ఎవరూ ముందుకు రావడం లేదా?
ఆయన స్థానంలో తెలుగుదేశం పార్టీకి సరైన నేత దొరకడం లేదు. సీనియర్ నేతలున్నా పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా [more]
ఆయన స్థానంలో తెలుగుదేశం పార్టీకి సరైన నేత దొరకడం లేదు. సీనియర్ నేతలున్నా పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా [more]
ఆయన స్థానంలో తెలుగుదేశం పార్టీకి సరైన నేత దొరకడం లేదు. సీనియర్ నేతలున్నా పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలో మొన్నటి వరకూ బడేటి బుజ్జి ఉండేవారు. ఏలూరు నియోజకవర్గం బాధ్యతలన్నీ ఆయనే చూసుకునే వారు. కానీ బడేటి బుజ్జి ఆకస్మిక మరణంతో ఇక్కడ టీడీపీకి దిక్కులేకుండా పోయింది. బడేటి బుజ్జి మరణించి నెలన్నర అవుతున్నా ఏలూరు నియోజకవర్గంపై టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టలేదు.
బుజ్జి మరణంతో….
బడేటి బుజ్జి 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీకి ఆయనే అంతా అయి వ్యవహరించేవారు. 2019 ఎన్నికల్లో బడేటి బుజ్జి ఓడిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు నియోజకవర్గాలు మినహా అన్నిచోట్ల టీడీపీ ఓటమి పాలాయింది. ఇక బడేటి బుజ్జి కూడా ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యానే టెన్షన్ కు గురయి మరణించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. బడేటి బుజ్జి ఉన్నంత వరకూ క్యాడర్ ను ఆయనే దగ్గరుండి చూసుకునే వారు. కార్యకర్తలకు అండగా నిలిచేవారు.
కుటుంబం నుంచి….
ఆయన మరణం తర్వాత క్యాడర్ లో అయోమయం నెలకొంది. బడేటి బుజ్జి కుటుంబం నుంచి పార్టీ ఇన్ ఛార్జిగా నియమించాలనుకున్నా వారు అంగీకరించని పరిస్థితి ఉంది. బడేటి బుజ్జి కుమారుడు వయసులో చిన్న కావడం, ఆయన అల్లుడు ఆసక్తికనపర్చకపోవడంతో బయట వ్యక్తులనే నియమించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో కొంచెం ఆలస్యమయినా సరైన వ్యక్తిని నియమించాలని అధిష్టానం యోచిస్తుంది. కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్నాయి.
పరిశీలనలో…..
పార్టీ ఇన్ ఛార్జి పదవి తీసుకుంటే ఆర్థికంగా భారం పడుతుందని అనేకమంది నేతలు అనాసక్తి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మాగంటి బాబు ఆయన కుమారుడు రాంజీలతో పాటు అంబికా కృష‌్ణ పేర్లు కూడా అధిష్టానం పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. వారు తాము ప్రస్తుత పరిస్థితుల్లో బాధ్యతలను తీసుకోలేమని చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీడ బడేటి బుజ్జి స్థానంలో ఎవరిని నియమించాలన్న దానిపై ఇంతవరకూ అధిష్టానం నిర్ణయం తీసుకోక పోవడంతో క్యాడర్ లో అయోమయం నెలకొంది.