నాయుడిగారి ఆలోచన అదేనట.. గెలవలేమని తెలిసీ?
తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పూర్తిగా కనుమరుగై పోయినా నిలదొక్కుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవల ప్రతి ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధమవుతుంది. గెలవలేమని తెలిసినా పార్టీని అభ్యర్థిని [more]
తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పూర్తిగా కనుమరుగై పోయినా నిలదొక్కుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవల ప్రతి ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధమవుతుంది. గెలవలేమని తెలిసినా పార్టీని అభ్యర్థిని [more]
తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పూర్తిగా కనుమరుగై పోయినా నిలదొక్కుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవల ప్రతి ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధమవుతుంది. గెలవలేమని తెలిసినా పార్టీని అభ్యర్థిని ప్రకటిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అయితే జాతీయ పార్టీగా చెప్పుకునేందుకే అడపా దడపా అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటస్తున్నారన్న చర్చ పార్టీలో జరుగుతుంది.
పోటీ చేసినా….?
ఇప్పటికే రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ పోటీ చేస్తున్నారు. పట్టభద్రుల ఎన్నిక కావడం, మూడు జిల్లాల్లో బలం పెద్దగా లేకపోవడంతో ఈయన గెలుపు సంగతి పక్కన పెడితే డిపాజిట్లు దక్కించుకుంటే చాలన్న పరిస్థిితి ఉంది. ఈ స్థానానికి కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి, బీజేపీ నుంచి రామచంద్రరావు, స్వతంత్ర అభ్యర్థిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ లు బరిలో ఉన్నారు. వీరిని కాదని ఎల్.రమణకు ధరవాత్తు దక్కడం కూడా అనుమానమే.
సాగర్ ఉప ఎన్నికలోనూ….
అలాగే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలోనూ పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమయింది. చంద్రబాబు నాయుడు ఇక్కడ అభ్యర్థిగా మువ్వా అరుణ్ కుమార్ పేరును ప్రకటించారు. సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్యనే పోటీ ఉంది. ఇక్కడ బీజేపీ కూడా నామమాత్రమే. అలాంటి పరిస్థితుల్లో నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపడం ఎందుకన్న ప్రశ్న పార్టీ నేతల నుంచే వస్తుండటం గమనార్హం.
బీజేపీ మైత్రికోసమేనా?
గతంలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక నుంచి పోటీ చేసి డిపాజిట్లు కూడా దక్కించుకోలేదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బరిలోకి దిగి ఒక్క వార్డును కూడా గెలుచుకోలేకపోగా డిపాజిట్లు కూడా రాలేదు. అయితే కేవలం జాతీయ పార్టీ అని చెప్పుకునేందుకే ఇటీవల అన్ని ఎన్నికల్లో అభ్యర్థులను బరిలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నట్లుంది. దీంతో పాటు వచ్చే ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ ముందుకు రావాలన్న ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీ అధినేతకు ఉన్నట్లుంది. అందుకే అన్ని ఎన్నికల్లో పోటీకి దింపుతున్నారు.