పల్నాటి పందెంలో ఏ పుంజు గెలుస్తుందో…
గుంటూరు జిల్లాలో పల్నాడుకు ముఖద్వారమైన గురజాల నియోజకవర్గంలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాకముందే పోలిటికల్ హీట్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. అప్పుడే మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. [more]
గుంటూరు జిల్లాలో పల్నాడుకు ముఖద్వారమైన గురజాల నియోజకవర్గంలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాకముందే పోలిటికల్ హీట్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. అప్పుడే మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. [more]
గుంటూరు జిల్లాలో పల్నాడుకు ముఖద్వారమైన గురజాల నియోజకవర్గంలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాకముందే పోలిటికల్ హీట్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. అప్పుడే మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడునున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల నుంచి పోటీకి రెడీ అవుతోన్న నేతలు నిత్యం జనంలో ఉంటూ తెగ హడావుడి చేసేస్తున్నారు. మాకంటే మాకే ప్రజాబలం ఉందని… ఎవరికి వారు ప్రచారం చేసేసుకుంటున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న పల్నాడు ప్రాంతాన్ని కలుపుకుని నియోజకవర్గంగా కొనసాగుతున్న గురజాలలో రాజకీయ చైతన్యం మొదట్నుంచి ఎక్కువే. ఇక అసలు విషయానికి వస్తే… వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వరుసగా ఆరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. 1994 నుంచి గురజాలలో టీడీపీ అభ్యర్థిగా ప్రతి ఎన్నికలోనూ పోటీ చేస్తోన్న ఆయన మూడుసార్లు గెలిచి, రెండుసార్లు ఓడారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఆయన్ను ఓడించేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.
పాగా వేయాలని చూస్తున్న వైసీపీ
ఈ క్రమంలోనే ఆయన్ను ఓడించేందుకు వైసీపీ పెద్ద ఎత్తున ప్రణాళికలు రచిస్తోంది. గత సంవత్సరం నుంచే ఆయన ఎన్నికల కోలాహలం సృష్టించారు. ప్రజాసంబంధాలు ఎక్కడా దెబ్బతినకుండా చూసుకోవడంలో ఆయన జాగ్రత్తలు వహిస్తారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. 2009, 2014 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన ఆయనకు పార్టీపై మంచి పట్టుంది. ఎక్కడా వ్యతిరేకత రాకుండా చూసుకోవడంలో విజయం సాధించారనే చెప్పాలి. నియోజకవర్గం అభివృద్ధి చేశామని చెబుతున్నారు. దీనికితోడు సంక్షేమ పథకాలు కలిసొస్తాయని నమ్మకంగా ఉన్నారు. అయితే అదే సమయంలో ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. పల్నాడులో మైనింగ్ పేరుతో అక్రమంగా దోచుకున్నారని ప్రతిపక్షాల నుంచి విమర్శలున్నాయి. రెండున్నర దశాబ్దాలుగా ఆయన ఈ ప్రాంతంలో నాయకుడిగా కొనసాగుతుండటం వచ్చే ఎన్నికల్లో బోనస్ కానుంది.
వైసీపీ అభ్యర్థిగా మహేష్ రెడ్డి…
వైసీపీ నుంచి కాసు మహేష్‌రెడ్డి బరిలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. అధికారికంగా ఇంకా ప్రకటన వెలువడనప్పటికి ఆయనే దాదాపు ఖాయం అని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికైతే ఆయన జనక్షేత్రంలో ఏదో కార్యక్రమంలో పాల్గొంటూ కార్యకర్తలను ఏక తాటిపైకి తీసుకువస్తున్నారు. ప్రజల్లో పట్టు సంపాదించారు. ఇక జనసేన నుంచి పిడుగురాళ్ల మండలం జానపాడుకు చెందిన డాక్టర్ చింతలపూడి శ్రీనివాసరావు పేరు వినబడుతోంది. అయితే మరో ఇద్దరు కూడా పోటీకి సై అంటున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్యనే పోరు సాగనుంది. జనసేన అభ్యర్థి, టీడీపీ అభ్యర్థి ఒకే సామాజిక వర్గం కావడంతో ఆ సామాజికవర్గం ఓట్లు స్వల్పంగా చీలే అవకాశమైతే ఉంది.