కేవలం రెండేళ్లు మాత్రమే ఎమ్మెల్యే పదవిలో ఉంటారు గెల్లు శ్రీనివాస్ యాదవ్. ఆ తర్వాత జరిగే జనరల్ ఎన్నికల్లో గెలుపోటములు చెప్పలేం. ఇక బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నారు.

ఈటల కూడా….

ఇప్పుడు హుజూరాబాద్ లో ఓటర్లకు అలవాటు చేస్తే వచ్చే ఎన్నికల్లో కూడా ఇంతకంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుందని ఈటల ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఫలితం ఎలా వచ్చినా, వచ్చే ఎన్నికలు తనకు ముఖ్యం. టీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోతుందన్న అంచనాలో ఈటల రాజేందర్ ఉన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో గెలిచేందుకు హుజూరాబాద్ ఓటర్లకు పెద్దగా ఖర్చు పెట్ట కూడదని డిసైడ్ అయ్యారంటున్నారు.

Tags:    

Similar News