వైసీపీ కన్నా టీడీపీనే బెటర్ అట.. ఎందులోనో తెలుసా ?
ప్రస్తుతం ఓ విషయం ఏపీ అధికార, ప్రతిపక్షాల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం రెండు పార్టీల్లోనూ పురుష నాయకులు యాక్టివ్‌గానే ఉన్నారు. ఒకరిపై ఒకరు.. విమర్శలు [more]
ప్రస్తుతం ఓ విషయం ఏపీ అధికార, ప్రతిపక్షాల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం రెండు పార్టీల్లోనూ పురుష నాయకులు యాక్టివ్‌గానే ఉన్నారు. ఒకరిపై ఒకరు.. విమర్శలు [more]
ప్రస్తుతం ఓ విషయం ఏపీ అధికార, ప్రతిపక్షాల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం రెండు పార్టీల్లోనూ పురుష నాయకులు యాక్టివ్‌గానే ఉన్నారు. ఒకరిపై ఒకరు.. విమర్శలు చేసుకుంటున్నారు. సవాళ్లు రువ్వు కుంటున్నారు. అయితే.. ఇంత జరుగుతున్నా.. ఒక్కలోపం మాత్రం రెండు పార్టీల్లోనూ కనిపిస్తోంది. అదేంటంటే.. మహిళా నాయకులు లేకపోవడం. ఈ కోణంలో చూసుకుంటే.. అధికార వైసీపీ కంటే.. టీడీపీ కొంచెం బెటర్ అంటున్నారు పరిశీలకులు. టీడీపీ మహిళానాయకురాళ్లు, 'తెలుగు మహిళ' అనే వింగ్ కూడా ఉంది.
వైసీపీలో వాయిస్….
కానీ, వైసీపీని తీసుకుంటే.. ప్రత్యేకంగా వైసీపికి మహిళా వింగ్ అనే మాటలేదు. కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు.. మంత్రులు కూడా మహిళలు ఉన్నారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో.. మహిళలకు కూడా పెద్ద ఎత్తున పదవులు ఇచ్చారు. మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నామని కూడా చెబుతున్నారు. కానీ, ఎవరూ కూడా వాయిస్ వినిపించడం లేదు. ఒక్క నగరి ఎమ్మెల్యే రోజా మాత్రం ఒకింత దూకుడుగా ఉన్నారు. మిగిలిన వారిలో ఎవరూ కూడా పెద్దగా వాయిస్ వినిపించడం లేదు. మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్నా.. ఆదిశగా ఎవరూ కూడా వాయిస్ విప్పడం లేదు.
టీడీపీలో గట్టి నేతలు…..
విడదల రజనీ లాంటి వాళ్లను వైసీపీ ఫైర్ బ్రాండ్లుగా చెప్పుకుంటున్నా వారంతా సోషల్ మీడియా టైగర్స్‌గా మిగిలిపోతున్నారన్న చర్చలు కూడా ఉన్నాయి. అంతేకాని తమ వాయిస్‌తో రాష్ట్ర స్థాయిలో ప్రభావం చూపడంతో పాటు జగన్‌కు, పార్టీకి ప్లస్ అయ్యే వారు కనపడడం లేదు. ఇక, టీడీపీ విషయానికి వస్తే.. ఒకప్పుడు.. నన్నపనేని రాజకుమారి, పంచుమర్తి అనురాధ, గల్లా అరుణ కుమారి.. వంటి కీలక నాయకులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవారు.ఇక, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు.. వంగలపూడి అనిత కూడా వాయిస్ గట్టిగానే వినిపించేవారు.
డమ్మీలుగానే…?
కానీ, ఇప్పుడు కొన్ని నెలలుగా ఎవరూ ముందుకు రావడం లేదు. నాయకులు, నాయకురాళ్లు ఉండడం వేరు.. పార్టీ పరంగా వైసీపీ వాయిస్ వినిపించడం వేరని అంటున్నారు పరిశీలకులు. ఈ రెండు పార్టీల్లోనూ మహిళలకు ప్రాధాన్యం ఉందని చెబుతున్నా.. ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడంతో.. ఎవరూ బయటకు రాకపోవడం.. ఉన్న వారు కూడా డమ్మీలుగా మారుతున్నారనే విషయంలో రెండు పార్టీల్లోనూ చర్చనీయాంశంగా మారడం గమనార్హం.