దిద్దుబాటు చర్యలే అయినా…బాగుపడుతుందా?
విజయనగరం జిల్లా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అయితే నేతల మధ్య విభేదాలతో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. తొమ్మిది నియోజకవర్గాలను [more]
విజయనగరం జిల్లా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అయితే నేతల మధ్య విభేదాలతో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. తొమ్మిది నియోజకవర్గాలను [more]
విజయనగరం జిల్లా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అయితే నేతల మధ్య విభేదాలతో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. తొమ్మిది నియోజకవర్గాలను వైసీపీ కైవసం చేసుకుంది. అశోక్ గజపతిరాజు, సుజయ కృష్ణ రంగారావు లాంటి వారే ఇంటి దారి పట్టక తప్పలేదు. అయితే బీసీలను నిర్లక్ష్యం చేస్తూ రాజులకు పెద్దపీట వేస్తుండటమే ఇందుకు కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తించారు. అందుకోసమే తప్పులు సరిదిద్దే యత్నం చేశారు.
స్ట్రాంగ్ గా ఉండటంతో….
విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే స్ట్రాంగ్ గా ఉంది. అయితే గత ఎన్నికల్లో వచ్చిన ప్రజా తీర్పుతో కంగు తినింది. భారీ మూల్యం చెల్లించుకుంది. బీసీలను ఈ జిల్లాలో విస్మరించారనే పేరుంది. అందుకే పార్లమెంటరీ నియోజకవర్గ బాధ్యతలను కిమిడి నాగార్జునకు చంద్రబాబు అప్పగించారు. బీసీనేత కావడం వల్లే నాగార్జునకు ఈ పదవిని చంద్రబాబు కట్టబెట్టారని తెలుస్తోంది. రాజుల ఆధిపత్యం నుంచి పక్కకు తప్పించేందుకే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాజుల ఆధిపత్యంతో….
మరోవైపు మహిళా ఇన్ ఛార్జి బాధ్యతలను మరో బీసీ నేత, మాజీ నెల్లిమర్ల ఎంపిపి అయిన సువ్వాడ వనజాక్షికి అప్పగించారు. ఇలా రెండు పోస్టులు బీసీలకు అప్పగించి చంద్రబాబు దిద్దుబాటు చర్యలకు దిగారు. అయితే ఈ సందర్భంగా కొంత అసంతృప్తులు తలెత్తే అవకాశమున్నా చంద్రబాబు మాత్రం బీసీల జపమే చేశారు. మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు పార్లమెంటరీ ఇన్ ఛార్జి పదవి పై ఆశలు పెట్టుకున్నారు. ఆయన అసంతృప్తితో ఉన్నా పార్టీ నిర్ణయాన్ని కాదనలేడన్నది చంద్రబాబు విశ్వాసం.
అసంతృప్తి ఉన్నా…..
అలాగే మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కూడా హర్ట్ అయ్యారు. గత ఎన్నికల్లోనే మీసాల గీతకు విజయనగరం టిక్కెట్ ను చంద్రబాబు ఇవ్వలేదు. అశోక్ కుమార్తె ఆదితికి ఇచ్చారు. దీంతో మీసాల గీత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోంది. ఆమెకు కూడా ఏదో ఒక పదవి ఇచ్చే ఉద్దేశ్యంలో చంద్రబాబు ఉన్నారు. పొలిట్ బ్యూరోలోనూ గుమ్మడి సంధ్యారాణిని నియమించి చంద్రబాబు విజయనగరం జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇచ్చారు. ఇవన్నీ దిద్దుబాటు చర్యలేనంటున్నాయి టీడీపీ వర్గాలు. ఇప్పటికైనా సమిష్టిగా పార్టీ నేతలు కృషి చేస్తే కోల్పోయిన పూర్వవైభవం తిరిగి పొందే అవకాశముందంటున్నారు.