Huzurabad : ఏమయింది….. సారూ… కారుకి….?

హుజూరాబాద్ ఉప ఎన్నిక దేశంలో అత్యంత ఖరీదైన ఎన్నికగా భావించాలి. వందల కోట్లను అక్కడ కుమ్మరించారు. బీజేపీ, టీఆర్ఎస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే ఇక్కడ గెలుపోటములు [more]

Update: 2021-11-02 09:30 GMT

హుజూరాబాద్ ఉప ఎన్నిక దేశంలో అత్యంత ఖరీదైన ఎన్నికగా భావించాలి. వందల కోట్లను అక్కడ కుమ్మరించారు. బీజేపీ, టీఆర్ఎస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే ఇక్కడ గెలుపోటములు పక్కన పెడితే దళిత బంధు పథకం ఇక్కడ పెద్దగా వర్క్ అవుట్ అయినట్లు కన్పించలేదు. ఈ పథకంపైనే అధికార టీఆర్ఎస్ నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈటలపై వన్ సైడ్ విజయం సాధించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించారు. అందుకే సర్వే చేసి మరీ కేసీఆర్ గెల్లు శ్రీనివాస్ ను అభ్యర్థిగా నిర్ణయించారు.

ఫలితాలను బట్టి చూస్తే….

కానీ వస్తున్న ఫలితాలను చూస్తుంటే తొలి ఐదు రౌండ్లలో ఏ ఒక్క రౌండ్ లోనూ టీఆర్ఎస్ ఆధిక్యత కనపర్చకపోవడం విశేషం. దళిత బంధు పథకాన్ని కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే ప్రవేశపెట్టారంటారు. ఒక్కొక్క దళిత కుటుంబానికి పది లక్షలు ఇచ్చే పథకం దేశంలో ఎక్కడా లేదు. ప్రయోగాత్మకంగా దళిత బంధును హుజూరాబాద్ లోనే ప్రవేశపెట్టారు. ఇవన్నీ చూసిన తర్వాత టీఆర్ఎస్ కు ఇక్కడ కేక్ వాక్ కావాల్సి ఉంది. అయితే ఇదే ఇక్కడ టీఆర్ఎస్ కు ప్రతికూలంగా మారిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

పెట్టిన ఖర్చు.. పథకాలకు….

నిజానికి టీఆర్ఎస్ పెట్టిన ఖర్చుకు, ప్రవేశపెట్టిన పథకాలకు, ఎన్నికలకు ముందు హుజూరాబాద్ లో చేసిన అభివృద్ధికి ఈటల రాజేందర్ ను టీఆర్ఎస్ సోదిలో లేకుండా ఓడించాల్సి ఉంది. ఓటుకు ఆరు నుంచి పదివేలు ఇచ్చినట్లుగా కూడా ఆరోపణలు విన్పించాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాలను దత్తత తీసుకుని మరీ వ్యూహాలను రచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిత్యం హుజూరాబాద్ పై రివ్యూలు చేస్తూనే ఉన్నారు.

కానీ ఇంత తక్కువగా….

అయితే టీఆర్ఎస్ ఆశలు గల్లంతయ్యాయనే చెప్పాలి. టీఆర్ఎస్ ఊహించినదానికి భిన్నంగా జరిగిందనే చెప్పాలి. హుజూరాబాద్ లో గత ఎన్నికల కంటే ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఓటింగ్ శాతం పెరగడంతో అధికార పార్టీ ఆశలు పెరిగాయి. తాము వేసిన స్కెచ్ సక్సెస్ అయిందనుకున్నారు. ప్రవేశ పెట్టిన పథకాలు, పంచిన సొమ్ములు పనిచేశాయని భావించారు. కానీ ఫలితాలు చూస్తే మాత్రం ఇవేవీ పనిచేయలేదనే అనుకోవాలి. మొత్తం మీద హుజూరాబాద్ లో కారు పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారనే అనుకోవాలి. గెలుపోటములు ఎలా ఉన్నా టీఆర్ఎస్ హుజూరాబాద్ ఉప ఎన్నికలో విఫలమయిందనే చెప్పాలి.

Tags:    

Similar News