టీడీపీకి గన్నవరం టెన్షన్….కారణం ఇదే?

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో ఆ నియోజకవర్గ బాధ్యతలను చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. పిలిచి పదవి ఇస్తామన్నా నేతలు మొహం చాటేస్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలో గత [more]

Update: 2020-07-15 05:00 GMT

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో ఆ నియోజకవర్గ బాధ్యతలను చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. పిలిచి పదవి ఇస్తామన్నా నేతలు మొహం చాటేస్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలో గత ఆరు నెలలుగా ఇన్ ఛార్జి లేకుండా పోయారు. అనేక మంది పేర్లను చంద్రబాబు పరిశీలించినా వారెవ్వరూ గన్నవరం నియోజకవర్గం బాధ్యతలను తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. దీంతో తెలుగుదేశం పార్టీ పట్టున్న ప్రాంతంలోనే నేతలు కరవయ్యారన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

పట్టున్న నియోజకవర్గం….

గన్నవరం నియోజకవర్గానికి తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే ఆరు సార్లు ఇక్కడ టీడీపీ విజయం సాధించింది. విజయవాడకు సమీపంలోనే ఉండే గన్నవరంపై టీడీపీ పట్లు అలాంటింది. 2019 ఎన్నికల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గాలి వీచినా గన్నవరంలో మాత్రం టీడీపీ జెండా ఎగిరింది. ఇక్కడ నుంచి వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత వంశీ వైసీపీకి మద్దతుదారుగా మారిపోయారు. వంశీ పార్టీని వీడి దాదాపు ఎనిమిది నెలలు గడుస్తుంది.

నేతలు సైడయి పోతుండటంతో….

వల్లభనేని వంశీ పార్టీని వీడటంతో గన్నవరం బాధ్యతలను ఎవరికి అప్పగించాన్న దానిపై చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలతో మంతనాలు జరిపారు. ఇక్కడ గతంలో టీడీపీ నేతగా ఉన్న దాసరి బాలవర్థనరావుకూడా వైసీపీలో ఉన్నారు. ఇక గద్దె అనూరాధకు ఇవ్వాలనుకున్నా ఆమె అయిష్టత చూపారు. ఇక 2004లో గన్నవరం నుంచి గెలిచిన ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఇప్పుడు నూజివీడు బాధ్యతలను చూస్తున్నారు. దీంతో గన్నవరం బాధ్యతలను చేపట్టేందుకు టీడీపీలో నేత కరవయ్యాడు.

ఉప ఎన్నిక వస్తే….?

ఇక తాజాగా గన్నవరం బాధ్యతలను దేవినేని ఉమకు అప్పగించాలని చంద్రబాబు భావించారు. అయితే ఉమ మాత్రం గన్నవరం బాధ్యతలను స్వీకరించేందుకు ఏమాత్రం ముందుకు రావడం లేదు. ఇక అక్కడ కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీని పార్టీలోకి తీసుకుని గన్నవరం బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్నారు. ఆమె ఇటీవల స్థానిక సంస్థల ఎన్నిలకల్లో ఉంగుటూరు మండలం నుంచి జడ్పీటీసీగా టీడీపీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. సుంకర పద్మశ్రీని తీసుకురావలన్న ప్రతిపాదన కూడా కార్యరూపం దాల్చలేదు. మరోవైపు వల్లభనేని వంశీ తాను రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్తానని సన్నిహితులకు చెబుతుండటంతో టీడీపీలో గన్నవరం టెన్షన్ పట్టుకుంది.

Tags:    

Similar News