బెజవాడలో విచిత్రం.. లోకల్ కమ్మ వైసీపీ-నాన్‌లోకల్ టీడీపీ
ఇటీవల ముగిసిన స్థానిక ఎన్నికలను పరిశీలిస్తే.. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో చిత్రమైన సంగతులు వెలుగు చూశాయి. విశాఖ, విజయవాడ వంటి కీలక నగరాల్లో కొన్ని చోట్ల టీడీపీ [more]
ఇటీవల ముగిసిన స్థానిక ఎన్నికలను పరిశీలిస్తే.. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో చిత్రమైన సంగతులు వెలుగు చూశాయి. విశాఖ, విజయవాడ వంటి కీలక నగరాల్లో కొన్ని చోట్ల టీడీపీ [more]
ఇటీవల ముగిసిన స్థానిక ఎన్నికలను పరిశీలిస్తే.. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో చిత్రమైన సంగతులు వెలుగు చూశాయి. విశాఖ, విజయవాడ వంటి కీలక నగరాల్లో కొన్ని చోట్ల టీడీపీ పుంజుకోవడం.. మరికొన్ని చోట్ల అందునా.. పట్టు బాగుందని భావించిన చోట్ల మాత్రం.. పార్టీ ఓడిపోవడం.. వంటివి చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వీటిపై నిశితంగా దృష్టి పెడితే కొన్ని సంచలన విషయాలు వెలుగు చూడడం గమనార్హం. విజయవాడనే తీసుకుంటే.. ఇక్కడ కార్పొరేషన్ పీఠాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. అయితే.. ఇక్కడి మూడు నియోజకవర్గాల్లో ఓట్ల షేరింగ్‌ను గమనిస్తే.. ఆసక్తిగా ఉంది. తూర్పు నియోజకవర్గంలో టీడీపీ గత ఎన్నికల్లో విజయం దక్కించుకుంది.
ఎక్కువ డివిజన్లను…
పైగా ఈ నియోజకవర్గంలో చంద్రబాబుకు అభిమాన గణంతోపాటు.. కమ్మ సామాజిక వర్గం హవా ఎక్కువగా ఉంది. పైగా ఇక్కడ నుంచి గెలిచిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా కమ్మ వర్గానికి చెందిన నాయకుడే కావడం గమనార్హం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ నుంచి గద్దె రామ్మోహన్ 18 వేల ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఇక్కడ ఓటు షేర్‌ను గమనిస్తే.. తూర్పులోని ఏడు డివిజన్లలో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. పైగా ఓటు బ్యాంకు కూడా ఎక్కువగా పడింది. దీనికి రీజనేంటి ? అంటే.. స్వతహాగా.. ఇక్కడే ఉన్న అంటే.. ఇక్కడే పుట్టి పెరిగిన కమ్మ సామాజిక వర్గం వైసీపీ వైపు మొగ్గు చూపగా.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి.. వ్యాపారాలు ఏర్పాటు చేసుకుంటోన్న, రియల్ రంగంలో ఉన్న కమ్మలు మాత్రం టీడీపీకి అనుకూలంగా ఓటేశారనే విషయం వెల్లడైంది.
స్థానిక కమ్మ సామాజికవర్గం….
వీరంతా కోస్తాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన ‘కమ్మ’ వర్గ ఓటర్లుగా భావిస్తున్నారు. వైసీపీపై వ్యతిరేకత వీరిలో కొట్టొచ్చినట్టు కనిపించిందనే వ్యాఖ్యలు వస్తున్నాయి. జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో వీరి వ్యాపారాలు భారీగా దెబ్బతిన్నాయి. రియల్ రంగం కుదేలైంది. దీంతో వీరు అధికార పార్టీకి వ్యతిరేకంగా మారినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ‘కమ్మ’ సామాజికవర్గం ఈ ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలనే పట్టుదలతో వ్యవహరించిందని, వారు ఎక్కడా అధికార పార్టీకి లొంగకుండా పార్టీ గెలుపు కోసం సైలెంట్‌గా పనిచేశారని అంటున్నారు. ఇక, ఇక్కడే పుట్టి పెరిగిన కమ్మ వర్గం మాత్రం.. వైసీపీ వైపు మొగ్గు చూపారని తేలింది. దీంతో పలు డివిజన్లలో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కిందని అంటున్నారు. సెటిల్ కమ్మ ఓటర్ల ప్రభావం ఎక్కువుగా ఉన్న పడమట, తూర్పు నియోజకవర్గంలో ఆ పార్టీ పలు డివిజన్లు గెలిచింది. ఇక టీడీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లలో కూడా ఎక్కువ మంది కమ్మ వర్గం వారే ఉన్నారు.