తండ్రికోసం.. త్యాగం.. చివరికి ఆ యువనేతకు మిగిలిందేంటి..?
రాజకీయాల్లో త్యాగాలు సాధారణం. అయితే, ఈ త్యాగం మాత్రం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించేదే. ఎందుకంటే.. తండ్రి కోసం తనయుడు చేసిన త్యాగం.. ఇప్పుడు ఆ తనయుడికి రాజకీయంగా [more]
రాజకీయాల్లో త్యాగాలు సాధారణం. అయితే, ఈ త్యాగం మాత్రం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించేదే. ఎందుకంటే.. తండ్రి కోసం తనయుడు చేసిన త్యాగం.. ఇప్పుడు ఆ తనయుడికి రాజకీయంగా [more]
రాజకీయాల్లో త్యాగాలు సాధారణం. అయితే, ఈ త్యాగం మాత్రం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించేదే. ఎందుకంటే.. తండ్రి కోసం తనయుడు చేసిన త్యాగం.. ఇప్పుడు ఆ తనయుడికి రాజకీయంగా భవిష్యత్తు లేకుండా చేసేసింది. ఆయనే టీజీ భరత్ గుప్తా. తన తండ్రి, మాజీ మంత్రి టీజీ వెంకటేష్ గుప్తా కోసం భరత్ గుప్తా.. రాజకీయంగా చేసిన త్యాగం.. ఇప్పటికీ ఆయనను వెంటాడుతోంది. మొదట టీడీపీ, తర్వాత కాంగ్రెస్‌లో రాజకీయాలు చేసిన టీజీ వెంకటేష్ . మంత్రి పదవులు సైతం సంపాదించుకున్నారు. ఇక 2014 ఎన్నికల్లో ఆయన తిరిగి టీడీపీలోకి జంప్ చేశారు. ఆ ఎన్నికల్లో కర్నూలు నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు.
కుమారుడిని రంగంలోకి దించి…..
రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయన మంత్రి పదవి ఆశలు గల్లంతయ్యాయి. అయినా కర్నూలు టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఆయన ఎన్ని పార్టీలు మారినా అనేక పదవులు పొందారే తప్ప ప్రజల కోసం ఏం చేశారనే విషయంపై మాత్రం ఇప్పటికీ అనేక సందేహాలు.. ప్రశ్నలు మాత్రం ఉండడం గమనార్హం. కానీ, తమ వ్యాపారాలు మాత్రం పెంచుకున్నారనే విమర్శలు మాత్రం వినిపిస్తాయి. సరే. విభజన తర్వాత టీజీ వెంకటేష్ మళ్లీ టీడీపీలోకి రావడం ఎన్నికల్లో ఓడడం జరిగాక రాజ్యసీటును దక్కించుకోవడం తెలిసిందే. ఇక, ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో ఆయన తన కుమారుడు భరత్‌ను రంగంలోకి దింపారు.
వైసీపీలోకి వెళ్దామనుకున్నా…..
దీనిపై బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టీజీ భరత్ కూడా ఏడాది ముందు నుంచే నియోజకవర్గంలో పాదయాత్రలు నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి తనను తాను పరిచయం చేసుకున్నారు. అయితే, గత ఏడాది ఎన్నికలకు ముందు.. టీజీ భరత్ సొంతగా నియోజకవర్గంలో సర్వే చేయించుకున్నారు. తన గెలుపు ఓటములపై ముందుగానే సమాచారం తెచ్చుకున్నారు. టీడీపీలో ఉంటే ఓటమి ఖాయమని తెలుసుకున్నాక.. వైసీపీ వైపు పరుగు పెట్టాలనుకున్నారు. జగన్ కూడా సానుకూలంగానే స్పందించారు.
తప్పుచేశానని ఇప్పుడు….
ఎన్నికలకు ముందు ఎస్వీ. మోహన్‌రెడ్డి టీడీపీలో ఉండడం, అప్పుడు కర్నూలు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఇప్పటి వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌పై జగన్‌కు నమ్మకం లేకపోవడంతో జగన్ సైతం భరత్ వైపు మొగ్గుచూపారు. భరత్ వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకోవాలని డిసైడ్ అయినా తండ్రి వెంకటేష్ గుప్తా మాత్రం.. బాబే మళ్లీ అధికారంలోకి వస్తారు… నీకు ఏదో ఒక పదవి వస్తుందన్న ఆశ చూపించడంతో టీజీ భరత్ వైసీపీ ఇచ్చిన ఆఫర్‌ను త్యాగం చేశారన్న ప్రచారం అయితే ఉంది. ఇక ఎన్నికల్లో చివరి వరకు టఫ్ ఫైట్ ఇచ్చిన ఓడిన టీజీ భరత్ ఇప్పుడు టీడీపీలోనే ఉండి తప్పు చేశానని మదన పడుతున్నారట. మరోవైపు వెంకటేష్ ఇప్పటికే కాషాయ కండువా కప్పేసుకున్న సంగతి తెలిసిందే. సో అలా తండ్రి కోసం చేసిన త్యాగంతో టీజీ భరత్ రాజకీయ భవిష్యత్తు డైలమాలో పడింది.