Tdp : రెండూ కలిసినా పెద్దగా ప్రయోజనం లేదట

టీడీపీ, జనసేన పొత్త పెట్టుకుంటే మరోసారి అధికారంలోకి వస్తామని తెలుగు తమ్ముళ్లు ఆశపడుతున్నారు. అందుకోసం అన్ని ప్రయత్నాలు అధినాయకత్వం చేయాలంటున్నారు. పవన్ కల్యాణ్ చరిష్మా, చంద్రబాబు సమర్థత [more]

Update: 2021-10-09 13:30 GMT

టీడీపీ, జనసేన పొత్త పెట్టుకుంటే మరోసారి అధికారంలోకి వస్తామని తెలుగు తమ్ముళ్లు ఆశపడుతున్నారు. అందుకోసం అన్ని ప్రయత్నాలు అధినాయకత్వం చేయాలంటున్నారు. పవన్ కల్యాణ్ చరిష్మా, చంద్రబాబు సమర్థత వెరసి వచ్చే ఎన్నికల్లో విజయం నమోదు చేసుకుంటామన్నది తెలుగుదేశం పార్టీ నేతల అంచనా. పార్టీ అధినేత చంద్రబాబు సయితం ఇదే ఆలోచనలో ఉన్నారు. కానీ ఓట్ల శాతం, గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లను చూస్తే జనసేనతో పొత్తుతో పెద్దగా ప్రయోజనం ఉండదన్నది విశ్లేషకుల అంచనా.

ఓట్ల శాతాన్ని తీసుకుంటే….

గత ఎన్నికల్లో జనసేన ఆరు శాతం ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి 39 శాతం ఓట్లు వచ్చాయి. అధికారంలోకి వచ్చిన వైసీపీకి దాదాపు యాభై శాతం ఓట్ల షేర్ లభించింది. రెండు పార్టీలు కలిస్తే నలభై శాతం ఓట్లు వస్తాయని, జగన్ పై అసంతృప్తితో గెలవవచ్చన్నది టీడీపీ అంచనా. కానీ గత ఎన్నికల పరిస్థితి ఇప్పుడు లేదు. జగన్ బలం బాగా పెరిగింది. తనకంటూ ఓటు బ్యాంకును మరింత పెంచుకున్నారు.

గతంలో కంటే బలంగా….

సంక్షేమ పథకాలతో జగన్ తన ఓటు బ్యాంకును పెంచుకోగలిగారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు దీన్ని రుజువు చేశాయి. మండల పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి 64 శాతం ఓట్లు రాగా, టీడీపీకి 25.2 శాతం, జనసేనకు 4.34 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు తీసుకున్నా ఇందులో వైసీపీకి 69.55 శాతం ఓట్లు రాగా, టీడీపీకి 22. 27 శాతం, జనసేనకు 3.83 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీ, జనసేన కలిసినా వైసీపీిని ఎదుర్కొనేంత బలం ఉందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

కొన్ని ప్రాంతాలకే….

జనసేన బలం కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమయింది. రెండు జిల్లాల్లోనే అది ప్రభావం చూపగలుగుతుంది. కాకుంటే ఏపీలో ఉన్న బలమైన కాపు సామాజికవర్గం ఈ పార్టీలకు అండగా నిలిస్తే సాధారణ ఎన్నికల్లో కొంత ఓట్ల శాతం పెరిగే అవకాశమున్నా రాష్ట్ర స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో ప్రభావితం చేయవన్నది వైసీపీ నేతల విశ్వాసం. దీంతో జనసేన, టీడీపీ లు కలిసినా తమకు వచ్చే ఎన్నికల్లోనూ విజయం తప్పదన్న ధీమా అధికార పార్టీలో వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News