ఇద్దరు గెలిచినా…?

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ రాజ‌కీయాలు చాలా డీలా ప‌డుతున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఊహించ‌ని ప‌రిణామం నుంచి పార్టీ ఇప్పటికీ కోలుకున్నట్టు క‌నిపించ‌డం లేదు. [more]

Update: 2019-08-20 08:00 GMT

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ రాజ‌కీయాలు చాలా డీలా ప‌డుతున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఊహించ‌ని ప‌రిణామం నుంచి పార్టీ ఇప్పటికీ కోలుకున్నట్టు క‌నిపించ‌డం లేదు. దీంతో ఎక్కడిక క్కడ స‌బ్దు వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ముఖ్యంగా అస‌లు బోణీనే కొట్టని జిల్లాల్లో ప‌రిస్థితి స‌రే. కానీ, అంతో ఇంతో గెలిచిన చోట పార్టీ ప‌రిస్థితి ఎలా ఉంది? నాయ‌కులు ఏ ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్నారు? అనే కీల‌క అంశాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. అనంత‌పురం విష‌యాన్ని తీసుకుంటే.. ఓడిన వారి ప‌రిస్థితి ఎలా ఉన్నా.. ఇక్కడ నుంచి ఇద్దరు కీలక నాయ‌కులు విజ‌యం సాధించారు.

నియోజకవర్గాలకు దూరంగా….

ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌య్యావుల కేశ‌వ్‌, హిందూపురం నుంచి చంద్రబాబు వియ్యంకుడు బాల‌కృష్ణ విజ‌యం ద‌క్కించుకున్నారు. జ‌గ‌న్ సునామీలోనూ ఈ ఇద్దరూ గెలుపు గుర్రాలు ఎక్కారు. దీంతో అస‌లు క‌న్నా కీల‌క నేత‌లు గెలిచార‌ని అధినేత చంద్రబాబు ఆనందించారు. కానీ, ఆయన ఆనందం ఎక్కువ సేపు నిల‌వ‌లేదు. దీనికి ప్రధాన కార‌ణం.. త‌న సొంత వియ్యంకుడు మ‌ళ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి దూరం కావ‌డ‌మే. గ‌తంలోనూ ఆయ‌న గెలిచినా.. త‌న త‌ర‌ఫున ప్రతినిధిని హిందూపురంలో పెట్టారు. త‌ర్వాత కొన్ని వివాదాలు తెర‌మీదికి వ‌చ్చాయి.

అధికారంలో లేనప్పుడు కూడా…

అయితే, ఇప్పుడు కూడా బాల‌కృష్ణ అలానే చేస్తున్నారు. ఎమ్మెల్యే అయిన త‌ర్వాత .. కేవ‌లం ఆయ‌న ప్రమాణం చేసేందుకు మాత్రమే స‌భ‌కు వ‌చ్చారు. త‌ర్వాత ఆయ‌న ఎక్కడా స‌భ‌లోకి వ‌చ్చింది లేదు. ముఖ్యంగా బ‌డ్జెట్ స‌మావేశాల స‌మ‌యంలోనూ ఆయ‌న క‌నిపించ‌లేదు. పైగా.. గ‌తంలో ఉన్న నియోజ‌క వ‌ర్గ బాధ్యుడినే ఇప్పుడు కూడా అక్కడ నిల‌బెట్టారు. దీంతో ప్రజ‌ల క‌న్నా.. కూడా పార్టీ శ్రేణులు ఇబ్బంది ప‌డుతున్నాయి. త‌మ‌ను న‌డిపించే వారు లేర‌ని వారు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. మొన్నంటే బాల‌య్య ప్రజ‌ల‌కు అందుబాటులో ఉన్నా లేక‌పోయినా అధికారం ఉంది కాబ‌ట్టి తిరిగి బాల‌య్యనే మ‌ళ్లీ గెలిపించారు. ఈ ఐదేళ్లు కూడా బాల‌య్య అలాగే వెళితే ఈ సారి హిందూపురంలో ఆయ‌న‌కు షాక్ త‌ప్పదు.

అంటీ ముట్టనట్లు…..

రెండు రోజుల కింద జ‌గ‌న్ ప్రభుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా చేప‌ట్టిన ధ‌ర్నాలో ఇక్కడ ఆందోళ‌న చేసిన నాధుడు ఎవ‌రూ లేక పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ప‌య్యావుల కేశ‌వ్ విష‌యానికి వ‌ద్దాం. ఈయ‌న చాన్నాళ్ల త‌ర్వాత ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. అదేస‌మ‌యంలో ల‌క్కు చిక్కి ప్రజాప‌ద్దుల చైర్మన్‌గా ప‌ద‌వి కొట్టేశారు. అయితే, ఆయ‌న నియోజ‌వ‌క‌ర్గంలో మాత్రం చురుగ్గా తిర‌గ‌ లేక‌పోతున్నార‌నే విమ‌ర్శలు వ‌స్తున్నాయి. కొంద‌రిని ప‌ట్టించుకోవ‌డం మానేశార‌ని అంటున్నారు. ఇటీవ‌ల అన్నా క్యాంటీన్లపై ఉద్యమం చేసిన స‌మ‌యంలోనూ ఆయ‌న ఎక్కడా క‌నిపించ‌క‌పోవ‌డంతో త‌మ్ముళ్లు పెద్ద ఎత్తున చ‌ర్చించుకున్నారు. కేశ‌వ్‌ను జిల్లాకు చెందిన నేత‌లు స‌మ‌స్యల‌పై క‌లిస్తే మీరు న‌న్నెందుకు క‌లుస్తారు.. మీకు ఓట్లేసిన వారిని క‌ల‌వ‌మ‌ని ఆన్సర్ ఇస్తుండ‌డంతో సొంత పార్టీ నేత‌లు సైతం షాక్ అయ్యే ప‌రిస్థితి. మొత్తానికి జిల్లాలో ఓడిన వారు ఎవ‌రూ కూడా ముందుకు రాక‌పోగా..గెలిచిన ఇద్దరూ కూడా అంటీ ముట్టన‌ట్టు ఉంటే.. పార్టీ ప‌రిస్థితి ఏంట‌ని చ‌ర్చించుకోవ‌డం సీనియ‌ర్ల వంతైంది!

Tags:    

Similar News