త్రీ డేస్ రివ్యూ… నో రిజల్ట్
తిరుగులేని నాయకత్వం.. క్రమశిక్షణ కలిగిన క్యాడర్. ఇదీ ఒకప్పటి తెలుగుదేశం పార్టీలో పరిస్థితి. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు. అలాంటిది ఏడు మాసాల నుంచి పార్టీకి [more]
తిరుగులేని నాయకత్వం.. క్రమశిక్షణ కలిగిన క్యాడర్. ఇదీ ఒకప్పటి తెలుగుదేశం పార్టీలో పరిస్థితి. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు. అలాంటిది ఏడు మాసాల నుంచి పార్టీకి [more]
తిరుగులేని నాయకత్వం.. క్రమశిక్షణ కలిగిన క్యాడర్. ఇదీ ఒకప్పటి తెలుగుదేశం పార్టీలో పరిస్థితి. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు. అలాంటిది ఏడు మాసాల నుంచి పార్టీకి నాయకత్వం వహించే వారే లేకపోయారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థిితి నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేసినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ కిందిస్థాయి కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.
కంచుకోట లాంటి జిల్లాలో…..
ఒకప్పుడు అనంతపురం జిల్లా అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అయితే గత ఎన్నికల్లో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండింటిని మాత్రమే తెలుగుదేశం గెలుచుకుంది. ఒకటి ఉరవకొండ, మరొకటి హిందూపురం. రెండు పార్లమెంటు స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది. పార్టీ ఓటమి పాలయిన నాటి నుంచి నాయకులు ఎవరూ ఇళ్లు వదలి రావడం లేదు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు కూడా ఏమాత్రం స్పందించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు ఒక కారణమయితే, కేసులకు భయపడి కొందరు బయటకు రావడం లేదని చెబుతున్నారు.
ఎవరూ ముందుకు రాక….
మాజీలయిన తర్వాత ఎవరూ జెండా మోసేందుకు ముందుకు రావడంలేదు. పూర్తిగా పార్టీలో క్రమశిక్షణ కొరవడింది. ధర్మవరం నియోజకవర్గాన్ని తీసుకుంటే అక్కడ ఏడు నెలలుగా ఇన్ ఛార్జి నియామకానికే దిక్కులేకుండా పోయింది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ బీజేపీలోకి వెళ్లారు. శింగనమల నియోజకవర్గంలో గ్రూపు తగాదాలతో ఆపార్టీకి నాయకత్వమే లేకుండా పోయింది. మాజీ ఎమ్మెల్యే యామిని బాలకు, జేసీ వర్గానికి పొసగడం లేదు. మూడు రోజులు తిష్ట వేసి చంద్రబాబు క్లాస్ పీకినా ఏమాత్రం నేతల్లో మార్పు రాలేదు.
పరామర్శకూ…..
ఇక ఇటీవల జేసీ దివాకర్ రెడ్డి ఒక కేసులో పోలీస్ స్టేషన్ లో ఏడు గంటల పాటు ఉంటే టీడీపీకి చెందిన ఏ నేత కూడా పరామర్శకు ముందుకు రాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వారికి బదులు జేసీని బీజేపీ నేతలు వచ్చి పలకరించడం చర్చనీయాంశమయింది. ఇలా తెలుగుదేశం పార్టీ కంచుకోట అనంతపురం జిల్లాలో పార్టీ పూర్తిగా నిస్తేజం లోకి వెళ్లిపోయింది. ప్రభుత్వంపై సూటిగా విమర్శలు చేసే వారు జిల్లాలో కరవయ్యారు. మరి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని ఎలా గట్టెక్కిస్తారన్నది వారికే తెలియాలి.