స్ట్రాటజీ మార్చిన సారు… ఆ ముగ్గురిపైనే గురి
తెలుగుదేశం పార్టీ స్ట్రాజటీ మార్చింది. వాయిస్ ఉన్న వైసీపీ నేతలను టార్గెట్ గా పెట్టుకుంది. మూకుమ్మడి దాడికి దిగుతుంది. వారిని కంట్రోల్ చేయాలంటే ఇదొక్కటే మార్గమని భావించి [more]
తెలుగుదేశం పార్టీ స్ట్రాజటీ మార్చింది. వాయిస్ ఉన్న వైసీపీ నేతలను టార్గెట్ గా పెట్టుకుంది. మూకుమ్మడి దాడికి దిగుతుంది. వారిని కంట్రోల్ చేయాలంటే ఇదొక్కటే మార్గమని భావించి [more]
తెలుగుదేశం పార్టీ స్ట్రాజటీ మార్చింది. వాయిస్ ఉన్న వైసీపీ నేతలను టార్గెట్ గా పెట్టుకుంది. మూకుమ్మడి దాడికి దిగుతుంది. వారిని కంట్రోల్ చేయాలంటే ఇదొక్కటే మార్గమని భావించి టీడీపీ ఇటీవల కాలంలో దూకుడు పెంచింది. మంత్రివర్గంలో వాయిస్ ఉన్న నేతలకు కళ్లెం వేయడానికి ఇప్పుడు కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్లు కనపడుతుంది. మంత్రులపై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రజల్లో పెద్దయెత్తున వారిని బద్నాం చేసే ప్రయత్నం చేస్తుంది.
ముగ్గురు మంత్రులను….
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎప్పుడూ హీట్ గానే ఉంటాయి. మరీ వైసీపీ, టీడీపీ ల మధ్య ఎవరు అధికారంలో ఉన్నా మాటల యుద్ధం మామూలుగా ఉండదు. తాజాగా తెలుగుదేశం పార్టీ ముగ్గురు మంత్రులను టార్గెట్ చేసినట్లు కనపడుతుంది. కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్. ఈ ముగ్గురిపై అవినీతి ఆరోపణలు చేస్తూ తెలుగుదేశం పార్టీ దూకుడుగా ముందుకు వెళుతుంది.
ఇసుక దందా….
నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై ఇసుక దందా ఆరోపణలు చేశారు. అనిల్ కుమార్ యాదవ్ పెన్నా నది నుంచి ఇసుకను తోలి వంద కోట్ల రూపాయలను సంపాదించారని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. ఈదోపిడీలో పార్టీ పెద్దలకు వాటాలున్నాయన్నారు. దీనిపై అనిల్ కుమార్ యాదవ్ వెంటనే అఖిలపక్ష సమావేశం పెట్టి ఇసుక తవ్వకాలపై చర్చ పెట్టారు. అయినా అనిల్ కుమార్ యాదవ్ పై తెలుగుదేశం పార్టీ ఇసుక అవినీతి ఆరోపణలను కొనసాగిస్తూనే ఉంది.
ఆరోపణలతో….
ఇక మరోమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై కూడా ఆరోపణలు చేస్తున్నారు. పెద్దిరెడ్డి గుజ్జు పరిశ్రమల యాజమాన్యంతో కుమ్మక్కై మామిడి రైతులను మోసం చేశారని చంద్రబాబు స్వయంగా ఆరోపించడం విశేషం. పెద్దిరెడ్డి మామిడి రైతుల పొట్ట కొట్టారని మాజీ మంత్రి అమర్ నాధ్ రెడ్డి ఆరోపించారు. ఇక కొడాలి నాని మీద తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో పేకాట దందాపై పెద్దయెత్తున పోస్టింగ్ లు కనపడుతున్నాయి. మొత్తం మీద వాయిస్ ఉన్న ముగ్గురు మంత్రులను తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసినట్లే కనపడుతుంది.