మండలిలో “ఆపరేషన్” తప్పేట్లు లేదుగా?

ఆంధ్రప్రదేశ్ లో అధికార, ప్రతిపక్ష పార్టీలు నిరంతరం పైచేయిపైనే కన్నేస్తుంటాయి. ఎవరికి అవకాశమున్న చోట వారు ఎదుటి వారిని తొక్కేయానికి సిద్ధపడుతుంటారు. అసెంబ్లీలో టీడీపీకి పెద్దగా బలం [more]

Update: 2020-12-09 13:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో అధికార, ప్రతిపక్ష పార్టీలు నిరంతరం పైచేయిపైనే కన్నేస్తుంటాయి. ఎవరికి అవకాశమున్న చోట వారు ఎదుటి వారిని తొక్కేయానికి సిద్ధపడుతుంటారు. అసెంబ్లీలో టీడీపీకి పెద్దగా బలం లేకపోవడంతో అక్కడ వైసీపీదే పైచేయిగా ఉంటుంది. చంద్రబాబు గోడును అసెంబ్లీలో ఎవరూ పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఈ సమావేశాల్లో చివరకు చంద్రబాబు తొలిసారి పోడియం ముందు బైటాయించాల్సి వచ్చింది. అదే సమయంలో జగన్ ప్రభుత్వానికి చెక్ పెట్టేందుకు టీడీపీకి శాసనమండలి వేదికగా మారుతుంది.

మండలిలో మాత్రం….

శాసనమండలిలో తెలుగుదేశం సభ్యుల బలం ఎక్కువ కావడంతో ఇక్కడ పై చేయి వీరిదే అవుతుంది. అమరావతి రాజధాని బిల్లులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసమండలి వ్యతిరేకించడంతోనే జగన్ హడావిడిగా,ఆవేశంతో శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయించారు. సొంత పార్టీ లో అసంతృప్తి తలెత్తుతుందని భావించినా జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఇద్దరు మంత్రులను శాసనమండలి నుంచి రాజ్యసభకు పంపి తనేంటో చెప్పారు.

మరో బల్లును తిప్పిపంపడంతో…..

అంత కసిగా ఉన్న జగన్ కు మరోసారి శాసనమండలిలో పరాభావం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పురపాలక చట్టం బిల్లును శాసనమండలి వ్యతిరేకించింది. బిల్లును వ్యతిరేకిస్తూ 29 మంది ఓటు వేయగా, అనుకూలంగా 11 మంది మాత్రమే ఉన్నారు.దీంతో పురపాలక బిల్లు శాసనమండలిలో వీగిపోయింది. దీనివల్ల ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చే నష్టమేమీ లేకపోయినా మరో అవమానం జరిగిందంటున్నారు.

మళ్లీ చేరికలతో…..

ఇప్పుడు వీగిపోయినా మరోసారి బిల్లును పంపితే ఈసారి దానిని తిరస్కరించినా అసెంబ్లీలో ఆమోదించుకునే వీలుంది. అయితే ఇది మరోసారి వైసీపీలో చర్చనీయాంశమైంది. వచ్చే ఏడాదికి గాని శాసనమండలిలో వైసీపీ సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం లేదు. అయినా అప్పటికి బలం సరిపోదు. దీంతో మరోసారి శాసనమండలిలో సభ్యులను పార్టీలోకి రప్పించుకోవడమే బెటర్ అని సీనియర్ నేతలు చెబుతున్నారట. డొక్కా మాణిక్య వరప్రసాద్, పోతుల సునీత తరహాలోనే కొందరు సభ్యులను పార్టీలోకి తీసుకు వస్తేనే బిల్లుల విషయంలో భవిష్యత్ లోనైనా ఇబ్బంది తలెత్తకుండా ఉంటుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

Tags:    

Similar News