కంటిన్యూ చేస్తున్నారుగా..? కలిసే అవకాశమే లేదట

చిత్తుగా ఓడినా ఇంకా నేతల మధ్య విభేదాలు కొలిక్కి రావడం లేదు. అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల మధ్య వైరం ఇప్పట్లో తెమిలేలా లేదు. ఇటీవల పదవుల [more]

Update: 2020-11-04 12:30 GMT

చిత్తుగా ఓడినా ఇంకా నేతల మధ్య విభేదాలు కొలిక్కి రావడం లేదు. అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల మధ్య వైరం ఇప్పట్లో తెమిలేలా లేదు. ఇటీవల పదవుల భర్తీతో నేతల మధ్య మరింత దూరం పెరిగిందంటున్నారు. అనేక నియోజకవర్గాల్లో నేతలు గ్రూపులుగా విడిపోయి తెలుగుదేశం పార్టీ క్యాడర్ లో అయోమయం కల్పిస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నిసార్లు వార్నింగ్ లు ఇచ్చినా అనంతపురంలో మాత్రం అది ఫలితాలనివ్వలేదనే చెప్పాలి.

కల్యాణదుర్గంలో…..

కల్యాణదుర్గంలో హనుమంతరాయ చౌదరికి, ఉమామహేశ్వరనాయుడికి మధ్య విభేదాలు అలాగే ఉన్నాయి. ఇద్దరు కలసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సాధారణమయిపోయింది. అధిష్టానం దృష్టికి ఎన్నిమార్లు తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఇన్ ఛార్జిగా ప్రస్తుతం ఉమా మహేశ్వరనాయుడే ఉన్నారు. కానీ మరోవైపు హనుమంతరాయ చౌదరి ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో క్యాడర్ అయోమయంలో పడింది.

చౌదరి వర్సెస్ జేసీ…..

అనంతపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి, జేసీ ప్రభాకర్ రెడ్డికి మధ్య ఉన్న విభేదాలు నేటికీ కొనసాగుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభమైన విభేదాలు కంటిన్యూ అవుతుండటం పార్టీని ఇబ్బంది పెడుతుంది. జేసీ వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఇటీవల అనంతపురం జిల్లాలో జరిగిన లోకేష్ పర్యటనలో కూడా ప్రభాకర్ చౌదరి పాల్గొనలేదు. ఈ రెండు వర్గాలు కలవడం అసాధ్యమేనని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నాయి.

ప్రాధాన్యత ఇవ్వడం లేదని…..

మరో నియోజకవర్గమైన శింగనమలలో సయితం టీడీపీలో రెండు గ్రూపులు తయారయ్యాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయిన బండారు శ్రావణి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తన ప్రత్యర్థిగా భావించే ఎంఎస్ రాజు వర్గానికి పార్టీ అధిష్టానం ప్రాధాన్యత ఇస్తుందని ఆమె అలక వహించారు. బండారు శ్రావణి జేసీ వర్గానికి చెందిన నేత. దీంతో ఈ నియోజకవర్గంలో పార్టీ ఇన్ ఛార్జి ఇన్ యాక్టివ్ గా ఉండటం చర్చనీయాంశమైంది. మొత్తం మీద అనంతపురం జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి.

Tags:    

Similar News