సెప్టంబరు నుంచి అన్నీ ఓపెన్… ఇక మీ ఖర్మ
సెప్టంబరు ఒకటో తేది నుంచి లాక్ డౌన్ ను ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇకపై దేశంలో ఎక్కడా లాక్ డౌన్ ఉండదు. ఇప్పటికే [more]
సెప్టంబరు ఒకటో తేది నుంచి లాక్ డౌన్ ను ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇకపై దేశంలో ఎక్కడా లాక్ డౌన్ ఉండదు. ఇప్పటికే [more]
సెప్టంబరు ఒకటో తేది నుంచి లాక్ డౌన్ ను ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇకపై దేశంలో ఎక్కడా లాక్ డౌన్ ఉండదు. ఇప్పటికే కరోనా వైరస్ ప్రవేశించి ఆరు నెలలు దాటింది. అయినా కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. రోజుకు 60 వేలకు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. ఇక లాక్ డౌన్ ఆంక్షలు విధించినా ఫలితం ఉండదని భావించిన కేంద్ర ప్రభుత్వం ఇక భారాన్ని పూర్తిగా ప్రజలపై నెట్టేయడానికి సిద్ధమవుతుంది.
లాక్ డౌన్ విధించినా…..
కరోనా వైరస్ చైనా నుంచి వ్యాప్తి చెందుతుందని తెలియగానే కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. మొదటి లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేసింది. విదేశాల నుంచి వచ్చిన వారికి క్షుణ్ణంగా పరీక్షలు చేయడంతో కంట్రోల్ చేయవచ్చని భావించింది. విదేశీ ప్రయాణికులతో పాటు మర్కజ్ మసీదు ప్రార్థనల నుంచి దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. ట్రేస్, టెస్ట్, ట్రీట్ మెంట్ ద్వారా కట్టడి చేయవచ్చని ప్రారంభించారు.
మూడు విడతలగా విధించి…
దేశంలో మూడు విడతలుగా లాక్ డౌన్ ను విధించారు. అయితే లాక్ డౌన్ తో ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయి. రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందులతో విలవిలలాడాయి. కేంద్ర ప్రభుత్వం సయితం దీనిపై ఆలోచించి క్రమంగా లాక్ డౌన్ ఆంక్షలను ఎత్తివేసుకుంటూ వస్తుంది. ప్రస్తుతం కొన్నింటి మినహా అన్ని రకాల కార్యక్రమాలకు దేశంలో అనుమతిచ్చారు. కానీ కరోనా వైరస్ ఏమాత్రం తగ్గడం లేదు. దీనివల్ల ప్రయోజనం లేదని భావించిన కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరు 1వ తేదీ నుంచి లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేయాలని యోచిస్తుంది.
రాష్ట్రాలదీ.. ప్రజలదే బాధ్యత…..
ఇకపై కరోనా తీవ్రతను బట్టి ఆయా రాష్ట్రాలే ఆంక్షలను అమలు చేసుకోవాలి. సెప్టంబరు 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, బార్లు, రైల్వే స్టేషన్లు పూర్తిగా తెరుచుకోనున్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడి విషయంలో పూర్తిగా చేతులెత్తేసినట్లే కనపడుతుంది. ఇక కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రజలదే అవుతుంది. రాష్ట్రాలు కూడా ఇదే పరిస్థితికి వస్తాయి. కరోనాను కూడా సాధారణ రోగంగానే పరిగణించాలనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.