టీడీపీ కొత్త ప్రచారం… ప్లస్ అవుతుందా.. ?

తెలుగుదేశం ఏం చేసినా తమ వెనక తెలుగు జనాన్ని ఎపుడూ అట్టేపెట్టుకుంటుంది. ఆ విధంగా వారితోనే తామూ అన్నట్లుగా బిల్డప్ ఇస్తుంది. తమపైన ఏ విమర్శ వచ్చినా [more]

Update: 2020-10-22 00:30 GMT

తెలుగుదేశం ఏం చేసినా తమ వెనక తెలుగు జనాన్ని ఎపుడూ అట్టేపెట్టుకుంటుంది. ఆ విధంగా వారితోనే తామూ అన్నట్లుగా బిల్డప్ ఇస్తుంది. తమపైన ఏ విమర్శ వచ్చినా కూడా తెలివిగా తెలుగు జనాల మీదకు మళ్ళించడంలో టీడీపీ తమ్ముళ్ళు నిపుణులు. తెలుగుదేశం మీద ప్రత్యర్ధులు విమర్శలు చేస్తే ఇది తెలుగు జాతి మీద దాడి అని అనగలిగే ఏకైక పార్టీ టీడీపీ ఒక్కటే. ఇపుడు తెలుగుదేశం పార్టీ కొత్త ప్రచారాన్ని ఎంచుకుంది. దాన్ని జనంలోకి పోనిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని కూడా ఆశపడుతోంది.

జనమే ఓడారట ….

ఇది చాలా వింతైన ప్రచారమే. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభువులు కదా. మరి వారెందుకు ఓడుతారు అంటే ఇక్కడే టీడీపీ రాజకీయ తెలివిడి ఉందని అర్ధం చేసుకోవాలి. టీడీపీ పుట్టాక 23 సీట్లతో పాతాళానికి పడిపోయిన పార్టీ ప్రతిష్టను నిలబెట్టుకోవడానికి కొత్త టెక్నిక్ అన్నట్లుగా మమ్నల్ని కాదు, జనాన్ని మీరు ఓడించారు అంటూ తమ్ముళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ ఓడలేదు. జనమే ఓడారు అంటూ చాణక్య రాజకీయానికి తెర తీస్తున్నారు. ప్రజల ఆశలను, ఆకాంక్షలను వైసీపీ ఓడించింది అంటున్నారు మాజీ మంత్రి జవహర్. వైసీపీ ఏలుబడిలో మోసపోయి ఓడిన ప్రజలకు టీడీపీ అండగా ఉంటుందని కూడా ఆయన హామీ ఇస్తున్నారు.

జనంతో ముడిపెట్టి……

అధినాయకుడు చంద్రబాబు కూడా చాలాకాలం నుంచి అచ్చం ఇలాగే మాట్లాడుతున్నారు. ప్రజలను మీరు వంచించారు. అమాయకులను చేసి ఓట్లేయించుకున్నారు అంటూ వైసీపీ మీద తెలుగుదేశం పార్టీ నేతలు దాడి చేస్తున్నారు. తెలుగు ప్రజలు ఎపుడూ టీడీపీని ఓడించలేదని కూడా బాబు అంటున్నారు. వైసీపీయే మాయ చేసిందని కూడా అంటున్నారు. ఆ విధంగా యావత్తు అయిదు కోట్ల మంది జనాలను తమ సొంతం చేసుకుని వైసీపీని ఒంటరి చేస్తూ ఆడుతున్న రాజ‌కీయ క్రీడలో మరి వైసీపీ ఏమవుతుందన్నది కూడా చూడాలి.

కింద పడ్డా కూడా …..

నిజానికి ఏపీలో తిరుగులేని మెజారిటీ వైసీపీకి దక్కింది. 151 సీట్లు 50 శాతం ఓట్లు అంటే సమీప భవిష్యత్తులో ఎవరికీ ఇంతటి ఘనవిజయం దక్కదు. అదంతా జనం మెచ్చి మరీ జగన్ కి ఇచ్చిన అపూర్వ బహుమానమే. అలాంటి ప్రజాదరణను కూడా కాదంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న వితండ వాదం రాజకీయం నిజంగా గొప్పదే. జనం ఎవరు వైపు ఉన్నారో లోకమంతా చాటాక కూడా వారు మా వైపే అంటూ హిప్నటైజ్ చేస్తూ టీడీపీ కొత్త పాలిట్రిక్స్ నే ఏపీలో చూపిస్తోంది. మరి దీనికి ధీటుగా వైసీపీ నుంచి రియాక్షన్స్ ఉంటాయా అన్నదే ఇక్కడ పాయింటే. లేకపొతే మా ప్రజలు అంటున్న బాబు మాటలకు ఏదో నాడు ఆంధ్ర జనం పడిపోతే వైసీపీకి అదే దెబ్బ అవుతుంది. ఏది ఏమైనా ఫార్టీ యియర్స్ పాలిటిక్స్ అంటే ఇదేనేమో.

Tags:    

Similar News