సిక్కోలు పగ్గాలు వారికేనట…… కొత్తవారికి ఛాన్స్

రాష్ట్రానికి చివ‌రాఖ‌ర‌న ఒడిశా స‌రిహ‌ద్దుల్లో ఉన్న శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి కీల‌క‌మైన నాయ‌కులు ఉన్నా రు. నిజానికి రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు క‌ళా వెంక‌ట్రావు ఈ జిల్లా [more]

Update: 2020-04-28 11:00 GMT

రాష్ట్రానికి చివ‌రాఖ‌ర‌న ఒడిశా స‌రిహ‌ద్దుల్లో ఉన్న శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి కీల‌క‌మైన నాయ‌కులు ఉన్నా రు. నిజానికి రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు క‌ళా వెంక‌ట్రావు ఈ జిల్లా నాయ‌కుడే. అచ్చెన్నాయుడు, రామ్మోహ‌న్‌నాయుడు, గౌతు కుటుంబం, క‌ల‌మ‌ట కుటుంబం, గుండ కుటుంబం, కూన ర‌వికుమార్‌, భ‌గ్గు కుటుంబం, బెందాళం అశోక్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జిల్లాలో కీల‌క నేత‌ల‌కు కొద‌వే లేదు. టీడీపీకి ఈ జిల్లా ఎప్పుడూ కంచుకోట‌గా ఉంటూ వ‌స్తోంది. అయితే, ఈ జిల్లాలో ఇప్పుడు టీడీపీ వీక్ అయిపోయింది. ముఖ్యంగా శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి నాయ‌క‌త్వ లోటు స్పష్టంగా క‌నిపిస్తోంది. ఇక్క‌డ నుంచి 1983 నుంచి గుండా అప్పల సూర్యనారాయ‌ణ ఇక్కడ గెలుస్తున్నారు. గ‌తంలో మంత్రి కూడా చక్రం తిప్పారు. దీంతో ఆయ‌న‌కు దేవుడు మంత్రిగా పేరు కూడా ఉంది. ఇక‌, ఆయ‌న వృద్ధాప్య కార‌ణాల‌తో ఇబ్బంది ప‌డుతున్న నేప‌థ్యంలో ఆయ‌న స‌తీమ‌ణి రంగంలోకి దిగారు.

ధర్మానపై ఓటమి పాలయి…..

2014లో ధ‌ర్మాన ప్రసాద‌రావును ఓడించి మ‌రీ గుండా ల‌క్ష్మీదేవి ఇక్కడ విజ‌యం ద‌క్కించుకున్నారు. ధ‌ర్మాన‌పై ఆమె ఏకంగా 21 వేల ఓట్ల భారీ మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. గ‌త ఐదేళ్లలో పార్టీ అధికారంలో ఉన్నా అభివృద్ధి విష‌యంలో మాత్రం గ‌త ప‌దేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాల‌న‌తో పోలిస్తే వెన‌క‌ప‌డిపోయారు. టీడీపీలో శ్రీకాకుళంకు పెద్దగా ఒరిగిందేమి లేదు. ఒక్క కార్పొరేష‌న్ అవ్వడం మిన‌హాయించి. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లోనూ గుండా ‌క్ష్మీదేవి పోటీ చేశారు. నిజానికి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ దూకుడు ప్రద‌ర్శించి జ‌గ‌న్ సునామీ ప్రభావం క‌నిపించినా.. శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం గుండా ల‌క్ష్మీదేవి ట‌ఫ్ ఫైట్ ఇచ్చారు. ఇక్కడ నుంచి వైసీపీ టికె ట్‌పై పోటీ చేసిన మాజీ మంత్రి ధ‌ర్మాన ప్రసాద‌రావు విజ‌యం సాధించారు.

తర్వాత ఎవరు?

ఈ క్రమంలో గుండా ల‌క్ష్మీదేవి కేవ‌లం 5777 ఓట్ల తేడాతో ఓట‌మి పాల‌య్యారు. ఇక‌, ఇప్పుడు ప‌రిస్థితి చూస్తే.. వృద్ధాప్య కార‌ణాల‌తో ఆమె రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. దీనికితోడు ధ‌ర్మాన వ్యూహాల‌కు ప్రతివ్యూహాలు వేసే ప‌రిస్థితి కూడాలేదు. ఇక‌, వారసులు ఉన్నప్పటికీ రాజ‌కీయాల్లోకి రాలేదు. అస‌లు గుండా దంప‌తుల వార‌సుల‌కు రాజ‌కీయాలంటేనే పెద్దగా ఆస‌క్తి లేదు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి గుండా కుటుంబం ప్రత్యక్ష రాజ‌కీయాల నుంచి పూర్తిగా త‌ప్పుకొనే ఛాన్స్ క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఇక్కడ పార్టీకి స‌రైన నాయ‌కుడి అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని అంటున్నారు స్థానికులు.

కింజారపు కుటుంబానికేనా?

ఈ క్రమంలోనే గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నుంచి శ్రీకాకుళం సీటుపై క‌న్నేసిన కొంద‌రు కీల‌క నేత‌ల పేర్లు ఇప్పుడు ప‌రిశీల‌న‌కు రానున్నాయి. గుండా దంప‌తులు త‌ప్పుకుంటే శ్రీకాకుళం పార్టీ ప‌గ్గాలు కింజార‌పు కుటుంబానికి న‌మ్మిన‌బంటుగా ఉన్న నేత‌ల‌కే ఇస్తార‌న్న చ‌ర్చ కూడా న‌డుస్తోంది. ఇక ఇక్కడ పార్టీ ప‌టిష్టత నేప‌థ్యంలో చంద్రబాబు ఈ దిశ‌గా ఆలోచించి ముందుగానే నాయ‌కుడిని నియ‌మించాల్సి ఉంది.

Tags:    

Similar News