వారికీ అంటించారుగా ఫైనల్ గా
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. తెలుగు మీడియా దూకుడు ఎక్కువైందనే ఆరోపణలు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలపై రాస్తున్న వ్యతిరేక కథనాలు, వర్తలు పసలేకుండా పోతున్నాయనే వాదన [more]
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. తెలుగు మీడియా దూకుడు ఎక్కువైందనే ఆరోపణలు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలపై రాస్తున్న వ్యతిరేక కథనాలు, వర్తలు పసలేకుండా పోతున్నాయనే వాదన [more]
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. తెలుగు మీడియా దూకుడు ఎక్కువైందనే ఆరోపణలు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలపై రాస్తున్న వ్యతిరేక కథనాలు, వర్తలు పసలేకుండా పోతున్నాయనే వాదన వినిపిస్తోంది. ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వాలను విమర్శించడమే పనిగా సదరు మీడియా యజమానులు ఈ కథనాలు రాస్తున్నారనే వాదన కూడా ఉంది. తమకు అనుకూలమైన ప్రభుత్వాలు ఉంటే ఒకవిధంగా, లేకపోతే. మరో విధంగా మీడియా కథనాలు ఉంటుండడంతో ప్రజల్లోని కొన్ని వర్గాలు కూడా మీడియా కథనాలను విశ్వసించడం మానుకుంటున్నారు. దీంతో రానురాను మీడియాకు విశ్వసనీయత కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది.
ఇంగ్లీష్ మీడియాలోనూ…
అయితే, ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఇంగ్లీష్ మీడియాలోనూ కనిపిస్తుండడంతో పాఠకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు మీడియా ప్రభావం ఇంగ్లీష్ మీడియాపై కూడా పడిందనే భావన వ్యక్తమవుతోంది. గతంలో మీడియాలో వచ్చిన కథనాలను ఆసరా చేసుకుని రాజకీయ నాయకులు ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నవారు అధికార పార్టీలపైనా, నాయకులపైనా విమర్శలు చేసేవారు. అయితే, ఇప్పుడు ఏ మీడియాలో వ్యతిరేక కథనం వచ్చినా.. దానిని ఏమేరకు విశ్వసించాలనే ప్రధాన ప్రశ్న తెర మీదికి వస్తోంది. దీంతో మీడియాపై నమ్మకం సన్నగిల్లుతోంది.
కియా విషయంలోనూ….
ఏపీ విషయాన్ని తీసుకుంటే.. రెండు కీలక కథనాలు రెండు జాతీయస్థాయి మీడియాల్లో రావడం.. అవి జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉండడంతో వాటిని తీసుకుని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. రాయిటర్స్ ఆన్‌లైన్ మీడియా కొన్ని రోజుల కిందట అనంతపురంలోని కియా కార్ల కంపెనీకి సంబంధించి ఓ చిన్న పోస్టును పెట్టింది. కియా అక్కడి నుంచి తరలి పోయేందుకు రెడీ అయిందని, కియాకు అనుబంధంగా ఉండే కంపెనీలను తమిళనాడులో ఏర్పాటు చేయాలని అక్కడి ప్రభుత్వంతో చర్చకు కూడా నడుపుతోందని రాయిటర్స్ పేర్కొంది.
అయితే ఆ కథనాన్ని…..
ఏపీలో జగన్ ప్రభుత్వం 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలనే షరతు పెట్టడంతో ఇలా చేస్తోందని పేర్కొంది. దీంతో టీడీపీ పెద్ద ఎత్తున బజారున పడింది. తాము కష్టపడి తెచ్చిన కంపెనీని జగన్ ప్రభుత్వం వెళ్లగొడుతోందని విమర్శలు గుప్పించింది. ఇంతలోనే కంపెనీ జోక్యం చేసుకుని తమకు అసలు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలనే ఉద్దేశం లేదని కుండబద్దలు కొట్టింది. దీంతో సదరు మీడియా విశ్వసనీయతకే మాయని మచ్చ ఏర్పడింది. ఇక, తాజాగా మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని అనుకుంటున్న జగన్ ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్(పాలనా రాజధాని) కేపిటల్‌గా విశాఖను ఎంచుకుంది. దీనికి సంబంధించి కార్యాలయాను విశాఖలోని ఐటీ సెక్టార్ ఉన్న మిలీనియం టవర్స్‌కు తరలించాలని నిర్ణయించుకుంది. అయితే, తాజాగా ఒక ఆంగ్ల పత్రికలో దీనిపై ఓ కథనం వచ్చింది.
నేవీకి సంబంధించి….
పక్కనే నేవీకి సంబంధించిన కళింక కంపెనీ ఉందని, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏర్పాటు చేస్తే.. కుదరదని నేవీ నేరుగా జగన్ ప్రభుత్వానికి చెప్పిందని, దీంతో ప్రభుత్వం విశాఖలోని మిలీనియం టవర్స్‌లో ఏర్పాట్లను వెనక్కి తీసుకుందని ఆ పత్రికలో వార్త వచ్చింది. దీనిని కూడా చంద్రబాబు టీం యాగీ చేసింది. వెంటనే స్పందించిన నేవీ.. అసలు తమకు, ప్రభుత్వానికి మధ్య ఎలాంటి రాయబారం నెరపలేదని ఓ నోట్ విడుదల చేసింది. దీంతో అసలు ఇంగ్లీష్ మీడియా కూడా ఎందుకు ఇలా జగన్ ప్రభుత్వంపై కలం దాడి చేస్తోందనే ప్రశ్న వ్యక్తమైంది. ఏదైమైనా.. తెలుగు మీడియాతో పాటు ఇంగ్లీష్ మీడియా కూడా విశ్వసనీయతను కోల్పోయినట్టు అవుతోంది.