ఇక్కడ రిస్టార్ట్ చేయనున్నారా?

హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అధికార పార్టీ వరసగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ వెళుతోంది. మరోసారి జీహెచ్ఎంసీపై పార్టీ జెండాను ఎగుర వేయాలని అధికార టీఆర్ఎస్ [more]

Update: 2020-08-20 06:30 GMT

హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అధికార పార్టీ వరసగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ వెళుతోంది. మరోసారి జీహెచ్ఎంసీపై పార్టీ జెండాను ఎగుర వేయాలని అధికార టీఆర్ఎస్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా మంత్రి కేటీఆర్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మంగా తీసుకున్నారు. కరోనా వైరస్ కారణంగా ఎన్నికలు ఎప్పుడు జరిగేది స్పష్టంగా తెలియనప్పటికి అధికార పార్టీ మాత్రం ఎన్నికలకు సిద్ధమయిపోయింది.

దూరంగా ఉంటేనే బెటరని….

మరోవైపు తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలకు పూర్తిగా దూరమయినట్లేనా? అన్న కామెంట్స్ వినపడుతున్నాయి. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. రెండు స్థానాల్లో గెలిచింది. ఆ తర్వాత వారు కూడా అధికార పార్టీలోకి వెళ్లిపోయారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఏపీ ముఖ్మమంత్రిగా ఉండేవారు. చంద్రబాబు, నారా లోకేష్ లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసినా దక్కింది రెండు సీట్లు మాత్రమే.

చేయాలా? వద్దా?

అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అన్న మీమాంసలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు కావడంతో అభ్యర్థులకు కొరత ఉండదు. కానీ గెలిచే సమర్థత ఎంతమందికి ఉంటుంది. బరిలోకి దింపి ఓటమి పాలయి నవ్వలుపాలవ్వడం తప్ప మరేమీ మిగలదా? అన్న అనుమానం కూడా టీటీడీపీ నేతల్లో ఉంది. కాంగ్రెస్ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని వెళితే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా టీటీడీపీ నేతలు చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలకు కూడా టీడీపీ దూరంగా ఉన్న విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు.

బాబుతో చర్చించిన తర్వాతనే….

తెలుగుదేశం పార్టికి కొంత ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతాల్లో పోటీ చేస్తే ఎలాగుంటుందన్న దానిపై కూడా చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ నగర పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ విషయంపై పార్టీ అధినేత చంద్రబాబుతో కూడా చర్చించనున్నారు. చంద్రబాబు ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉండటంతో త్వరలోనే ఆయనను కలసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై క్లారిటీ తీసుకునే అవకాశముందంటున్నారు. మొత్తం మీద తెలంగాణలో టీడీపీ చాప చుట్టేసిన వేళ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? చేయరా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News