ఇవి చూస్తే చాలదా? ఇంకా రిజల్ట్ రావాలా?
తెలంగాణలో జరిగిన ప్రతి ఉప ఎన్నిక అధికార పార్టీకి అనుకూలంగానే ఫలితాలు వస్తున్నాయి. గత ఆరేళ్లుగా ఇదే పరిస్థితి. సిట్టింగ్ స్థానాలు కాకపోయినా, ప్రత్యర్థి పార్టీ స్థానాలకు [more]
తెలంగాణలో జరిగిన ప్రతి ఉప ఎన్నిక అధికార పార్టీకి అనుకూలంగానే ఫలితాలు వస్తున్నాయి. గత ఆరేళ్లుగా ఇదే పరిస్థితి. సిట్టింగ్ స్థానాలు కాకపోయినా, ప్రత్యర్థి పార్టీ స్థానాలకు [more]
తెలంగాణలో జరిగిన ప్రతి ఉప ఎన్నిక అధికార పార్టీకి అనుకూలంగానే ఫలితాలు వస్తున్నాయి. గత ఆరేళ్లుగా ఇదే పరిస్థితి. సిట్టింగ్ స్థానాలు కాకపోయినా, ప్రత్యర్థి పార్టీ స్థానాలకు ఉప ఎన్నిక జరిగినా టీఆర్ఎస్ కు అనూకలంగానే ప్రజాతీర్పు వస్తుంది. ప్రస్తుతం దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. అక్కడి టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణించడంతోె ఉప ఎన్నిక అనివార్యమయింది. అక్బోటరు నెల చివరలో ఉప ఎన్నిక జరిగే అవకాశముంది.
ఆరేళ్లో జరిగిన ఉప ఎన్నికల్లో….
అయితే తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి ఆరేళ్లు కావస్తుంది. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాంరెడ్డి వెంకటరెడ్డి మరణించడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. రాంరెడ్డి వెంకటరెడ్డి పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా 2009, 2014 ఎన్నికల్లో గెలిచారు. కాంగ్రెస్ కంచుకోటగా చెప్పుకోవాలి. అటువంటి చోట జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు.
కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమే అయినా….
ఇక తర్వాత నారాయణ ఖేడ్ కు ఉప ఎన్నిక జరిగింది. ఈ నియోజకవర్గం కూడా కాంగ్రెస్ కు కంచుకోట. 199, 2004, 2009, 2014 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. టీఆర్ఎస్ కు ఇక్కడ అవకాశమే లేదు. 2014 ఎన్నికల్లోనూ అక్కడ కృష్ణారెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచారు. అయితే ఆయన మరణంతో 2016లో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎం భూపాల్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ కు బలమైన నియోజకవర్గంతో పాటు, అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరణించినా ఏ మాత్రం సానుభూతి పనిచేయలేదు. టీఆర్ఎస్ మాత్రం ఉప ఎన్నికల్లో గెలుచుకుంది.
దుబ్బాకలో సాధ్యమయ్యేనా?
ఇటీవల హుజూర్ నగర్ ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడ 2018 ఎన్నికల్లో గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. హుజూర్ నగర్ లో ఇప్పటి వరకూ టీఆర్ఎస్ అడుగుపెట్టలేదు. అది కాంగ్రెస్ కు పట్టున్న ప్రాంతం. 2009, 2014, 2018 ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ విజయాలను సాధించారు. కానీ మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి గెలుపొందారు. ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మూడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సీట్లలోనే టీఆర్ఎస్ గెలిచింది. ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.