సమాంతర ఉద్యమమే సమాధానమా … ?

ముల్లును ముల్లుతోనే తీయాలన్న సిద్ధాంతం రాజకీయాల్లో బాగా అమలు చేస్తారు. ఒక మంత్రి ఏదన్న మాట్లాడినా లేక విపక్షంలో ప్రధానమైన నాయకుడు విమర్శలు చేసినా అదే సామజిక [more]

Update: 2020-11-01 05:00 GMT

ముల్లును ముల్లుతోనే తీయాలన్న సిద్ధాంతం రాజకీయాల్లో బాగా అమలు చేస్తారు. ఒక మంత్రి ఏదన్న మాట్లాడినా లేక విపక్షంలో ప్రధానమైన నాయకుడు విమర్శలు చేసినా అదే సామజిక వర్గానికి చెందిన నాయకుడితో గట్టి కౌంటర్ లు ఇప్పిస్తూ ఉండటం చూస్తూనే ఉంటాం. ఇప్పడు అదే కోవలోకి రాజధాని అమరావతి లోనే ఉండాలంటూ సాగిస్తున్న ఉద్యమం విషయం లోను వైసిపి సర్కార్ అమల్లో పెట్టేసింది. అమరావతి వద్దు మూడు రాజధానులు ముద్దు అనే స్లోగన్ తో ప్రత్యామ్నాయ పోరాటం జోరుగానే మొదలు పెట్టింది. దాంతో ఒక ఉద్యమానికి టిడిపి ఊపిరి పోస్తుంటే మరో ఉద్యమాన్ని వైసిపి నడిపిస్తున్నట్లు క్లిస్టల్ క్లియర్ గా అందరికి అర్ధం అయిపొయింది.

ఏమిటి ప్రయోజనం … ?

అమరావతిలో భూములు కోల్పోయిన వారికి న్యాయం చేసేందుకు సర్కార్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా టిడిపి గట్టిగా అడ్డుకుంటుంది. ఈ నేపథ్యంలో కౌంటర్ ఉద్యమమే శరణ్యమని భావించే వైసిపి వ్యూహాత్మక ఆందోళనకు తెరతీసినట్లు కనిపిస్తుంది. ఎపి లోని అన్ని జిల్లాల ప్రజలు అమరావతి కి అండగా నిలుస్తున్నారని కలర్ ఇచ్చేందుకు ప్రధాన విపక్షం నానా పాట్లు పడుతుంది. దాంతో వైసిపి సైతం అదే స్ట్రేటజీ అమల్లో పెట్టింది.

రెండు ఉద్యమాలూ….

అమరావతి అంతా బూటకం రియల్ ఎస్టేట్ వ్యాపారమే తప్ప మరేమి కాదన్న అంశాలను అధికారపార్టీ మద్దతుతో నడుస్తున్న ఉద్యమ నేతలు పదేపదే స్పష్టం చేస్తున్నారు. తాము ప్రజల్లోకి తీసుకువెళ్లాలిసిన అంశాలను ఇదే రకంగా పంపించాలని అధికారపార్టీ ఆలోచనగా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రెండు ఉద్యమాలు పెయిడ్ అనే చర్చ మాత్రం రాష్ట్రవ్యాప్తంగా జనంలోకి వెళుతుంది. అధికార వైసిపి మాత్రం అదే కోరుకుటుంది. టీడీపీ వెనుకవుండి తన మద్దతు మీడియా తో కథ నడిపిస్తన్న వైనం అందరికళ్ళముందు పెట్టాలన్న టార్గెట్ తోనే జగన్ సర్కార్ ముందుకు వెళుతుందన్నది స్పష్టం అయిపొయింది.

Tags:    

Similar News