ఏపీలో కమ్మవారికి ఇక శాశ్వతంగా కష్టమేనా?
ఉమ్మడి ఏపీలో అతి ప్రధాన సామాజికవర్గంగా కమ్మ వారు ఉన్నారన్నది అందరికీ తెలిసిందే. వారు అన్ని రంగాల్లోనూ విస్తరించి ఉన్నారు. ఓ విధంగా చెప్పాలంటే వారు లేని [more]
ఉమ్మడి ఏపీలో అతి ప్రధాన సామాజికవర్గంగా కమ్మ వారు ఉన్నారన్నది అందరికీ తెలిసిందే. వారు అన్ని రంగాల్లోనూ విస్తరించి ఉన్నారు. ఓ విధంగా చెప్పాలంటే వారు లేని [more]
ఉమ్మడి ఏపీలో అతి ప్రధాన సామాజికవర్గంగా కమ్మ వారు ఉన్నారన్నది అందరికీ తెలిసిందే. వారు అన్ని రంగాల్లోనూ విస్తరించి ఉన్నారు. ఓ విధంగా చెప్పాలంటే వారు లేని రంగమే లేదు అంటారు. ఇక ఎన్టీఆర్ పుణ్యామా అని సినీ రంగంలో నంబర్ వన్ స్థానంలో ఉండడమే కాక రాజకీయ రంగంలో కూడా అగ్ర భాగాన నిలిచారు. అంతవరకూ రెడ్డి రాజ్యంగా కాంగెస్ నేతృత్వంలో పాలన సాగింది. ఆ రెడ్డి పోయి ఈ రెడ్డి వచ్చాడు అన్న మాటే తప్ప కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి సీటు మాత్రం కమ్మలకు ఎప్పటికీ దక్కలేదు. ఆ అసంతృప్తి అలా ఉండగానే బయటకు వచ్చిన నాదెండ్ల భాస్కరరావుతో కలిపి ఎన్టీఆర్ తెలుగుదేశం ఏర్పాటు చేశారు. ఘన విజయం సాధించి తొమ్మిది నెలలలోనే అధికారంలోకి వచ్చింది టీడీపీ, అది లగాయితూ రాజకీయల్లో అజేయంగా వెలిగిపోతూ వచ్చింది.
మసకేసిన మబ్బులా…..
ఇక చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ పగాలు వచ్చాక కూడా మొదట్లో దూకుడు ఎక్కువగా ఉండేది. అయితే వైఎస్సార్, కేసీఆర్ వంటి నాయకుల నుంచి గట్టి పోటీ ఎదురుకావడంతో టీడీపీ బాగా వెనకబడింది. విభజన తరువాత కేవలం పదమూడు జిల్లాలకే పరిమితం ఆ పార్టీ కావాల్సివచ్చింది. అయితే ఇక్కడ కూడా జగన్ రూపంలో పెను ముప్పు ఎదురై ఏకంగా కమ్మలను రాజ్యాధికారం నుంచి దూరం చేసింది. అది తాత్కాలికమా, శాశ్వతమా అన్నది కూడా వారిలో పెద్ద సందేహంగా ఉంది. అంతే కాక కలవరంగా కూడా ఉంది.
సినీకళ చెదిరిందిగా…?
తెలుగు సినిమా అంటే కమ్మలదే ప్రముఖ స్థానం అని చెప్పాలి. మొదట సినిమాల్లో బ్రాహ్మణులు హీరోలుగా ఉండేవారు కమ్మలు పెట్టుబడులు పెడుతూ తెర చాటున ఉండేవారు. అలా తెర ముందుకు ఎన్టీఆర్, అక్కినేని రూపంలో వచ్చారు.అలా కొన్ని దశాబ్దాల పాటు వెండితెరను శాసించారు. మరో సామాజికవర్గం ఎదగకుండా అక్కడ రాజకీయాలు ఉండేవని కూడా ప్రచారంలో ఉంది. సరే అవన్నీ ఎలా ఉన్నా కూడా జనాలు కూడా కులభేధం లేకుండా వారిని గౌరవించారు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి సినీ సీమకు రావడంతో మరో వర్గం పెత్తనం మొదలైంది.
మూడు దశాబ్దాలుగా…?
ఇక చిరంజీవి హవా అలా ఇలా లేదు. మూడు దశాబ్దాలుగా ఎదురులేని హీరోగా ఆయన సినీ సీమను శాసించారు. ఆయన వారసులుగా తమ్ముడు పవన్ కళ్యాణ్, కుమారుడు రాం చరణ్, మేనల్లుడు అల్లు అర్జున్, ఇంకా ఎందరో హీరోలు వచ్చి బాగానే రాణిస్తున్నారు. ఇక కమ్మ సామాజికవర్గం ఇక్కడ కూడా వెనకబడిపోయింది. వారినికి నందమూరి కుటుంబం నుంచి బాలక్రిష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు ఇద్దరే గట్టి పోటీదారుగా కనిపిస్తూ వచ్చారు. మిగిలిన హీరోలు ఆ సామాజికవర్గానికి చెందినా కూడా మాస్ అప్పీల్ లేకపోవడంతో మెగా ఫ్యామిలీని ఢీ కొట్టలేరన్న భావన ఉండేది. ఇక టీడీపీ రాజకీయ కళ తప్పడంతో సినీ రంగంలోనూ బాలయ్య వంటి వారికి చేదు అనుభవాలు వరసగా ఎదురవుతున్నాయి. మిగిలిన కమ్మ హీరోలు కూడా సైలెంట్ అయిపోవాల్సివస్తోంది. మొత్తానికి చూసుకుంటే అటు రాజకీయ రంగం, ఇటు సినీరంగాన్ని ఒకనాడు శాసించిన కమ్మలకు అన్ని వైపులా ఎదురుగాలి వీస్తూండడంతో ఉక్కబోతగా ఉందని అంటున్నారు. దాని నుంచి వస్తున్నవే బాలయ్య వంటి వారి నోటి వెంట మాటల తూటాలు అంటున్నారు. దాని వెనక కూడా కొందరి మద్దతు ఉందని అంటున్నారు. మొత్తానికి కమ్మలకు కాని కాలమే నడుస్తోందని చెప్పాలేమో.