టీడీపీకి దన్నూ… దమ్మూ ఎవరు… ?
తెలుగుదేశం పార్టీ హిస్టరీ చూసినా అధినాయకుడి అనుభవం చూసినా కూడా ఇలాంటి పరిస్థితిని ఎవరూ ఊహించరు. అయితే అధినాయకత్వం వైఖరి వల్లనే ఇపుడు ఇలాంటి దుస్థితి దాపురించింది [more]
తెలుగుదేశం పార్టీ హిస్టరీ చూసినా అధినాయకుడి అనుభవం చూసినా కూడా ఇలాంటి పరిస్థితిని ఎవరూ ఊహించరు. అయితే అధినాయకత్వం వైఖరి వల్లనే ఇపుడు ఇలాంటి దుస్థితి దాపురించింది [more]
తెలుగుదేశం పార్టీ హిస్టరీ చూసినా అధినాయకుడి అనుభవం చూసినా కూడా ఇలాంటి పరిస్థితిని ఎవరూ ఊహించరు. అయితే అధినాయకత్వం వైఖరి వల్లనే ఇపుడు ఇలాంటి దుస్థితి దాపురించింది అన్న మాట అయితే ఉంది. అయిదేళ్ల పాటు అధికారంలో ఉన్నపుడు పదవులు అనుభవించిన వారు ఇపుడు సైలెంట్ అయ్యారు. ఇక ఆర్ధికంగా బడా నేతలు కూడా టీడీపీ వైపు చూడడంలేదు. దాంతో విశాఖ వంటి జిల్లాల్లో ఆ పార్టీ ఎలా నెట్టుకువస్తుంది అన్న చర్చ గట్టిగా వినిపిస్తోంది.
మమ అనిపిస్తున్నారా…?
విశాఖ అర్బన్ జిల్లా తెలుగుదేశం ప్రెసిడెంట్ గా ఉన్న పల్లా శ్రీనివాసరావు ఆర్ధికంగా బలవంతుడే. నిజానికి ఆయన పొజిషన్, సామాజిక వర్గం అన్నీ చూసుకునే చంద్రబాబు కిరీటం నెత్తిన పెట్టారు. అయితే పల్లా అనుకున్న విధంగా ఎక్కడా విదల్చడం లేదు అన్న మాట ఉంది. అసలు ఆయన సిటీకి కూడా పెద్దగా రాకుండా గాజువాకలోనే కాలక్షేపం చేస్తున్నారు. మరో వైపు చూస్తే ఆయన ఆర్ధిక మూలాల మీద కూడా వైసీపీ గురి పెట్టి మరీ దెబ్బ కొట్టేస్తోంది. దాంతో వచ్చే ఎన్నికల్లో ఆయన ఎంత మేరకు పార్టీకి పెట్టుబడిగా మారుతారు అన్నది డౌటే.
అంతంతమాత్రమే…?
ఇక మూడు సార్లు గెలిచి ఆర్ధికంగా బలంగా ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యే వెలగపూడి లాంటి వారు పార్టీని నడిపించడానికి ముందుకు రావడంలేదు. తన ఎమ్మెల్యే ఖర్చులను ఎంపీ ఖాతాలో రాసేసుకునే వెలగపూడి నుంచి వచ్చే ఎన్నికల్లో భారీ పెట్టుబడులు ఆశించడం అత్యాశే అవుతుంది అంటున్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఉన్నా కూడా ఆయన ఆర్ధిక విషయాల్లో ఎపుడూ జోక్యం చేసుకున్న రకం కాదంటారు. ఇక అనకాపల్లి నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన పీలా సత్యనారాయణ ధనవంతుడూ, బలవంతుడే కానీ అధినాయకత్వం ముందు మాత్రం లేనట్లుగానే కనిపిస్తారు. తన వరకూ తాను అన్నట్లుగా ఉంటారని టాక్.
కష్టమైన ప్రయాణం…?
మరో మూడేళ్ళు తెలుగుదేశం పార్టీని నడిపించాలి. ఎన్నికల వేళ గట్టిగా ఎదుర్కోవాలి. విశాఖ సిటీలో ఇదే టీడీపీకి సమస్యగా ఉంది. చాలా మంది ఆర్ధికంగా పట్టున్న నేతలు ఇప్పటికే వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇక ఎటూ కాకుండా ఉన్న వారు, టీడీపీ సానుభూతిపరులు ఇపుడు సైలెంట్ అయినా ఎన్నికల వేళకు ముందుకు వస్తారు అంటున్నారు. అయితే వారికి టికెట్లు ఇవ్వకుండా బడ్జెట్ పద్దులు అప్పగిస్తే ఎంతవరకు సహకరిస్తారు అన్నదే తెలుగుదేశం పెద్దల ఆలోచనట. మరి టికెట్లు ఇవ్వాలంటే సామాజిక సమతూకం చూడాలి. లోకల్ కార్డు కూడా వాడాలి. ఇవేమీ లేకుండా పెట్టుబడి పెట్టారని ఆఫర్లు ఇస్తే మొదటి నుంచి ఉన్న తమ్ముళ్ళు జారిపోతారు. మొత్తానికి టీడీపీ ఇప్పటికైతే దివంగత ఎంపీ ఎంవీవీస్ మూర్తి మనవుడు, బాలయ్య అల్లుడు శ్రీ భరత్ కే విశాఖ ఆర్ధిక భారాలతో పాటు అన్నింటికీ అప్పగించిందని టాక్.