డిగ్రీ విద్యార్థులకు భారీ షాక్
అకడమిక్ ఏడాది ప్రకారం పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెలువడకపోతే విద్యా సంవత్సరం నాశనమే. ఇప్పుడు తెలంగాణ డిగ్రీ విద్యార్థులకు వివిధ విశ్వవిద్యాలయాల విసి ల నిర్లక్ష్యం శాపంగా [more]
అకడమిక్ ఏడాది ప్రకారం పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెలువడకపోతే విద్యా సంవత్సరం నాశనమే. ఇప్పుడు తెలంగాణ డిగ్రీ విద్యార్థులకు వివిధ విశ్వవిద్యాలయాల విసి ల నిర్లక్ష్యం శాపంగా [more]
అకడమిక్ ఏడాది ప్రకారం పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెలువడకపోతే విద్యా సంవత్సరం నాశనమే. ఇప్పుడు తెలంగాణ డిగ్రీ విద్యార్థులకు వివిధ విశ్వవిద్యాలయాల విసి ల నిర్లక్ష్యం శాపంగా పరిణమించింది. ఈ నెల 7 వతేది వరకు పరీక్షలు నిర్వహిస్తూ ఫలితాలు ఆలస్యం చేయడంతో సెంట్రల్ యూనివర్సిటీల్లో అవకాశాన్ని వందలాదిమంది విద్యార్థులు కోల్పోయారు. ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంక్ లు పొందినా డిగ్రీ ఫలితాల ఆలస్యంతో ఇప్పుడు వారంతా లబోదిబో మంటున్నారు. ఈ అంశంపై తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని ఇప్పుడు విద్యార్థులు వేడుకుంటున్నారు.
ఇంటర్ లోను ఇలాగే …
తెలంగాణ లో మొన్నటి ఇంటర్ ఫలితాలు విద్యార్థులకు చేదు అనుభవాలనే మిగిల్చాయి. అనేకమంది మార్క్ లు తారుమారు అయ్యి చివరికి న్యాయస్థానాలవరకు అంతా వెళ్ళి పోరాడాలిసివచ్చింది. ఆ వివాదంపై విచారణ జరిపినప్పటికీ ఇంటర్ ఫలితాల వివాదం ఇప్పటికి కొలిక్కి రాలేదు. తాజాగా ఇప్పుడు డిగ్రీ విద్యార్థులకు మరో విధమైన సమస్య రావడంతో ఉన్నత విద్యాశాఖ నేరపూరిత నిర్లక్ష్యం మరోసారి బయట పడింది. తెలంగాణ విద్యా శాఖా మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇప్పటికైనా తెలంగాణా విద్యా వ్యవస్థ ను నిద్రావస్థనుంచి బయటపడేందుకు దృష్టి పెట్టాలని విద్యార్థులు, తల్లితండ్రులు కోరుకుంటున్నారు. డిగ్రీ నుంచి పిజి కి వెళ్లేందుకు మరికొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని భావిస్తున్నారు. వచ్చే ఏడాది విద్యార్థులకు అయినా సక్రమం గా ఎకాడమిక్ ఇయర్ ప్రకారం పరీక్షలు నిర్వహించడం, ఫలితాలు ప్రకటించడం చేపట్టాలని కోరుకుంటున్నారు.