Huzurabad : ఓడిపోతే అదే కారణమా?

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో హోరా హోరీ పోరు సాగుతుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార టీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతుంది. అయితే నామినేషన్లు ముగిసిన తర్వాత టీఆర్ఎస్ [more]

Update: 2021-10-25 11:00 GMT

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో హోరా హోరీ పోరు సాగుతుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార టీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతుంది. అయితే నామినేషన్లు ముగిసిన తర్వాత టీఆర్ఎస్ లో భయం మొదలయింది. గుర్తులతో గల్లంతవుతామన్న బెంగ పట్టుకుంది. అందుకే ఓటర్లను గుర్తు విషయంలో చైతన్యవంతుల్ని చేయాలని, అవసరమైతే పోలింగ్ సిబ్బందిని ఓటర్లు సంప్రదించేలా చర్యలు తీసుకోవాలని అధినాయకత్వం లోకల్ లీడర్లకు సూచనలు చేసింది.

ఆ రెండు గుర్తులు…

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్యనే ఉంది. అయితే స్వతంత్ర అభ్యర్థులు టీఆర్ఎస్ కు తలనొప్పిగా మారారు. వారికి ఎన్నికల గుర్తు కేటాయించడంతో కారుతో పోలిన గుర్తులు ఉండటం ఇబ్బందికరంగా మారింది. గతంలో కొన్ని గుర్తులు తమకు ఇబ్బందికరంగా ఉన్నాయని, కారు గుర్తును పోలి ఉండటంతో ఓటర్లు కన్ఫ్యూజన్ కు గురి అవుతున్నారని ఎన్నికల కమిషన్ కు టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది.

గుర్తుపై ప్రచారం….

దీంతో టీఆర్ఎస్ చెప్పిన గుర్తులను ఎన్నికల కమిషన్ తొలగించింది. అయితే ఈ ఎన్నికల్లో ఒక అభ్యర్థికి రోడ్డు రోలర్, మరో అభ్యర్థి కి చపాతీ రోలర్ ను కేటాయించారు. ఈ రెండు గుర్తులు కూడా కారు గుర్తును పోలి ఉండటంతో టీఆర్ఎస్ నేతల్లో ఆందోళన మొదలయింది. దీంతో ప్రచారంలో గుర్తుతో పాటు అభ్యర్థి పేరును చూసి ఓటెయ్యాలని హుజూరాబాద్ లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

అదే కారణం కాకూడదని….

పేర్లను చూసి ఓటెయ్యాలని, గుర్తును చూసి కన్ఫ్యూజన్ కావద్దని టీఆర్ఎస్ నేతలు అన్ని సభల్లో చెబుతున్నారు 2019 ఎన్నికల్లో రోడ్డు రోలర్ టీఆర్ఎస్ ను ముంచింది. భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఓటమి పాలవ్వడానికి రోడ్డు రోలర్ గుర్తు కారణం. ఐదు వేల ఓట్లతో నర్సయ్య గౌడ్ ఓటమి పాలయితే రోడ్డు రోలర్ అభ్యర్థికి 27 వేల ఓట్లు వచ్చాయి. దీంతో మరోసారి అదే తప్పు రిపీట్ కాకుండా టీఆర్ఎస్ అన్ని చర్యలు తీసుకుంటుంది. టీఆర్ఎస్ నేతలకు రోడ్డు రోలర్ గుర్తు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

Tags:    

Similar News