కిమ్ కరోనా కట్టడి చేశారా? వారిని కాల్చి చంపారా?

చైనా పక్కనే ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఇది ఆశ్చర్యం కల్గించే విషయం. ఇది అబద్ధమా? నిజమా? అన్నది తేలాల్సి ఉన్నా [more]

Update: 2020-04-15 18:29 GMT

చైనా పక్కనే ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఇది ఆశ్చర్యం కల్గించే విషయం. ఇది అబద్ధమా? నిజమా? అన్నది తేలాల్సి ఉన్నా ప్రపంచం మొత్తం ఉత్తర కొరియా వైపు చూస్తుంది. ప్రపంచంలోని అన్ని దేశాలూ కరోనా తో విలవిలలాడుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా కూడా కరోనా ధాటికి తట్టుకోలేకపోతుంది. స్పెయిన్, ఇటలీ, జర్మనీలాంటి దేశాలు సయితం కరోనాతో విలవిలలాడుతున్నాయి. కాని కిమ్ జోంగ్ ఉన్ మాత్రం కిమ్మనడం లేదు.

ప్రపంచం మొత్తం……

అనేక దేశాలు ఇప్పటికే లాక్ డౌన్ లు ప్రకటించాయి. కొన్ని ప్రాంతాలను షట్ డౌన్ చేశాయి. చైనా నుంచి వచ్చిన వైరస్ తో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మృతుల సంఖ్య 90వేలు దాటింది. అమెరికాలో ఎక్కువగా ఈ ప్రభావం కన్పించింది. ఇటలీ, స్పెయిన్ లు కూడా భారీగా కరోనా వైరస్ తో నష్టపోయాయి. కానీ ఉత్తర కొరియాలో మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తుంది.

ఈ సమయంలోనూ క్షిపణి ప్రయోగాలు…

కరోనా సమయంలోనూ క్షిపణులు ప్రయోగించిన చరిత్ర కిమ్ జోంగ్ ఉన్ ది. ఈ సమయంలో 9 మిస్సైల్స్ వదిలేశారు. కరోనా నుంచి ప్రపంచం దృష్టి మరలించేందుకే కిమ్ క్షిపణి ప్రయోగాలు జరిపారన్న సందేహాలు కూడా ఉన్నాయి. జనవరి నుంచే తమ దేశంలో కఠినమైన ఆంక్షలు విధించామని ఆ దేశం చెబుతోంది. ఇతర దేశాల నుంచి తమ దేశానికి జనవరి నుంచి ఎవరినీ అనుమతించలేదంటున్నారు. అంతేకాకుండా తమ దేశం నుంచి బయటకు ఎవరినీ పంపలేదని చెప్పింది. నియంత కిమ్ ఆంక్షలను ఎవరూ థిక్కరించకపోవడంతోనే ఒక్క కేసు కూడా నమోదు కాలేదంటున్నారు.

వైద్యంలో వెనకబడి ఉన్నా….

నిజానికి ఉత్తర కొరియాలో విద్య,, వైద్య రంగాల్లో వెనుకబడి ఉంది. మరోవైపు దక్షిణ కొరియాలో కూడా కరోనా విరుచుకుపడుతుంది. కానీ ఉత్తర కొరియాలో మాత్రం ఒక్క కేసు కూడా కాలేదంటున్నారు. అయితే కరోనా పాజిటివ్ గా తేలిన వారిని కిమ్ జోన్ నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేసి ఉండవచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అనుమానాలు కాదు నిజమేనంటుంది అంతర్జాతీయ మీడియా. మొత్తం మీద ఉత్తర కొరియాలో కరోనా లేదనటం ఉత్తదేనా? నిజంగానే కిమ్ కరోనాను కట్టడి చేశారా? అన్నది అంతర్జాతీయ సమాజంలో చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News