టీడీపీ కమ్మ కొమ్మలు తెగిపోతున్నాయా… తెంపేస్తున్నారా?
తెలుగుదేశం పార్టీ అంటేనే కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం.. ఆ వర్గానికి ఈ పార్టీ పెట్టని కోట. పార్టీ ఆవిర్భావం నుంచి గత ఐదేళ్లు అధికారంలో ఉన్నంత [more]
తెలుగుదేశం పార్టీ అంటేనే కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం.. ఆ వర్గానికి ఈ పార్టీ పెట్టని కోట. పార్టీ ఆవిర్భావం నుంచి గత ఐదేళ్లు అధికారంలో ఉన్నంత [more]
తెలుగుదేశం పార్టీ అంటేనే కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం.. ఆ వర్గానికి ఈ పార్టీ పెట్టని కోట. పార్టీ ఆవిర్భావం నుంచి గత ఐదేళ్లు అధికారంలో ఉన్నంత వరకు ఈ వర్గం పార్టీలో మామూలుగా హవా చెలాయించలేదు. ఎన్నో ఇబ్బందులు, ఆటుపోట్లు వచ్చినా కమ్మ వర్గం మాత్రం పార్టీపై ఎంతో నమ్మకంతో ఉండేది. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడే రాష్ట్రం అంతా అప్పటికే విస్తరించి ఉన్న కమ్మ వర్గం టీడీపీ నుంచి సీట్లు దక్కించుకుని రాజకీయంగా తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఉదాహరణకు ఎక్కడో శ్రీకాకుళం జిల్లా చివర్లో ఇచ్చాపురం నుంచి కృష్ణారావు, విజయనగరం జిల్లా చీపురుపల్లిలో గద్దె బాబూరావు, విశాఖలో ఎంవీఎస్. మూర్తి, తూర్పుగోదావరి జిల్లాలో బొడ్డు భాస్కర రామారారావు, బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్లు పాగా వేశారు. కమ్మ వర్గం ప్రాబల్యం లేని చోట్ల కూడా ఆ వర్గం నేతలు ఎమ్మెల్యేలు అయ్యారు.
ఉమ్మడి ఏపీలోనూ….
అటు తెలంగాణలో నిజామాబాద్ లాంటి చోట్ల మండవ వెంకటేశ్వరరావు, నేరెళ్ల ఆంజనేయులు మంత్రులు అయ్యారు. వరంగల్ లాంటి చోట్ల కూడా ఈ వర్గం వారు టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు అయ్యారు. పార్టీ పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ వర్గం చాలా స్ట్రాంగ్‌గా ఉంటూ టీడీపీ కోసం గట్టిగా పని చేసింది. ఇక సీమలోనూ పరిటాల, పయ్యావుల నుంచి కర్నూలులో రాంభూపాల్ చౌదరి, మీనాక్షి నాయుడు, తిరుపతిలో గాలి ముద్దుకృష్ణమనాయుడు, కడపలో కస్తూరి విశ్వనాథనాయుడు ఇలా చాలా మంది కమ్మ నేతలు ఎక్కడిక్కడ పరుచుకుపోయి రాజకీయంగా బలమైన శక్తులుగా మారిపోయారు. అలాంటి కమ్మ వర్గం ఏపీలో అధికారం కోల్పోయిన ఈ యేడాదిన్నర కాలంలోనే ఎంతో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది అన్నది వాస్తవం.
ఆందోళనలో ఉందా?
ఈ వర్గం ఆందోళనతో ఉందా ? లేదా ? అన్ని రంగాల్లో టార్గెట్ చేయబడుతోందా ? అన్నది పక్కన పెడితే ఎప్పుడూ లేనంత అభద్రతా భావంతో ఈ వర్గం నేతలు ఉన్నారన్నది స్పష్టంగా తెలుస్తోంది. తమ వర్గానికి భవిష్యత్తులో సరైన నేత లేడన్న సందేహంతో కూడా చాలా మంది ఈ వర్గం నేతలు ఎవరి దారి వారు వెతుక్కుంటున్నారు. ఉదాహరణకు టీడీపీకి గత ఎన్నికల్లో కేవలం 23 సీట్లు వస్తే అందులో 11 మంది కమ్మలే ఉన్నారు. గెలిచిన ముగ్గురు ఎంపీల్లోనూ ఇద్దరు కమ్మ ఎంపీలే. కరణం బలరాం, వంశీ పార్టీ మారి చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఇక మిగిలిన కమ్మ ఎమ్మెల్యేల్లో పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవి లాంటి వారిపై అనేక సందేహాలు ఉన్నాయి. ఎంపీల్లో నాని, జయదేవ్ ఇద్దరూ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ? తెలియని పరిస్థితి.
నమ్మకం లేకనే….
ఇక వీరితో పాటు ఈ వర్గానికే చెందిన పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ పుట్టినప్పటి నుంచి టీడీపీలో ఉన్న కీలక నేతలు సైతం ఇప్పుడు టీడీపీని / చంద్రబాబును నమ్ముకుని రాజకీయం చేయలేమన్న నిర్ణయానికి వచ్చేశారు. అందుకే ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఎక్కడెక్కడో ఉన్న ఈ వర్గం నేతలు ఇప్పుడు బయటకు వస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు పశ్చిమగోదావరి జిల్లాలో మాజీ కేంద్ర మంత్రి వారసుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త బోళ్ల రాజీవ్ సైతం పార్టీ వీడేందుకు రెడీ అవుతున్నారు. రాజీవ్ రేపో మాపో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. రాజకీయ భవిష్యత్తు కావొచ్చు, పారిశ్రామిక అవసరాల నేపథ్యం కావొచ్చు.. పార్టీ మారే వారి లిస్టులో పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన కమ్మ నేతల పేర్లు ఎక్కువగానే తెరమీదకు వస్తున్నాయి.
కులం ముసుగుని……
ఇక పశ్చిమ గోదావరి జిల్లాకే చెందిన మరో మాజీ మంత్రి మాగంటి బాబు కూడా బాబుకు, టీడీపీకి రాం రాం చెప్పనున్నారంటున్నారు. ఆయన పార్టీ మార్పుకోసం సరైన ముహూర్తం రెడీ చేసుకుంటున్నారట. ఇక గుంటూరు జిల్లాలో ఎన్నో యేళ్లుగా కీలక నేతగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే కూడా పార్టీ మారేందుకు చర్చలు జరుపుతున్నారని టాక్..? ఇక జగన్ సైతం కమ్మ వర్గంలో ఏ నేత ఊగిసలాటలో ఉన్నా వారిని వెంటనే పార్టీలోకి తీసుకువచ్చే బాధ్యతలను సైతం తమ పార్టీలో ఉన్న అదే వర్గం నేతలకు అప్పగించేశారట. దీంతో వీరంతా తమ ఉనికి కోసం ఇప్పటి వరకు ఉన్న కులం ముసుగును తెంపేసుకుని… టీడీపీతో బంధం వదులుకుంటోన్న పరిస్థితి.