జగన్ దే తప్పంటారా….?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులు అందించే పథకం నుంచి ప్రపంచ బ్యాంకు తప్పుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా అమరావతి అభివృద్ధి ప్రణాళిక [more]

Update: 2019-07-19 11:00 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులు అందించే పథకం నుంచి ప్రపంచ బ్యాంకు తప్పుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా అమరావతి అభివృద్ధి ప్రణాళిక పథకాన్ని రూపొందించారు. దీని కింద రుణం ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం ప్రపంచ బ్యాంకును కోరింది. ఇందుకు ప్రపంచ బ్యాంకు అంగీకరించింది. ఏపీ ప్రభుత్వం 715 డాలర్లతో అమరావతి అభివృద్ధి ప్రణాళికను రూపొందించింది. ప్రపంచ బ్యాంకు మాత్రం తాము రుణసాయం అందించలేమంటూ తప్పుకోవడంతో ఇప్పుడు ఏపీలో ఇది హాట్ టాపిక్ గా మారింది.

వైసీపీ కారణమంటున్న….

ప్రపంచ బ్యాంకు ఈ పథకం నుంచి తప్పుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణమని చంద్రబాబునాయుడు ఆరోపిస్తున్నారు. కొందరు రైతుల చేత ప్రపంచ బ్యాంకుకు తప్పుడు ఫిర్యాదులు చేయించినందునే ప్రపంచ బ్యాంకు తప్పుకుందన్నది చంద్రబాబు నాయుడు ఆరోపణ. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి రాజధాని అమరావతిపై ఇష్టంగా ఉండకపోవడమే ఇందుకు కారణమంటున్నారు. దీనివల్ల అభివృద్ధి ఆగిపోతుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జగన్ ఆలోచన వేరుగా….

నిజానికి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని అమరావతి విషయంలో క్లారిటీ ఇచ్చారు. అమరావతి రాజధానిగా ఉంటుందని, అయితే గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికను అమలు చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అమరావతి నిర్మాణానికి గత ప్రభుత్వం రైతుల నుంచి తీసుకున్న యాభై వేల ఎకరాలు అవసరం లేదన్నది జగన్ వాదన. ఉన్నంతలో రాజధానిని నిర్మించుకుని పరిపాలన సాగించవచ్చని జగన్ భావిస్తున్నారు. జగన్ నిర్ణయంతో అమరావతిలో భూముల ధరలు పడిపోయాయన్న వాదనను కూడా తెలుగుదేశం పార్టీ లేవనెత్తుతోంది.

మిగిలిన ప్రాజెక్టులకూ….

ఇక తాజాగా ప్రపంచబ్యాంకు అమరావతి అభివృద్ధి పథకం నుంచి తప్పుకోవడం జగన్ ప్రభుత్వానికి కొంత ఇబ్బందే. అసలే ఆర్థిక సమస్యలతో కొట్టు మిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ కు ఇది ఊహించని ఎదురుదెబ్బే. వివిధ పథకాలు, ప్రాజెక్టులకు రుణాలు కావాలన్నా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ప్రపంచబ్యాంకు తప్పుకోవడానికి చంద్రబాబునాయుడే కారణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కుదురుకుంటున్న సమయంలో ఊహించని దెబ్బలు తగులుతున్నాయి.

Tags:    

Similar News