అక్కడ సీనియర్ కు భయపడి చంద్రబాబు?

తెలుగుదేశం పార్టీ అసలే కష్టాల్లో ఉంది. అనేక నియోజకవర్గాల్లో నేతలు కాడి పడేశారు. దాదాపు పదిహేనేళ్ల నుంచి గెలవని నియోజకవర్గాలను సయితం ఇప్పటికీ చంద్రబాబు పట్టించుకోవడం లేదన్న [more]

Update: 2021-08-16 00:30 GMT

తెలుగుదేశం పార్టీ అసలే కష్టాల్లో ఉంది. అనేక నియోజకవర్గాల్లో నేతలు కాడి పడేశారు. దాదాపు పదిహేనేళ్ల నుంచి గెలవని నియోజకవర్గాలను సయితం ఇప్పటికీ చంద్రబాబు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సీనియర్ నేతలను పక్కన పెట్టడం ఇష్టం లేక అక్కడ మరో నేతకు అవకాశం ఇవ్వకపోవడం వల్లనే వరస అపజయాలు మూటకట్టుకుంటున్నారు. తుని నియోజకవర్గంపై చంద్రబాబు ఇప్పటికీ ఇక నిర్ణయానికి రాలేకపోతున్నారు.

ఆ కుటుంబానికే….?

తుని నియోజకవర్గం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కుటుంబానికి చంద్రబాబు అప్పగించేశారు. 2004లో అక్కడ చివరిసారిగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ అక్కడ టీడీపీకి ఓటమే ఎదురయింది. ‍యనమల రామకృష్ణుడుతో పాటు ఆయన సోదరుడు యనమల కృష్ణుడు మూడుసార్లు పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో కొంత హోప్స్ ఉన్నా జగన్ వేవ్ ముందు అది సాధ్యం కాలేదు.

ఆ సాహసాన్ని …..

యనమల రామకృష్ణుడు ఇక రాజకీయంగా రిటైర్ మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఆయన సోదరుడు కృష్ణుడుకు అక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్ పై పట్టు లేదు. ఈసారి వారికే టిక్కెట్ ఇచ్చినా ఓటమి ఖాయమన్న కామెంట్స్ సొంత పార్టీ నుంచే విన్పిస్తున్నాయి. యనమల ఫ్యామిలీ నుంచి ఆ నియోజకవర్గాన్ని తప్పించే సాహసాన్ని చంద్రబాబు చేయలేకపోతున్నారు. యనమల ఫ్యామిలీకి వస్తే మళ్లీ ఓటమి తప్పదని స్థానిక క్యాడర్ చెబుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదు.

యాటిట్యూడ్ కారణంగానే…?

యనమల రామకృష్ణుడు ఫ్యామిలీ సయితం ఇక రాజకీయంగా ఆ నియోజకవర్గంపై పెద్దగా హోప్స్ పెట్టుకోవడం లేదు. కృష్ణుడు యాటిట్యూడ్ కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందంటున్నారు. ఇక్కడ మరో నేతను చంద్రబాబు ఎంపిక చేయాలన్న డిమాండ్ అక్కడి నుంచి బాగానే విన్పిస్తుంది. యనమలను బాధపెట్టడం ఇష్టంలేకనే చంద్రబాబు ఇక్కడ దైర్యం చేయలేక ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మొత్తం మీద యనమల ఫ్యామిలీని తునిలో కొనసాగిస్తే మరోసారి తెలుగుదేశం పార్టీకి భంగపాటు తప్పదు.

Tags:    

Similar News