క‌మ్మ వ‌ర్గం సైలెంట్ వెనుక‌.. ఏం జ‌రుగుతోంది ?

ఏపీ రాజ‌కీయాల్లో క‌మ్మ సామాజిక వ‌ర్గం పాత్ర చాలానే ఉంది. ఆ మాట‌కు వ‌స్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు నుంచే అనేక రంగాల్లో ముందున్న ఈ [more]

Update: 2021-04-27 12:30 GMT

ఏపీ రాజ‌కీయాల్లో క‌మ్మ సామాజిక వ‌ర్గం పాత్ర చాలానే ఉంది. ఆ మాట‌కు వ‌స్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు నుంచే అనేక రంగాల్లో ముందున్న ఈ వ‌ర్గం ఆ త‌ర్వాత రాజ‌కీయంగా కూడా తెలుగు నేల‌పై అన్ని ప్రాంతాల‌కు విస్తరించింది. పైగా విదేశాల్లో స్థిర‌ప‌డిన క‌మ్మ సామాజిక వ‌ర్గం ఏపీలో పెట్టుబ‌డులు పెట్టడంలోను, ఇక్కడి రాజ‌కీయాల‌ను శాసించ‌డంలోను కూడా ముందుంది. చంద్రబాబు హ‌యాంలో రాజ‌ధాని అమ‌రావ‌తికి జైకొట్టిన ఎన్నారైలు.. ఇక్కడ పెట్టుబ‌డులు కూడా పెట్టారు. అదే స‌మ‌యంలో అమ‌రావ‌తి ఉద్యమం నేప‌థ్యంలో వారు సైతం.. ప్రధాన పాత్ర పోషించారు. రాజ‌ధానిగా అమ‌రావ‌తే ఉండాలంటూ.. వారు కోరుకున్నారు. ఇక్కడి రైతుల‌కు సైతం అండ‌గా ఉన్నారు.

ఆరేడు నెలలుగా….

ఇక‌, ఆరేడు మాసాలుగా పూర్తిగా క‌మ్మ సామాజిక వ‌ర్గం సైలెంట్ అయింది. ముఖ్యంగా ఎన్నారై లుగా ఉన్న క‌మ్మ వ‌ర్గం ఇప్పుడు ఎక్కడా ఏపీ గురించి పెద్దగా ప‌ట్టించుకోవడం లేదు. దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? అంటే.. తాము క‌నుక వేలు పెడితే.. జ‌గ‌న్ ప్రభుత్వం మ‌రింత‌గా క‌మ్మల‌పై దాడి చేస్తుంద‌ని.. వారిని రాజ‌కీయంగా కూడా ఇబ్బంది పెట్టే ప్రయ‌త్నం చేస్తుంద‌ని.. సో.. ఇప్పుడు సైలెంట్ అయిపోయి.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి దూకుడుగా ముందుకు సాగాల‌ని నిర్ణయించుకున్నట్టు స‌మాచారం. అదే స‌మ‌యంలో చంద్రబాబు హ‌యాం మ‌ళ్లీ వ‌స్తేనే త‌ప్ప.. రాష్ట్రం అభివృద్ది అయ్యే ప‌రిస్థితి లేద‌నే విష‌యాన్ని బ‌లంగా తీసుకువెళ్లాలంటే.. ఇప్పుడు కొన్నాళ్లు సైలెంట్ అవ్వాల్సిన అస‌వ‌రం ఉంద‌ని వారు భావిస్తున్నట్టు స‌మాచారం.

పెట్టుబడులకు దూరంగా…..

గ‌తంలో చంద్రబాబు పాల‌న‌ను తీసుకుంటే.. ఏపీలోకానీ, ఉమ్మడి రాష్ట్రంలో కానీ.. ఎన్నారై ల‌కు చెందిన క‌మ్మ వ‌ర్గం వారి పెట్టుబ‌డులు, వ్యాపారాలు ఎక్కువ‌. రాష్ట్ర అభివృద్ధిలో వారిదే కీల‌క పాత్ర అనే విధంగా ఉంది. కానీ, ఇప్పుడు వారు ప‌ట్టించుకోవ‌డం లేదు. ఎక్కడా పెట్టుబ‌డులు పెట్టడం లేదు. పైగా.. స్వచ్ఛంద సేవ‌లు కూడా చేయ‌డం లేదు. ఇలా దూరంగా ఉండ‌డం వ‌ల్ల.. రాష్ట్రం అన్ని రంగాల్లోనూ వెనుక‌బ‌డ‌డం ఖాయ‌మ‌ని.. త‌ద్వారా. ఎన్నిక‌ల నాటికి దీనిని చూపించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని కమ్మ సామాజికవర్గం భావిస్తున్నట్టు ప్రచారం జ‌రుగుతోంది.

ఎన్నికల సమయానికి….

ఇక‌, ఎన్నిక‌ల స‌మ‌యానికి.. మ‌ళ్లీ.. 2014లో అనుస‌రించిన సోష‌ల్ మీడియా ప్రచార వ్యూహాన్ని అమ‌లు చేయ‌డం ద్వారా.. తిరిగి చంద్రబాబును గ‌ద్దెనెక్కించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని కమ్మలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జ‌రుగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఎన్నిక‌ల్లోనూ టీడీపీ అనుబంధ ఎన్నారై సంఘాలు కూడా ఇదే ఫార్ములాను పాటిస్తున్నాయి. చంద్రబాబు అనుకూల వ‌ర్గాలు .. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఏపీలో బాబును తిరిగి అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు వ్యూహం సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఈ క్రమంలోనే ఎన్నారైలు.. దూరంగా ఉన్నార‌ని.. ప్రచారం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇక్కడ మ‌రో చిత్రమైన విష‌యం ఏంటంటే.. చంద్రబాబు ఎప్పుడూ.. ఎన్నారైల గురించి మాట్లాడేవారు.కానీ, ఇప్పుడు వారి గురించి ఆయ‌న కూడా సైలెంట్‌గా ఉన్నారు. దీనిని బ‌ట్టి.. ఈ సైలెంట్ వెనుక వ్యూహం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News