టీజీ భరత్.. ఉన్నట్టా లేనట్టా… టీడీపీలో అయోమయం
టీడీపీ యువ నేత.. టీజీ భరత్‌పై టీడీపీ నేతలు సెటైర్లు పేలుస్తున్నారు. ఆయన పార్టీలో ఉన్నారా ? లేరా ? అనే సందేహాలుసైతం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ [more]
టీడీపీ యువ నేత.. టీజీ భరత్‌పై టీడీపీ నేతలు సెటైర్లు పేలుస్తున్నారు. ఆయన పార్టీలో ఉన్నారా ? లేరా ? అనే సందేహాలుసైతం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ [more]
టీడీపీ యువ నేత.. టీజీ భరత్‌పై టీడీపీ నేతలు సెటైర్లు పేలుస్తున్నారు. ఆయన పార్టీలో ఉన్నారా ? లేరా ? అనే సందేహాలుసైతం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నాయకుడు.. టీడీపీ మూలాలు ఉన్న టీజీ వెంకటేశ్ కుమారుడు భరత్.. ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. అయితే, వెంకటేశ్ మాత్రం టీడీపీ తరఫున రాజ్య సభ టికెట్‌ను తీసుకుని.. తర్వాత బీజేపీలోకి జంప్ చేశారు. ఇక, ఇప్పుడు భరత్.. కర్నూలు నగర టీడీపీ చీఫ్‌గా ఉన్నారు. అయితే ఏ ఒక్క కార్యక్రమంలోనూ భరత్ పార్టిసిపేషన్ లేకపోవడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మరీముఖ్యంగా.. కర్నూలులో టీడీపీని బలోపేతం చేయాలని ఇటీవల చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
వ్యాపారాలకే…..
అయితే, దీనికి సరేనన్న భరత్.. వెంటనే ఈ విషయాన్ని అటకెక్కించారు. మరోవైపు.. తండ్రి వెంట ఢిల్లీకి తిరుగుతున్నారని, వ్యాపారాలు చూసుకుంటున్నారని స్థానిక నేతలు చెవులు కొరుక్కుంటుండడం గమనార్హం. వాస్తవానికి ఇప్పుడు కర్నూలు జిల్లాలో టీడీపీకి బలమైన వర్గపోరు ఉంది. జిల్లాలో ఉన్న గ్రూపులు అన్ని ఎన్నికల తర్వాత నిస్తేజంగా ఉన్నాయి. అదే సమయంలో వైసీపీలోనూ అసమ్మతి నేతలు కనిపిస్తున్నాయి. తమకు పదవులు ఇవ్వకుండా జగన్ ఏడిపిస్తున్నారని.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నవారు ఉన్నారు. ఎమ్మెల్యేలు కూడా తమకు అధికారం లేకుండా ద్వితీయ శ్రేణి సీనియర్లు చక్రం తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాబు చెప్పినా….
ఈ క్రమంలో.. టీడీపీని బలోపేతం చేసుకునేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషించి.. భరత్ దూకుడుగా ముందుకు సాగాలని చంద్రబాబు స్వయంగా సూచించారు. అంతేకాదు, గత ఏడాది ఎన్నికలకు ముందు ఆయన కర్నూలు నియోజకవర్గంలో పాద యాత్ర చేశారు. ఈ సమయంలో ఆయన అనేక సమస్యలు తెరమీదికి తెచ్చారు. ఇప్పుడు వాటినే మరోసారి తెరమీదికితెచ్చి.. అధికార పార్టీపై ఒత్తిడి పెంచాలని కూడా బాబు చెబుతున్నారు. భరత్ మాత్రం.. పార్టీ కేడర్‌తోనూ, పార్టీ కార్యక్రమాల విషయంలోనూ అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
వైసీపీ వీక్ అవుతున్నా…..
భరత్ పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదని.. పార్టీ ఎదిగేందుకు అవకాశం ఉన్నప్పటికీ.. ఆయన వైఖరితో తీవ్రంగా నష్టపోతోందని అంటున్నారు కార్యకర్తలు. కేవలం వ్యాపార కార్యక్రమాల మీద మాత్రమే దృష్టిపెడుతూ పార్టీని నిర్వీర్యం చేస్తున్న పరిస్థితే కర్నూలులో కనిపిస్తోంది. కర్నూలు వైసీపీలో ఎమ్మెల్యే మహ్మద్ హఫీజ్‌ఖాన్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ.మోహన్‌రెడ్డి వర్గాలతో వైసీపీ వీక్‌గా ఉన్నా… దానిని కూడా భరత్ క్యాష్ చేసుకోలేని పరిస్థితి. మరి భరత్ విషయంలో చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలియాలని పార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నారు.