ఆ ఇద్దరూ మంత్రులు ఎక్కడ‌? హోం క్వారంటైన్ అయ్యారా?

రాష్ట్రంలో సీఎం జ‌గ‌న్‌తో క‌లిపి మొత్తం పాతిక మంది మంత్రులు ఉన్నారు. అయితే వీరిలో ఎంత‌మంది యాక్టివ్‌గా ఉన్నారు? ఎంత మంది సొంత ప‌నులు చేసుకుంటున్నారు ? [more]

Update: 2020-04-17 08:00 GMT

రాష్ట్రంలో సీఎం జ‌గ‌న్‌తో క‌లిపి మొత్తం పాతిక మంది మంత్రులు ఉన్నారు. అయితే వీరిలో ఎంత‌మంది యాక్టివ్‌గా ఉన్నారు? ఎంత మంది సొంత ప‌నులు చేసుకుంటున్నారు ? అనే చ‌ర్చ వ‌చ్చిన‌ప్పుడు చాలా మంది అని చెప్పాల్సి ఉంటుంది. ఒక ప‌క్క సీఎం జ‌గ‌న్ మంత్రుల‌ను ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాల‌ని ఆదేశిస్తు న్నా.. ఆయ‌న మాట‌ల‌ను ఇలా విని.. అలా స‌రిపెడుతున్నారు. దీంతో మంత్రుల విష‌యం ఎప్పటికప్పు డు చ‌ర్చకు వ‌స్తోంది. తాజాగా రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి దుమ్ము రేపుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో నాలుగు వంద‌ల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో లాక్‌డౌన్ విధించారు.

ముఖ్యమంత్రి ఆదేశించినా…..

ఈ నేప‌థ్యంలో ప్రజ‌లు ఇళ్లకే ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో వారికి క‌ష్టాలు పెరిగిపోయాయి. ఈ ప‌రిస్థితిని గ‌మ‌నించిన సీఎం జ‌గ‌న్.. మంత్రులంద‌రూ కూడా ప్రజ‌ల మ‌ధ్య ఉండాల‌ని, వారికి అవ‌స‌ర‌మైన అన్ని స‌దుపాయాల‌ను క‌ల్పించాల‌ని ఆదేశించారు. చాలా మంది మంత్రులు జ‌గ‌న్ ఎంత సీరియ‌స్‌గా చెపుతున్నా బ‌య‌ట‌కు రావ‌డం లేదు. మ‌రి కొంద‌రు తూతూ మంత్రంగా బ‌య‌ట‌కు వ‌చ్చి మీడియాకు ఫోజులు ఇచ్చేసి వెళ్లిపోతున్నారు. ఇక‌, మిగిలిన మంత్రుల మాటేమోకానీ.. ఇద్దరు మంత్రుల విష‌యం మాత్రం ఆస‌క్తిక‌రంగా మారింది. వారిద్దరూ లాక్‌డౌన్ నాటి నుంచి ఇప్పటి వ‌ర‌కు ఎక్కడా క‌నిపించడం లేదు.

సెల్ఫ్ క్వారంటైన్ అంటూ….

మిగిలిన‌వారు ఒక‌ప్పుడు కాక‌పోతే.. ఒక‌ప్పుడు అయినా.. మీడియా ముందుకో.. లేదా ఏదైనా కార్యక్రమంలోనో క‌నిపిస్తున్నారు. కానీ, ఆ ఇద్దరు మాత్రం అస్సలు నియోజ‌క‌వ‌ర్గంలోను, స‌చివాల‌యం లోనూ కూడా క‌నిపించ‌డం లేదు. ఆ ఇద్దరు అమాత్యులే.. ఒక‌రు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన శ్రీరంగ‌నాథ‌రాజు. మ‌రొక‌రు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధ‌ర్మాన కృష్ణదాస్‌. ఈ ఇద్దరూ ప్రజ‌ల మ‌ధ్య క‌నిపించ‌డంలేదు. పోనీ.. ఇంటి నుంచైనా వారు ప్రజ‌ల‌కు అందించాల్సిన సాయం చేయొచ్చుక‌దా? అంటే.. అది కూడా చేయ‌డం లేదు. దీంతో వారిపై సోష‌ల్ మీడియాలో భారీ ఎత్తున సెటైర్లు పేలుతున్నాయి. వారిద్దరూకూడా సెల్ఫ్ క్వారంటైన్ అయ్యారంటూ కామెంట్లు కురుస్తున్నాయి.

కీలక సమయంలో….

అంతేకాదు. ఇద్దరూకూడా వృద్ధులే కావ‌డంతో ఈ చ‌ర్చ ఆదిశ‌గా కూడా సాగుతోంది. ప్రజ‌ల‌కు క‌రోనా వ‌చ్చినా ఫ‌ర్వాలేదు.. త‌మ‌కు మాత్రం సేఫ్ గా ఉంటే చాల‌ని వీరిద్దరూ భావిస్తున్నట్టుగా ఉంద‌ని అంటున్నారు. నిజానికి శ్రీకాకుళంలో క‌రోనా ల‌క్షణాలు లేవు. అయినా కూడా కృష్ణదాస్ అంత సీరియ‌స్‌గా స్పందించ‌డం లేదు. ఇక‌ రంగ‌నాథ‌రాజు కూడా మౌనం పాటించారు. ఇదే జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని ఎప్పటిక‌ప్పుడు స‌మీక్షలు పెడుతున్నారు. ఇక మ‌రో మంత్రి తానేటి వ‌నిత సైతం అప్పుడ‌ప్పుడు అయినా బ‌య‌ట‌కు వస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి కీల‌క స‌మయంలో ఈ ఇద్దరు మంత్రులు ఇలా వ్యవ‌హ‌రించ‌డం, ప్రజ‌ల‌కు దూరం కావ‌డంపై ఈ రెండు జిల్లాల్లోనూ తీవ్ర చ‌ర్చనీయాంశంగా మారిపోయింది.

Tags:    

Similar News