రెండు పార్టీల నేత‌ల గుండెల్లో రైళ్లు.. రీజ‌నేంటి..?

ఏపీలో క‌రోనా తీవ్రత త‌గ్గుముఖం ప‌డుతోంది. ఇది అంద‌రికీ స్వీట్ న్యూసే. ఎప్పుడెప్పుడు క‌రోనా కోర‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ‌తామా ? ఎప్పుడెప్పుడు.. సాధార‌ణ జ‌న‌జీవ‌నం మొద‌ల‌వుతుందా ? [more]

Update: 2021-07-15 00:30 GMT

ఏపీలో క‌రోనా తీవ్రత త‌గ్గుముఖం ప‌డుతోంది. ఇది అంద‌రికీ స్వీట్ న్యూసే. ఎప్పుడెప్పుడు క‌రోనా కోర‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ‌తామా ? ఎప్పుడెప్పుడు.. సాధార‌ణ జ‌న‌జీవ‌నం మొద‌ల‌వుతుందా ? అని రాష్ట్ర ప్రజ‌లు ఎదురు చూస్తున్నారు. లాక్ డౌన్ మినహాయింపులు పూర్తిగా ఇచ్చేశారు. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీల్లోనూ క‌రోనా త‌గ్గుముఖం ప‌డుతుండ‌డం.. జ‌న‌జీవ‌నం సాధార‌ణ స్థితికి వ‌స్తుండ‌డంపై ఒక విధ‌మైన గుబులు రేగుతోంది.

ప్రజల మధ్యకు వెళ్లాలంటే?

దీనికి ప్రధాన కారణం.. క‌రోనా త‌గ్గిపోతే.. ఇక‌, నేత‌లు జ‌నాల మ‌ధ్యకు వెళ్లాలి. ఇప్పటికే టీడీపీ అధినేత‌ చంద్రబాబు దీనికి సంబంధించి సూచ‌న ప్రాయంగా అధికారుల‌కు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. క‌రోనా త‌గ్గుముఖంప‌ట్టగానే ప్రజ‌ల మ‌ధ్యకు వెళ్లాల‌ని ఆదేశించారు. కానీ, ఇప్పుడు టీడీపీ నేత‌ల చేతిలో డ‌బ్బులు లేవు. ప్రజ‌ల మ‌ధ్యకు వెళ్లాలంటే.. డ‌బ్బులు కావాలి.

మందీ మార్బలంతో…..

పైగా.. గ‌తానికి భిన్నంగా మందీ మార్బలాన్ని పోగుచేసుకోవాలంటే.. డ‌బ్బులు ఖ‌ర్చు చేయ‌క‌త‌ప్పదు. దీంతో టీడీపీ నేత‌లు.. చంద్రబాబు ఆదేశాల‌పై గుబులుగా ఉన్నారు. ఇక‌, అధికార వైసీపీ విష‌యానికి వ‌స్తే.. ఇప్పటి వ‌ర‌కు చాలా మంది నాయ‌కులు.. ప్రజ‌ల‌కు దూరంగా ఉంటున్నారు. కార‌ణాలు ఏవైనా.. వారి వ్యాపారాలు.. వ్యవ‌హారాల్లో బిజీగా ఉంటూ.. ప్రజ‌ల‌ను ప‌క్క‌న పెట్టారు.

వైసీపీ నేతలు కూడా…

ఇప్పుడు క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్టిన నేప‌థ్యంలో ఖ‌చ్చితంగా ప్రజ‌ల మ‌ధ్యకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటి వ‌ర‌కు క‌రోనా బూచిని చూపి.. చాలా మంది నేత‌లు.. ఇత‌ర రాష్ట్రాల్లో సెటిల్ అయ్యారు. కానీ, ఇప్పుడు ఏపీలో క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్టడం.. సాధార‌ణ జీవ‌నం ప్రారంభం అవుతుండ‌డంతో ఇటు సీఎం జ‌గ‌న్ కూడా నేత‌ల‌ను ప్రజ‌ల్లోకి వెళ్లమ‌ని ఆదేశించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో నేత‌లు గుబులు గుబులుగా ఉండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News