రెబల్స్ పెరుగుతున్నారా? వారిపై ఇంటలిజెన్స్ నిఘా?
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు దాటుతోంది. అయితే ఇప్పటి వరకూ సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి పనులు ఏమీ జరగలేదు. మరోవైపు ఇటు పార్టీలోనూ, [more]
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు దాటుతోంది. అయితే ఇప్పటి వరకూ సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి పనులు ఏమీ జరగలేదు. మరోవైపు ఇటు పార్టీలోనూ, [more]
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు దాటుతోంది. అయితే ఇప్పటి వరకూ సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి పనులు ఏమీ జరగలేదు. మరోవైపు ఇటు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ వారికి ప్రయారిటీ లేకుండా పోయింది. దీంతో కొందరు పార్లమెంటు సభ్యులు బీజేపీ వైపు చూస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో జగన్ ప్రభుత్వం తమకు అనుమానమున్న ఎంపీలపై ఇంటలిజెన్స్ నిఘా పెట్టినట్లు సమాచారం.
22 మంది ఎంపీలు గెలిచినా…..
గత పార్లమెంటు ఎన్నికల్లో 22 మంది ఎంపీలు గెలిచారు. పార్లమెంటు, రాజ్యసభలో వైసీపీ బలంగా ఉండటంతో బీజేపీ కూడా వారికి ప్రయారిటీ ఇస్తుంది. మరోవైపు ఎంపీలకు రాష్ట్రంలో విలువ లేకుండా పోయింది. ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. పార్టీ అధినాయకత్వం సయితం వీరిని లైట్ గా తీసుకుంది. ఏ కార్యక్రమంలోనూ పార్లమెంటు సభ్యులను ఇన్ వాల్వ్ చేయడం లేదు. దీంతో కొంత మంది పార్లమెంటు సభ్యులు అసహనంతో ఉన్నారని సమాచారం.
ఇంతటి అవమానాలా?
వీరిలో గతంలో పార్లమెంటు సభ్యులుగా పనిచేసిన వారున్నారు. తాము గతంలో ఏ పార్టీలో ఉండి పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినా ఇంతటి అవమానాలు ఎదుర్కొనలేదని కొందరు పార్లమెంటు సభ్యులు బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఐదు మంది ఎంపీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. జగన్ అపాయింట్ మెంట్ అడిగినా వారికి లభించకపోవడంతో వారు ఢిల్లీలోని బీజేపీ నేతలకు చేరువవుతున్నారన్న టాక్ పార్టీలో నడుస్తుంది. కొందరు బీజేపీ పెద్దలతో ఇటీవల సమావేశమయ్యారని తెలుస్తోంది.
కొందరి పెత్తనమే….
పార్టీలో కొందరి పెత్తనమే సాగుతుండటం, తమను పట్టించుకోకపోవడం, చివరకు తమ వ్యాపారాలను కూడా తమ పార్టీయే దెబ్బతీస్తుండటంతో వారు అసహనంతో ఉన్నారు. దీంతో ఢిల్లీలో వీరి కదలికపై ఇంటలిజన్స్ నిఘా జగన్ ప్రభుత్వం పెట్టందంటున్నారు. ఇప్పటికే నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు రెబల్ ఎంపీగా మారారు. ఆయనపై ఇంతవరకూ చర్యలు తీసుకోలేదు. ఇది కూడా అసంతృప్తితో ఉన్న ఎంపీలకు కొంత ధైర్య మిచ్చిందం టున్నారు. ఎంపీలతో జగన్ సమావేశమై వారి సమస్యలను వింటే మేలని పలువురు సీనియర్ నేతలు సూచిస్తున్నారు.