నరసాపురంలో నాయకుడు ఈయనేనా బాబూ?

నరసాపురం పార్లమెంట్ స్థానం అంటే ఇప్పుడు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు పేరే ఎక్కువ వినిపిస్తోంది. గత ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ నుంచి వైసీపీ తర‌పున [more]

Update: 2021-09-09 12:30 GMT

నరసాపురం పార్లమెంట్ స్థానం అంటే ఇప్పుడు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు పేరే ఎక్కువ వినిపిస్తోంది. గత ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ నుంచి వైసీపీ తర‌పున ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణరాజు, ఆ తర్వాత నుంచి అదే పార్టీకి పెద్ద ప్రతిపక్ష నాయకుడు మాదిరిగా తయారయ్యారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న తప్పులని ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూనే ఉన్నారు. ఇటు జగన్ కూడా రఘురామ కృష్ణరాజుకు ఎలా చెక్ పెట్టాలని చూస్తూనే ఉన్నారు. ఇలా వారి మధ్య రాజకీయ యుద్ధం మామూలుగా లేదు.

సరైన నాయకుడు లేక?

ఇక వారి గురించి పక్కనబెడితే నరసాపురం పార్లమెంట్ స్థానంలో టీడీపీకి సరైన నాయకుడు లేరనే విషయాన్ని చంద్రబాబు పెద్దగా గ్రహిస్తున్నట్లు కనిపించడం లేదు. ఏదో రఘురామ కృష్ణరాజు, వైసీపీ ప్రభుత్వంపై పోరాడితే అది టీడీపీకి లాభం జరుగుతుందనే ఉద్దేశంలో ఉండిపోయినట్లు కనిపిస్తోంది. రఘురామ కృష్ణరాజు ఎపిసోడ్ వల్ల టీడీపీకి లాభం జరుగుతుందా ? నష్టం జరుగుతుందా ? అనే విషయాన్ని వదిలేసి, ఇక్కడ పార్టీకి బలమైన నాయకుడుని పెట్టవ‌ల‌సిన బాధ్యత చంద్రబాబుదే. గత ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ బ‌రిలో అప్పటి ఉండి ఎమ్మెల్యేఏ వేటుకూరి శివరామరాజుని టీడీపీ తర‌పున నిలబెట్టారు.

ఓటమి తర్వాత….?

శివ‌ స్వల్ప మెజారిటీ తేడాతో రఘురామ కృష్ణరాజుపై ఓడిపోయారు. ఓడిపోయాక శివరామరాజు టీడీపీలో అసలు కనిపించడం లేదు. ఆయ‌న వ్యాపారాల్లో బిజీ బిజీగా ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఈయన తన సొంత స్థానం ఉండి నియోజకవర్గంలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. మరి అలా అనుకుంటే నర్సాపురం పార్లమెంట్‌లో టీడీపీ తర‌పున పోటీ చేసే నాయకుడు ఎవరు? అనేది ఇప్పుడు ప్రశ్నగా ఉంది.

బలమైన నేత ఏరీ?

ప్రస్తుతానికి నర్సాపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షురాలుగా తోట సీతారామలక్ష్మి ఉన్నారు. ఆమె గ‌తంలో ఓ సారి న‌ర‌సాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. త‌ర్వాత రాజ్యస‌భ‌కు ఎంపికైన ఆమె వ‌చ్చే ఎన్నిక‌ల బ‌రిలో దిగేందుకు సిద్ధంగా లేరు. ఈ నేప‌థ్యంలో నరసాపురం పార్లమెంట్ బాధ్యతలు చూసే బ‌ల‌మైన నాయ‌కుడిని రెడీ చేయాల్సిన బాధ్యత చంద్రబాబుదే..! ఇక్కడ‌ త్వరగా నాయకుడుని సెట్ చేస్తే, బలంగా ఉన్న ఈ స్థానంలో టీడీపీకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మ‌రో టాక్ ఏంటంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌ర‌సాపురం ఎంపీ క్యాండెట్‌గా టీడీపీ త‌ర‌పున రఘురామ కృష్ణరాజు ఉంటార‌ని ఆ పార్టీలోనే ప్రచారం జ‌రుగుతోంది.

Tags:    

Similar News