రెడ్లకు ఇక దిక్కు మొక్కూ అదేనా…?
కాంగ్రెస్ లో రెడ్లదే రాజ్యం. అలా ఉమ్మడి ఏపీలో మూడు దశాబ్దాల పాటు వారు ఎదురులేని విధంగా అధికారాన్ని చలాయించారు. ఇక తెలుగుదేశం పార్టీ వచ్చాక కూడా [more]
కాంగ్రెస్ లో రెడ్లదే రాజ్యం. అలా ఉమ్మడి ఏపీలో మూడు దశాబ్దాల పాటు వారు ఎదురులేని విధంగా అధికారాన్ని చలాయించారు. ఇక తెలుగుదేశం పార్టీ వచ్చాక కూడా [more]
కాంగ్రెస్ లో రెడ్లదే రాజ్యం. అలా ఉమ్మడి ఏపీలో మూడు దశాబ్దాల పాటు వారు ఎదురులేని విధంగా అధికారాన్ని చలాయించారు. ఇక తెలుగుదేశం పార్టీ వచ్చాక కూడా అధికార మార్పిడి ద్వారా తడవకోసారి గెలిచి రాజకీయ దర్జా చెక్కుచెదరకుండా చూసుకునేవారు. అటువంటి రెడ్లకు ఇపుడు కాలం కలసిరావడంలేదు. తెలంగాణాలో చూసుకుంటే ఆరేళ్ళుగా కేసీఆర్ జమానా నడుస్తోంది. మరో టెర్మ్ కూడా ఆయనే వచ్చేలాగా అంతా సిధ్ధం చేసుకుంటున్నారు. ఏపీలో చూస్తే జగన్ వెంటపడిన రెడ్లకు పదేళ్ళుగా అధికార వైభోగం అందని పండుగా ఉంది.
తెప్ప తగలేశారా…?
ఏరు దాటి తెప్ప తగలేయడం అంటారు. రాజకీయ నాయకులకు ఇది చక్కగా వర్తిస్తుంది. జగన్ మాట తప్పను, మడమ తిప్పను అని ఎంత చెప్పినా ఆయన కూడా ఫక్త్ పొలిటీషియనే. అందుకే రెడ్ల సహకారంతో అధికారంలోకి వచ్చిన జగన్ ఇపుడు బీసీల బంధువుగా, దళితులకు దేవుడిగా అవతరించాలనుకుంటున్నారు. జగన్ వైసీపీకి కొత్త సామాజిక పునాదిని నిర్మించే పనిలో బిజీగా ఉన్నారు. ఆయనకు ఇపుడు రెడ్లు రాజకీయంగా, సామాజికంగా కూడా అంత అవసరం అనిపించడంలేదులా ఉంది. దాంతోనే వైసీపీలో రెడ్లు నలిగిపోతున్నారు. రగిలిపోతున్నారు.
రెండు శాతమా…?
వైఎస్సార్ ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నపుడు మెజారిటీ మంత్రులు రెడ్లే ఉండేవారు. అంతే కాదు అనేక కార్పోరేషన్లకు వారినే చైర్మన్లుగా వైఎస్సార్ చేశారు. విశాఖలో చూసుకుంటే ఇద్దరు రెడ్లకు నాడు ఒకేసారి నామినేటెడ్ పదవులు దక్కాయి. మరి జగన్ మాత్రం రెడ్లను మంత్రులుగా చేయలేదు, నామినేటెడ్ పదవులకూ బీసీలు, ఎస్సీలు అంటున్నాడు. వైసీపీ భవిష్యత్తు కోసం జగన్ ఇదంతా చేస్తున్నా తమ కష్టాన్ని, కరెన్సీని వైసీపీ ఎదుగుదల కోసం ధారపోసిన రెడ్లు మాత్రం ఇది సహించలేకుండా ఉన్నారట. కేవలం నలుగురికి మాత్రమే మంత్రి పదవులు జగన్ ఇచ్చి రెండు శాతానికి వారికి ఫిక్స్ చేసేశారు.
కాంగ్రెస్ వైపు….
వినడానికి వింతగా ఉన్నా రాజకీయాల్లో అసాధ్యం అని చెప్పలేరు దేన్నీ కూడా. రెడ్ల గురించి తీసుకుంటే కాంగ్రెస్ ఉండగా మహారాజులుగా బతికారు, వారికి ప్రాంతీయ పార్టీలలో ఇమడడం తెలియదు, ఏక నాయకత్వం వద్ద నోరు మూసుకుని సైలెంట్ గా ఉండడం అంతకంటే తెలియదు. దానికి అచ్చమైన ఉదాహరణ మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. ఇలాంటి వారు వైసీపీలో చాలా మంది ఉన్నారు. ఇక రెడ్డి ఎమ్మెల్యేలే వైసీపీలో యాభైకి పైగా ఉన్నారు. బలమైన నాయకులు, వివిధ జిల్లాలను శాసించే వారు లెక్కకడితే వందల్లో ఉంటారు. వీరు బీజేపీకి వెళ్లలేరు, టీడీపీ పరిస్థితి బాగాలేదు. అందుకే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవాలని చూస్తున్నారుట. కాంగ్రెస్ కనుక ఢిల్లీలో ప్రాభవం సంపాదిస్తే ఆ ప్రభావం ఏపీ మీద ఉంటుందని అంచనా కడుతున్నారు. మొత్తానికి వైసీపీలోని రెడ్ల చూపు మాత్రం తమ మాతృ సంస్థ మీద ఉంది. ఇప్పటికిపుడు కాదు కానీ ఎపుడైనా కాంగ్రెస్ బలపడితే మాత్రం వారు అందులోకి జంప్ చేయడం ఖాయమనే ప్రచారం అయితే గట్టిగానే ఉంది. మరి జగన్ ఈ పరిణామాలు గమనించి సరైన చర్యలు తీసుకోవాలి.