వాళ్ల ఫ్యూచరేంటో.. వాళ్లకే అర్థం కావడం లేదట
ఎమ్మెల్యేలుగా గెలిచారు. ప్రజలు తమపై అభిమానం చూపారు. కానీ ప్రజలు ఎన్నుకున్న పార్టీని కాదని వేరే పార్టీలోకి జంప్ చేశారు. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. ఇది వైసీపీ [more]
ఎమ్మెల్యేలుగా గెలిచారు. ప్రజలు తమపై అభిమానం చూపారు. కానీ ప్రజలు ఎన్నుకున్న పార్టీని కాదని వేరే పార్టీలోకి జంప్ చేశారు. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. ఇది వైసీపీ [more]
ఎమ్మెల్యేలుగా గెలిచారు. ప్రజలు తమపై అభిమానం చూపారు. కానీ ప్రజలు ఎన్నుకున్న పార్టీని కాదని వేరే పార్టీలోకి జంప్ చేశారు. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. ఇది వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన నేతల పరిస్థితి. 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన తర్వాత చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ కు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జంప్ అయిన సంగతి తెలిసిందే. వారిలో 2019 ఎన్నికల్లో కొందరికి మాత్రమే చంద్రబాబు టిక్కెట్లు ఇచ్చారు.
ఒక్క గొట్టిపాటి తప్ప….
వారిలో అద్దంకి నియోజకవర్గం నుంచి ఒక్క గొట్టిపాటి రవికుమార్ మాత్రమే ఎన్నికయ్యారు. అద్దంకి పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ పార్టీలకన్నా వ్యక్తిగత ప్రాబల్యమే ఎక్కువగా ఉండటంతో గొట్టిపాటి విజయం సాధ్యమయింది. మిగిలిన చోట్ల అందరూ ఓటమి పాలయ్యారు. ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన వారికి టీడీపీలో పెద్దగా ప్రయారిటీ కూడా లేదు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ వస్తుందన్న ఆశ కూడా లేదు.
చేరాలనుకున్నా……
దీంతో వారంతా తిరిగి వైసీపీ గూటికి చేరుకోవాలని ప్రయత్నిస్తన్నారు. ఇప్పటికే కొందరు ఆ ప్రయత్నాలు ఉన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన పాలపర్తి డేవిడ్ రాజు వైసీపీలో చేరారు. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి వైసీపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మిగిలిన వారు కూడా వైసీపీలోకి వచ్చేందుకు సీనియర్ నేతలతో సంప్రదింపులు జరపుతున్నారు. వైసీపీ ఇప్పుడిప్పుడే వీరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం లేదు.
ఎన్నికలకు ముందు మాత్రమే…..
ఎన్నికలకు ముందు మాత్రమే వీరిని పార్టీలో చేర్చుకునే అవకాశాలున్నాయంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో విభేదాలు ఎక్కువగా ఉండటంతో వీరి చేరికకు జగన్ అంగీకరించడం లేదని తెలుస్తోంది. ఎన్నికలకు ముందు చేర్చుకుందామని చెప్పినట్లు తెలిసింది. అయితే వీరు ఎన్నికలకు ముందు వైసీపీలో చేరినా వారికి టిక్కెట్ మాత్రం ఇవ్వరట. ఆ కండిషన్ తోనే చేరాలంటున్నారు. దీంతో దాదాపు పదేళ్ల పాటు వీరు ఒక జంప్ తో రాజకీయ భవిష‌్యత్ ను కోల్పోయినట్లయింది. మరి వీరి ఫ్యూచర్ తర్వాతైనా బాగుంటుందో ? లేదో? చూడాలి.